Love Life
జీవితంలో ఎదగడానికి తమ డ్రీమ్స్ నిజం చేసుకోవాలని ట్రై చేసేవాళ్లకు, ఎప్పుడూ పనిలో బిజీగా ఉండేవాళ్లకు మ్యారేజ్ లేదా లవ్ లైఫ్ (Love Life) సరిగ్గా ఉండదని చాలామందిలో ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ, కొందరి పర్సనల్ అనుభవాల బట్టి వచ్చే ఈ ఆలోచన ఎప్పుడూ అందరిలోనూ నిజం కావాలని లేదు. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా, ఇష్టమైన వాళ్లతో రిలేషన్ చాలా చక్కగా కాపాడుకోవడం పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుంది.
సక్సెస్ అంటే కేవలం మంచి జాబ్, ఎర్నింగ్స్ మాత్రమే కాదు. అయితే, ఆ సంపాదన హడావుడిలో పడి పార్ట్‌నర్‌తో ఉండాల్సిన అనుబంధం, ప్రేమ వెనుకబడిపోతేనే అసలు ప్రాబ్లెమ మొదలవుతుంది. అందుకే ప్రేమను, కెరీర్‌ను వేర్వేరుగా చూడకుండా రెండింటికీ తగినంత సమయం కేటాయించడమే లవ్ లైఫ్(Love Life) ను కాపాడుకునే అసలైన రహస్యం అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఎవరితోనైనా రిలేషన్ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండాలంటే ఏదో ఒకరోజు ప్రయత్నిస్తే సరిపోదు, రోజూ దానిపైన శ్రద్ధ పెట్టాలి. ఆఫీస్ పని గంటలు, టెన్షన్లు, డెడ్‌లైన్లు పార్ట్‌నర్‌తో గడపాల్సిన టైమ్‌ను తినేస్తుంటాయి. అయితే డైలీ లైఫ్‌లో కొన్ని చిన్న చిన్న అలవాట్లు, ఒకరిపై ఒకరికి ఉండే కేరింగ్ ఆ దూరాన్ని ఈజీగా తగ్గిస్తాయి.
వీలు చేసుకుని మరీ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం, ఎంత బిజీగా ఉన్నా కూడా పనుల మధ్యలో చిన్న ఫోన్ కాల్ చేసి పలకరించుకోవడం, ఫోన్లు పక్కన పెట్టి ఇద్దరూ కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం వంటి చిన్న విషయాలు వారి రిలేషన్‌ను మరింత గట్టిగా మారుస్తాయి.
అంతేకాకుండా, ఇద్దరూ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఆఫీస్ కబుర్లే కాకుండా, తమ పార్ట్‌నర్ కష్టాలు, వారి ఫీలింగ్స్ తెలుసుకోవడానికి కూడా ఈక్విల్ వ్యాల్యూ ఇవ్వాలి. ఇది ఇద్దరినీ ఒకరి జీవితంలో మరొకరు ఇంపార్టెంట్ అని ఫీలయ్యేలా చేస్తుంది. ఎప్పుడో ఇచ్చే పెద్ద పెద్ద గిఫ్ట్‌ల కంటే, రోజూ ఇచ్చే టైమ్ వారిద్దరి బంధాన్ని కాపాడుతుంది.
ఏ బంధంలోనైనా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తమ గోల్స్, ఆఫీస్ టెన్షన్లు, ఫ్యూచర్ ప్లాన్ల గురించి ఇద్దరూ ఎలాంటి సీక్రెట్స్ లేకుండా ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఆఫీస్‌లో రాబోయే రోజుల్లో పని ఎక్కువగా ఉంటే, ఆ విషయాన్ని ముందే పార్ట్‌నర్‌కు చెప్పడం మంచిది. దీనివల్ల ముందే వారిని ప్రిపేర్ చేయడం వల్ల ఎలాంటి అపోహలు రావు. అంతేకాకుండా అవతలి వ్యక్తి చెప్పేది ఎలాంటి విషయం అయినా ఓపికగా వినాలి తప్ప, అన్నీఅడ్జస్ట్ అవ్వు అని మాటిమాటికి అనకూడదు.
ఒకరి గ్రోత్‌ను మరొకరు సంతోషంగా ఆహ్వానించాలి. కెరీర్‌లో మనం సాధించిన సక్సెస్ వెనుక మనకు సపోర్ట్ చేసిన పార్ట్‌నర్ రోల్‌ను ఎప్పుడూ మర్చిపోకూడదు. చిన్న చిన్న పనులకు థ్యాంక్స్ చెబుతూ, వారిని అప్రిషియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బంధాన్ని బ్యాలెన్స్ చేయడం అంటే ఎప్పటికప్పుడు ఒకరికొకరు ప్రయారిటీని ఇచ్చుకుంటూ మనసు విప్పి మాట్లాడుకోవడానికి కొంత టైమ్ కేటాయించుకోవాలి.
SmartPhone Prices : మొబైల్స్‌పై ఏఐ ఎఫెక్ట్.. 30 శాతం వరకు పెరగనున్న ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు
