Gold Rates
కొద్ది రోజులుగా దేశీయ బులియన్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న బంగారం ధరల తగ్గుదలకు టెంపరరీగా బ్రేక్ పడింది. గడిచిన వారం రోజుల వ్యవధిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై దాదాపు రూ.13,000 కంటే ఎక్కువగా ధర తగ్గింది. అయితే ఆదివారం నవంబర్ 22వ తేదీన నమోదైన సమాచారం ప్రకారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు స్వల్పంగా పుంజుకుని, ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 3,881 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రిలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1లక్ష44వేల292 వద్ద ముగిసింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1లక్ష32వేల260 వద్ద స్థిరంగా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర(Gold Rates) రూ.1లక్ష44వేల465 గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1లక్ష32వేల433 వద్ద లభిస్తోంది. ముంబై, కోల్కతా, చెన్నై వంటి మెయిన్ సిటీలలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1లక్ష44వేల292 గాను, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1లక్ష32వేల260 గాను కొనసాగుతున్నాయి.
ఇక సిల్వర్ రేట్లను పరిశీలిస్తే, దేశీయంగా వెండి రేటు కూడా ఈరోజు స్థిరంగానే ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సిటీలలో కేజీ సిల్వర్ కాస్ట్ ప్రస్తుతం రూ.1లక్ష75వేల వద్ద మార్కెట్లో అందుబాటులో ఉంది. గ్లోబల్ మార్కెట్ సంకేతాల ఆధారంగా రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలలో మళ్లీ ఏ రకమైన మార్పులు ఉంటాయో వేచి చూడాలి.
Adarsha Kutumbam OTT : మరో 5రోజుల్లో ఓటీటీలోకి వెంకీ మామ ఆదర్శ కుటుంబం..ఎక్కడ? ఎప్పుడు?
