Gold Price
కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ప్రియులకు షాక్ తగిలింది. పండుగ సమయంలో.. బంగారం ధరలు(Gold Price) మళ్లీ పైపైకి చేరుకుంటున్నాయి. మొన్నటి వరకు కాస్త ఊరటనిచ్చిన పసిడి..ఈరోజు దేశీయ మార్కెట్లో ఊహించని విధంగా పుంజుకుంది. అయితే ఇదే సమయంలో నిన్న వెండి కొనుగోలుదారులకు మాత్రం కాస్త ఊరటనిచ్చే వార్త అందింది.
నేడు ట్రేడింగ్ స్టార్టింగ్‌లో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాలలో మెయిన్ సిటీలయిన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ పట్నం మార్కెట్లలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ. 1లక్ష48వేల50 వద్ద పలుకుతోంది. ఇక జ్యువెలరీ తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల పది గ్రాముల తులం ధర రూ. 1లక్ష35వేల710 మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది.
మరోవైపు సిల్వర్ మాత్రం స్వల్ప ఊరట ఇచ్చింది. కిలో సిల్వర్ కాస్ట్ స్వల్పంగా తగ్గి రూ. 2,29,000 వద్ద స్థిరపడింది. కేవలం తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ అలాగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో కూడా సుమారు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇకదేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర(Gold Price) రూ. 1లక్ష48వేల200 ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1లక్ష35వేల860గా ఉంది. ఇక ముంబై, బెంగళూరు, కోల్‌కతా అలాగే చెన్నై వంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా స్థానిక పన్నులు, ఇతర ఛార్జీల వల్ల స్వల్ప తేడాలు ఉన్నా కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, అమెరికన్ డాలర్‌తో భారత్ రూపాయి మారకం విలువలో వస్తున్న హెచ్చుతగ్గుల వల్ల బంగారం, వెండి రేట్లు ప్రతిరోజూ, ప్రతీ పూటా కూడా మారుతుంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని.. వినియోగదారులు మార్కెట్ ట్రెండ్స్ గమనిస్తూ కొనుగోళ్లు జరపాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Over Thinking : అతిగా ఆలోచిస్తున్నారా? అవతలి వారి మైండ్‌సెట్‌ను కూడా మీరే చదివేస్తున్నారా?
