Hyderabad : రేపటి నుంచే వన్ వే.. కేబీఆర్ పార్క్ వైపు వెళ్లేవారికి అలర్ట్..

Hyderabad : కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Hyderabad

ఇటు మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్లాలన్నా, అటు అమీర్‌పేట్ , పంజాగుట్ట వెళ్లాలన్నా, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్ వెళ్లాలన్నా కేబీఆర్ పార్క్ టచ్ చేయాల్సిందే. అన్ని ప్రధాన మార్గాలకు ఇది మెయిన్ పాయింట్. అలాంటి కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్ వే ట్రాఫిక్ ఉండబోతోంది.

మంగళవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. దీనిపై ఇప్పటికే ప్రకటన చేసిన ట్రాఫిక్ పోలీసులు 24 గంటల ముందు ఈ వన్ వే ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల రోడ్డు వెడల్పు తగ్గి ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో, వాహనాల రాకపోకలను సులభంగా సాగేలా చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి పోలీసులు ఈ వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు.

రోజువారీ ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. వన్‌వే నిబంధనలు సుమారు 18 నెలల పాటు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు. ఈ మార్పుల రీత్యా కొన్ని ప్రధాన ప్రదేశాలకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ, డైవర్షన్ మార్గాలను అనుసరించాలి.

ఎన్టీఆర్ భవన్‌ వద్ద డైరెక్టుగా రైట్ టర్న్ తీసుకోవడం కుదరదు. ఎన్టీఆర్ భవన్‌ వద్ద లెఫ్ట్ తీసుకొని, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యా భవన్ మీదుగా రోడ్ నెంబర్ 45 చేరుకోవాలి. లేదా జర్నలిస్ట్ కాలనీ మార్గాన్ని వాడొచ్చు. చెక్‌పోస్ట్ నుంచి వచ్చే వాహనాలు జింఖానా క్లబ్ వద్ద ఉన్న మీడియన్ ద్వారా ఎడమ వైపు లేన్‌కు మారి, ఎన్టీఆర్ భవన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకోవాలి. స్టడీ సర్కిల్ దగ్గరి మీడియన్ ఓపెనింగ్ ద్వారా లెఫ్ట్ లేన్‌లోకి మారి రోడ్ నెంబర్ 10 కి వెళ్లాలి.

Hyderabad

రోడ్ నెంబర్ 12 వెళ్లేవారు క్యాన్సర్ హాస్పిటల్ దాటిన తర్వాత ఎడమ వైపునకు వెళ్లాలి. రద్దీని తగ్గించడానికి రోడ్ నెంబర్ 14, నంది నగర్, రోడ్ నెంబర్ 10 , జహీర్ నగర్ దారులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలనీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కాగా కొత్త ఫ్లైఓవర్ , అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ఇప్పుడు వాహనదారులకు కాస్త ఇబ్బంది కలిగినా.. పూర్తైన తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయనీ , ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

Sunset Clause Relationship : లవ్ విత్ ఎక్స్‌పైరీ డేట్.. డేటింగ్ వరల్డ్‌లో కొత్త ట్రెండ్

Exit mobile version