HDFC : హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్..జులై 1 నుంచి మారనున్న ఈ రూల్స్

HDFC : హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తున్న పాపులర్ కార్డ్ అయిన రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో బ్యాంక్ ముఖ్యంగా మార్పులు చేసింది.

HDFC

హెచ్‌డీఎఫ్‌సీ తమ క్రెడిట్ కార్డు వాడేవారికి పెద్ద షాక్ ఇచ్చింది. రాబోయే జులై 1 నుంచి క్రెడిట్ కార్డులకు సంబంధించి కొన్ని కీలక మార్పులను అమలు చేయనున్నట్లు బ్యాంక్ అఫీషియల్‌గా ప్రకటించింది.

మెయిన్‌గా ఎయిర్‌పోర్టులలో కల్పించే ఫ్రీ లాంజ్ యాక్సెస్ సౌకర్యంతో పాటు, రివార్డ్ పాయింట్ల విధానంలో భారీగా కోత విధిస్తూ బ్యాంక్ ఈ డెసిషన్ తీసుకుంది. ఇప్పటికే మిగిలిన బ్యాంకులన్ని కూడా ఇలాంటి కఠిన నిబంధనలను పాటిస్తుండగా, ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) కూడా అదే బాటలో వెళుతోంది.

హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) అందిస్తున్న పాపులర్ కార్డ్ అయిన రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో బ్యాంక్ ముఖ్యంగా మార్పులు చేసింది. ఇప్పటివరకు ఎలాంటి కండిషన్స్ లేకుండా దేశీయ ఎయిర్‌పోర్టులలో ఫ్రీ లాంజ్ సౌకర్యాన్ని వాడుకునే అవకాశం ఉండగా, ఇకపై దానికి కొన్ని ఆంక్షలు విధించింది. కొత్త రూల్స్ ప్రకారం, వినియోగదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నిర్దేశించిన నిర్దిష్ట మొత్తాన్ని ఖర్చు చేస్తేనే.. తర్వాతి ఇయర్‌లో ఉచిత లాంజ్ సదుపాయాన్ని పొందడానికి అర్హతను సాధిస్తారు.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వోచర్ బేస్డ్ లాంజ్ యాక్సెస్ విధానాన్ని పూర్తిగా కేన్సిల్ చేస్తున్నట్లు బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. దీని ప్రకారం లాస్ట్ ఇయర్‌లో కనీసం రూ. 60 వేలు ఖర్చు చేసిన వారికి మాత్రమే తర్వాతి సంవత్సరంలో 3 ఫ్రీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లు లభిస్తాయి.

ఉదాహరణకు ఎవరైనా జులై టు సెప్టెంబర్ 2026 త్రైమాసికంలో ఫ్రీ లాంజ్ సౌకర్యం పొందాలనుకుంటే మాత్రం, వారు అంతకుముందు క్వార్టర్ అయిన ఏప్రిల్ టు జూన్ త్రైమాసికంలో తప్పనిసరిగా 60 వేల రూపాయలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసి ఉండాలి.

HDFC

ఈ లాంజ్ యాక్సెస్ కండిషన్లతో పాటు రివార్డ్ పాయింట్ల విధానంలో కూడా బ్యాంక్ మార్పులను తీసుకువచ్చింది. నూతన కండిషన్ల ప్రకారం అర్హత కలిగిన లావాదేవీలకు గాను ప్రతి రూ. 150 ఖర్చుకు 4 రివార్డ్ పాయింట్లు, అలాగే ప్రతి రూ. 200 ఖర్చుకు 5 పాయింట్ల చొప్పున లభిస్తాయి.

ఈ రివార్డు పాయింట్ల మార్పుల విధానం ఇప్పటికే మే 15 నుంచే అమల్లోకి వచ్చేసింది. దీంతో పాటు, భారత్‌లో ఉంటూనే విదేశాలలో నమోదైన వ్యాపారులతో రూపాయల రూపంలో జరిపే అంతర్జాతీయ లావాదేవీలపై విధించే డీసీసీ రుసుమును 1.75 శాతానికి సవరిస్తూ బ్యాంక్ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మార్పులన్నీ జులై నుంచి పూర్తిస్థాయిలో అమలు కానుండటంతో హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) క్రెడిట్ కార్డులు వాడుతున్నవారిపై దీని ప్రభావం గట్టిగానే పడబోతోంది.

AP Cabinet : ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. మంత్రి మండలి ఓకే చెప్పిన 37 ప్రతిపాదనలు ఏంటి?

Exit mobile version