Visakha Airport
ఉత్తరాంధ్ర ఎయిర్ ట్రాఫిక్ చరిత్రలోనే పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జీఎంఆర్ సంస్థ ప్రాజెక్ట్ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈరోజు అంటే ఆగస్ట్ 17 సోమవారం నుంచి తన అఫీషియల్ కమర్షియల్ ఆపరేషన్లను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.
ఒకవైపు దశాబ్దాలుగా సేవలిందించిన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు ఆగస్ట్ 16 ఆదివారం రాత్రి ఢిల్లీ ఫ్లైట్‌తో ప్రయాణికులు గ్రాండ్ బైబై చెప్పగా..అర్ధరాత్రి దాటాక భోగాపురం రన్‌వేపై ఫ్లైట్ ఇంజిన్లు గర్జించడంతో సరికొత్త శకం మొదలైంది. దీంతో అసలు ఫస్ట్ డే నే సింగపూర్ వరకూ విమానాలు ఏవి, ల్యాండ్ ఇచ్చిన రైతులకు సర్కార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటనే ఇంట్రెస్టింగ్ విషయాలను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు.
ఈరోజు నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్ట్( Visakha Airport)కు ఉన్న పాపులర్ ఇంటర్నేషనల్ కోడ్ VTZ ఇకపై పూర్తిస్థాయిలో భోగాపురం నుంచే రన్ కానుంది. ఈ ఓపెనింగ్ డే రోజున ఏకంగా 31 ఫ్లైట్స్ రాకపోకలు సాగించబోతుండగా, సుమారు 6 నుంచి 7 వేల మంది ప్యాసింజర్స్ ప్రయాణిస్తారని అంచనా వేశారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌గా స్కూట్ ఎయిర్‌లైన్స్ సర్వీస్ సింగపూర్‌కు టేకాఫ్ కాగా, ఉదయం 6:45 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చే ఇండిగో ఫ్లైట్‌కు ఎయిర్‌పోర్ట్ అధికారులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా వంటి లోకల్ సిటీలతో పాటు సింగపూర్, అబుధాబి వంటి గ్లోబల్ డెస్టినేషన్లకు డైరెక్ట్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చేసింది.
కాగా ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన 2,200 మంది రైతు కుటుంబాలకు ఏపీ గవర్నమెంట్ అత్యంత అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఫస్ట్ డే మొదటి విడతగా దాదాపు 165 మందిని విమానంలో ఫ్రీగా ప్రయాణం చేసేలా పక్కా ప్లాన్ చేసింది. మిగిలిన రైతులకు కూడా రాబోయే రోజుల్లో ఫేజ్‌ల వారీగా ఈ క్రేజీ ఛాన్స్ ఇవ్వనున్నారు. అయితే భూములిచ్చిన రైతన్నలను ఇలా ఎయిర్ ప్యాసింజర్లుగా గౌరవించడంతో వారంతా ఎమోషనల్ అయ్యారు.
ఇక షీలానగర్‌లో ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల కోలాహలం ఆదివారంతో కంప్లీట్ అయిపోయినట్లు అయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కండీషన్ల ప్రకారం సండే నైట్ నుంచే అక్కడ కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఇకపై ఆ రన్‌వే కేవలం ఇండియన్ నేవీ, మిలిటరీ డిఫెన్స్ అవసరాలకు అలాగే వీఐపీ చార్టర్డ్ విమానాల రాకపోకలకు మాత్రమే పరిమితం కాబోతోంది.
మరోవైపు విశాఖ సిటీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణీకులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ( APSRTC) రెడీ అయింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి ఏరో ఎక్స్‌ప్రెస్ పేరుతో 20 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించారు. ఇవి తెల్లవారుజామున గం. 4.30 నిమిషాల నుంచి రాత్రి గం. 10 . 30 నిమిషాల వరకూ అందుబాటులో ఉండనున్నాయి.
మొత్తానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోవడమే కాకుండా.. రీజనల్ ఎకానమీ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం గ్యారెంటీగా కనిపిస్తోందన్న సంతోషం స్థానికులలో కనిపిస్తోంది.
Sunset Clause Relationship : లవ్ విత్ ఎక్స్‌పైరీ డేట్.. డేటింగ్ వరల్డ్‌లో కొత్త ట్రెండ్
