Just LifestyleLatest News

Over Thinking : అతిగా ఆలోచిస్తున్నారా? అవతలి వారి మైండ్‌సెట్‌ను కూడా మీరే చదివేస్తున్నారా?

Over Thinking : అవతలి పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారో, వారి సిచ్యువేషన్ ఏంటో డైరెక్టుగా అడిగి తెలుసుకునే ఓపిక , ధైర్యం చాలా మందికి ఉండదు.

Over Thinking

మనం మన లైఫ్‌లో చాలా రకాల మనుషులను చూస్తూ ఉంటాం. ఒక్కోసారి ఎదురుగా ఉన్న పర్సన్ ఫేస్‌లో చిన్న చిరునవ్వు లేకపోయినా, ఫోన్ కాల్‌కి, మెసేజ్‌కు వెంటనే రిప్లై ఇవ్వకపోయినా వెంటనే అవతలివారి మనసులో ఒక పెద్ద సినిమానే ప్లే చేసేసుకుంటారు.

కచ్చితంగా తన మీద కోపం వచ్చి ఉంటుంది, తనను కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారని, తన గురించి వెనక ఏదో మాట్లాడుకుంటున్నారని రకరకాలుగా వాళ్లకు వాళ్లే సొంతంగా స్క్రిప్ట్ కూడా రాసేసుకుని, దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం కూడా మొదలు పెట్టేస్తారు.

ఏ మాత్రం క్లారిటీ లేకుండా కేవలం తమ ఊహలను బేస్ చేసుకునే అవతలి వారిని దూరం పెట్టే ఈ విచిత్రమైన మెంటల్ బిహేవియర్ వెనుక చాలా పెద్ద సైకాలజీ దాగి ఉంది. అసలు ఈ ఓవర్‌థింకింగ్(Over Thinking), అజెంప్షన్స్ మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను సైకాలజిస్టులు వివరిస్తున్నారు.

సైకాలజీ భాషలో దీన్ని ప్రొజెక్షన్ లేదా కాగ్నిటివ్ డిస్టోర్షన్ (Cognitive Distortion) అంటారు. అవతలి పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారో, వారి సిచ్యువేషన్ ఏంటో డైరెక్టుగా అడిగి తెలుసుకునే ఓపిక , ధైర్యం చాలా మందికి ఉండదు. కానీ తమకు ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ వల్ల, మెచ్యూర్డ్‌గా ఆలోచించే మైండ్ లేకపోవడం వల్ల ఆ పర్సన్ కూడా తన గురించి అలాగే నెగిటివ్‌గా ఆలోచిస్తున్నారని ఫిక్స్ అయిపోతారు.

ఉదాహరణకు, ఆఫీసులో కొలీగ్ సరిగ్గా మాట్లాడకపోతే..తానంటే వారికి పడదని డిసైడ్ అయిపోయి, వెంటనే ఎదురు తిరగడం లేదా మాట్లాడటం మానేయడం చేస్తుంటారు. కానీ నిజానికి ఆ పర్సన్‌కు ఆ రోజు ఇంట్లో ఏదో పెద్ద టెన్షన్‌లో ఉండి ఉండొచ్చు లేదా పర్సనల్ ప్రాబ్లెమ్‌తో సతమతమవుతుంటూ ఉండొచ్చు. కానీ వీళ్ల ఊహలకు, రియాలిటీకి అసలు సంబంధమే ఉండదు.

ఇలాంటి మనుషులు సడన్‌గా సైలెంట్ అయిపోవడానికి మరో ప్రధాన కారణం సెల్ఫ్-ప్రొటెక్షన్ అని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవతలి వాళ్లు తనను హర్ట్ చేస్తారేమో అనే ఆలోచనతో వాళ్లే ముందుగా దూరం జరిగిపోవడం, అలిగినట్లు ప్రవర్తించడం చేస్తుంటారు.

అక్కడ జరిగింది ఏం లేకపోయినా కూడా తాను కూడా వాళ్లలాగే రియాక్ట్ అవుతానని..తనను పట్టించుకోకపోతే తాను కూడా అస్సలు పట్టించుకోననే ఈగో గోడలను కట్టేసుకుంటారు. కానీ ఇదంతా కేవలం వారి మైండ్ గేమే తప్ప, రియాలిటీలో అటువైపు నుంచి అంతా చాలా నార్మల్‌గానే ఉంటారు.

ఈ రకమైన ఆలోచనా విధానం వల్ల ముందు వారిని వారే మానసికంగా ఎంతగానో హింసించుకునేలా చేస్తుంది. ప్రతీ చిన్న విషయాన్ని ఓవర్‌థింకింగ్(Over Thinking) చేయడం వల్ల ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది.దీనివల్ల నిద్రలేమి వస్తుంది, రిలేషన్స్‌లో అనవసరమైన దూరం పెరిగిపోతుంది.

దీనికి కమ్యూనికేషన్ ఒకటే ఏకైక పరిష్కారం. ఏదైనా అనుమానం వస్తే, మనసులో ముందే ఒక అనుమానం పెట్టుకుని దూరంగా ఉండేకంటే నువ్వు కొంచెం డిఫరెంట్‌గా ఎందుకు ఉన్నావు? ఏమైనా ప్రాబ్లెమా అని డైరెక్టుగా అడగడంలో తప్పు లేదు. మాట్లాడితే తొలగిపోయే చిన్నచిన్న అపార్థాల కోసం మంచి బంధాలను దూరం చేసుకోవడం ఎప్పుడూ కరెక్ట్ కాదు.

ఊహలు ఎప్పుడూ కూడా అన్ని వేళలా నిజం కావు. అందుకే నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తే చాలా బంధాలు నిలబడతాయి. కాబట్టి ఇకనైనా మీ అంతట మీరే సొంతంగా స్టోరీలు అల్లేసుకోవడం మానేసి, రియాలిటీని ఫేస్ చేయడం అలవాటు చేసుకోవడం నేర్చుకోండి.

Marriage : మూవీల్లో చూపించేది వేరు పెళ్లయ్యాక సీన్ వేరు…బంధాన్ని సైలెంట్‌గా దెబ్బతీసే చిన్న తప్పులు చేయకండి..

Related Articles

Back to top button