Gold Price
దీపావళి పండుగకు బంగారం కొనాలనుకుంటున్న వినియోగదారులకు స్థానిక బులియన్ మార్కెట్ బిగ్ షాక్ ఇచ్చింది. నిన్నటివరకు చివరకు ధనత్రయోదశికి కూడా కాస్త శాంతించి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు, శనివారం ఉదయానికి ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్నాయి.
శుక్రవారం రోజు బంగారం ధరల తగ్గుదలతో ఊరట చెంది గోల్డ్ షాపింగ్‌కు ప్లాన్ చేసుకున్న సామాన్యులకు, తాజా పెరుగుదల నిరాశను మిగిల్చింది. తగ్గినపుడు వందల్లో తగ్గి పెరిగినపుడు మాత్రం వేలల్లో పెరుగుతుందనే సామాన్యుల మాటలను నిజం చేస్తూ వారికి షాకిచ్చింది.శనివారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.1,806 వరకూ పెరిగి రికార్డు స్థాయికి చేరింది.
కాగా హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ.1లక్ష43వేల450కి చేరుకుంది. దీంతో పాటు ఆభరణాల తయారీకి ఎక్కువగా వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1లక్ష31వేల490 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 18 క్యారెట్ల పుత్తడి ధర కూడా గణనీయంగా పెరిగి తులం రూ.1లక్ష7వేల580గా నమోదైంది. ధనత్రయోదశి నుంచి దీపావళి వరకూ పుత్తడి కొనుగోళ్లు భారీగా ఉండే అవకాశం ఉండటంతో, తాజా పెంపు పండగ షాపింగ్ బడ్జెట్‌పై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపనుంది.
కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన సిటీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌తో పాటు ఏపీ లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రాంతాల్లోనూ ఈ పెరిగిన కొత్త రేట్లే అమలవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు అమెరికన్ డాలర్ మార్పిడి విలువలో హెచ్చుతగ్గులు వంటి అంశాలే ఇప్పుడు ఇండియన్ బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
