Investment
ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మ్యూచువల్ ఫండ్స్. వీటికి క్రేజ్ బాగానే ఉన్నా, నేటి తరం మాత్రం తక్కువ టైమ్‌లోనే ఎక్కువ ప్రాఫిట్స్ చూడాలన్న టార్గెట్‌తో నేరుగా ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తోంది.
లెక్కల ప్రకారం చూస్తే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇయర్‌కు యావరేజ్‌గా 10 శాతం వరకు రిటర్న్స్ వస్తే, అదే మంచి షేర్లను ఎంచుకుని మనమే ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 30 శాతం వరకూ లాభాలు సాధించే అవకాశం ఉంది. అయితే నార్మల్ పొదుపు పథకాలతో పోల్చితే మాత్రం.. ఈక్విటీ మార్కెట్ లాంగ్ రన్‌లో తిరుగులేని లాభాలను ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
అలా అని కేవలం స్క్రీన్‌లపై కనిపించే భారీ ప్రాఫిట్స్ చూసి.. బ్లైండ్‌గా దిగిపోవడం కరెక్ట్ కాదని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మనం ఎంత సంపాదించగలమనే దానికంటే, మార్కెట్ గురించి మనకెంత నాలెడ్జ్ ఉంది, ఎంత డిసిప్లిన్‌తో ఇన్వెస్ట్ చేయగలమని ఆలోచించడమే ఇక్కడ ముఖ్యమని అంటున్నారు.
ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడమనేది హై రిస్క్‌తో కూడుకున్న పని అన్న విషయం మైండ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ లాభాలు ఎంత స్పీడ్‌గా వస్తాయో, నష్టాలు కూడా అంతే వేగంగా వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో వేల సంఖ్యలో కంపెనీలు ట్రేడ్ అవుతున్న విషయం తెలిసిందే .అయితే వాటిలో ఏ కంపెనీ ఫ్యూచర్‌లో బాగా పెర్ఫామ్ చేస్తుంది, దేనిలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయనేది అంచనా వేయడం అంత ఈజీ కాదు. దీనికోసం ప్రతిరోజూ కూడా మార్కెట్ కదలికలను గమనించాలి. అలాగే వేర్వేరు బిజినెస్ మోడల్స్, ఎకనామిక్ ట్రెండ్స్ పైన అవేర్‌నెస్ పెంచుకోవాలి.
అన్నింటికంటే ముందు అనుకోని విధంగా మార్కెట్ పడిపోతున్నప్పుడు ఏ మాత్రం, టెన్షన్ పడకుండా, భయపడకుండా మన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా తమ కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉన్నవారికి దీనికోసం టైమ్ అంతగా కేటాయించడం కుదరకపోవచ్చు. అందుకే ఎలాంటి అవగాహన, రీసెర్చ్ లేకుండా స్టాక్స్ కొనే ఆలోచనను వాయిదా వేసుకుంటేనే మంచిది.
ఈ ప్రాబ్లమ్‌కు బెస్ట్ సొల్యూషన్ మ్యూచువల్ ఫండ్స్ అనే అంటారు ఎక్స్‌పర్ట్స్. ఇక్కడ మీ డబ్బులను ఫండ్ మేనేజర్లు హ్యాండిల్ చేస్తారు. వాళ్లు మార్కెట్ పైన పూర్తి గ్రిప్ ఉన్న ఎక్స్‌పర్ట్స్ కాబట్టి, మీ తరఫున రీసెర్చ్ చేసి వేర్వేరు రంగాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనిలో సిప్ ద్వారా ప్రతి నెలా చిన్న చిన్న మొత్తాలను ఇన్వెస్ట్మెంట్ రూపంలో కంటిన్యూ చేయొచ్చు.
అయితే మార్కెట్ బాగా పడిపోయినప్పుడు ఫండ్ మేనేజర్లు కూడా ఒత్తిడికి లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే వారు ఏ షేర్లను ఎందుకు కొంటున్నారనే పూర్తి వివరాలను ఇన్వెస్టర్లతో షేర్ చేసుకోరు. దీనివల్ల మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకునేవారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరకడం కష్టం అవుతుంది. అయినా సరే, బిజీగా ఉంటూ మార్కెట్‌ను ఫాలో అవ్వలేని వారికి మాత్రం ఇదే సేఫ్ ఆప్షన్.
ఇన్వెస్ట్‌మెంట్(Investment)లో సక్సెస్ అవ్వాలంటే ఎవరికైనా కేవలం బ్రెయిన్ ఉంటే సరిపోదు, దానికి తోడు ఓపిక, ఎమోషనల్ కంట్రోల్ కూడా చాలా అవసరం. నష్టాలు వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా ఉండటం అనేది కొన్ని ఏళ్ల ఎక్స్పీరియన్స్ తర్వాతే ఎవరికైనా వస్తుంది. చిన్న ఏజ్‌లోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ స్కిల్స్ ఈజీగా అలవాటు అవుతాయి.
అందుకే మీ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో ఒక పద్ధతిని ఎప్పుడూ ఫాలో అవ్వాలి. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న డబ్బులో 70 నుంచి 90 శాతం మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సేఫ్‌గా ఇన్వెస్ట్ చేయాలి. దీనివల్ల మీ డబ్బులకు సెక్యూరిటీ ఉంటుంది.
ఇక మిగిలిన 10 నుంచి 30 శాతం అమౌంట్‌ను మీరే డైరెక్టుగా మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్(Investment) చేస్తూ మార్కెట్ నాలెడ్జ్ పెంచుకుంటే మంచిది. ఈ కాంబినేషన్ ఫాలో అయితే మాత్రం తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభాలను సొంతం చేసుకోవచ్చు.
Date Of Birth : ఈరోజు ఏ నెంబర్ వారికి లక్ కలిసి వస్తుంది? ఏ నెంబర్ వారు జాగ్రత్తగా ఉండాలి?
