Adarsha Kutumbam OTT
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47. కుటుంబ కథా మూవీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వెంకీ, తనదైన మార్క్ సంభాషణలతో అలరించే త్రివిక్రమ్‌లు కలిసి చేసిన ఈ క్లీన్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీ అక్టోబర్ 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ప్రేక్షకాదరణ పొందింది. శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతీ, నివేదా పేతురాజ్ గ్లామర్ అండ్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత, డిజిటల్ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ డిజిటల్ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ.40 కోట్లకు పైగా సొంతం చేసుకున్నఆదర్శకుటుంబం మూవీ. అందుతున్న నమ్మదగిన వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 27వ తేదీ శుక్రవారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ప్రసారానికి రానుంది. అయితే దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన రాబోతోంది.
ఎస్. రాధాకృష్ణ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో నారా రోహిత్, రాజ్ ప్రజ్వల్,రావు రమేష్, సత్య, వెన్నెల కిశోర్, ఉదయ్భీర్ సంధూ తదితరులు ముఖ్య పాత్రలలో మెరిశారు. థమన్ సంగీతం, రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ మూవీకి అదనపు బలాన్ని అందించాయి. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా అలరించిన ఈ సినిమా ఓటీటీ వేదికపై ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.
Lava Smart 4 Pro : పవర్ ఫుల్ బ్యాటరీ, ఐఫోన్ లుక్..రూ.10,999 కే అదిరిపోయే ఫీచర్లు..
