Wife Exchange : సిటీలలో కపుల్ స్వింగింగ్ కల్చర్.. వైఫ్ ఎక్స్ఛేంజ్ మైండ్‌సెట్ ఎందుకు పెరుగుతుంది?

Wife Exchange : కపుల్ స్వింగింగ్ లేదా వైఫ్ ఎక్స్ఛేంజ్ పేరుతో వెలుగు చూస్తున్న ఘటనలు మెట్రో కల్చర్‌లోని డార్క్ సైడ్‌ను ఎక్స్‌పోజ్ చేస్తున్నాయి.

Wife Exchange

హై-ఎండ్ మెట్రో లైఫ్‌స్టైల్, ఓపెన్ మైండెడ్‌ పీపుల్, మోడర్నైజేషన్ ముసుగులో చాలా సిటీలలో కొన్ని డార్క్ ట్రెండ్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. ఇండియన్ సోషియో కల్చరల్ ఫ్యాబ్రిక్‌లో మ్యారేజ్ సిస్టమ్‌కు ఉన్న పవిత్రతను, పర్సనల్ ఎథికల్ బౌండరీస్‌ను చాలామంది కంప్లీట్‌గా పక్కదోవ పట్టిస్తున్నారు.

కపుల్ స్వింగింగ్ లేదా వైఫ్ ఎక్స్ఛేంజ్(Wife Exchange) పేరుతో వెలుగు చూస్తున్న ఘటనలు మెట్రో కల్చర్‌లోని డార్క్ సైడ్‌ను ఎక్స్‌పోజ్ చేస్తున్నాయి. రిలేషన్‌షిప్‌లో మెయిన్‌గా ఉండాల్సిన ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకం, ఎమోషనల్ కనెక్ట్‌ను కంప్లీట్‌గా పక్కనపెట్టేసి, సొంత పార్ట్‌నర్‌ను వేరొకరితో షేర్ చేసుకునే ఈ డిస్టర్బ్డ్ సైకాలజీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లి అనే బంధం ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే ఎమోషనల్ అండ్ సోషల్ అండర్‌స్టాండింగ్. అయితే, మోడర్నైజేషన్ పేరుతో వెస్టర్న్ కల్చర్‌ను గుడ్డిగా ఫాలో అవుతూ సిటీస్‌లో సర్క్యులేట్ అవుతున్న వైఫ్ ఎక్స్ఛేంజ్(Wife Exchange) లేదా స్వింగింగ్ అనే కాన్సెప్ట్ మెట్రో కల్చర్‌కు ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది.

నిజానికి ఈ వైఫ్ ఎక్స్ఛేంజ్ మైండ్‌సెట్ ఒక్కరోజులో డెవలప్ అయింది కాదు. మైండ్ లెస్ అడిక్షన్స్, రొటీన్ రిలేషన్‌షిప్స్ నుంచి తప్పించుకోవాలనే ధోరణి, ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్‌లో థ్రిల్ , ఎక్స్‌పెరిమెంటేషన్ కోసం చూసే సైకలాజికల్ మైండ్‌సెట్ దీనికి మెయిన్ కారణాలు.

ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్, డేటింగ్ ప్లాట్ ఫామ్స్, క్లోజ్డ్ సోషల్ మీడియా కమ్యూనిటీస్ ద్వారా సేమ్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తులు నెట్‌వర్క్ ఫామ్ చేసుకుంటున్నారు. మ్యాజికల్ బాండింగ్ ఉండాల్సిన రిలేషన్‌షిప్‌ను కేవలం ఫిజికల్ అట్రాక్షన్ , ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలో చూడడమే ఈ డిస్టర్బ్డ్ బిహేవియర్‌కి మూలం అని సైకాలజిస్టులు చెబుతున్నారు.

పర్సనల్ ఎథిక్స్ పరంగా చూస్తే కనుక.. తన పార్ట్‌నర్‌ను ఇంకొకరితో షేర్ చేయడం అలాగే ఈ ప్రాసెస్‌లోకి ఫోర్స్ చేయడం తీవ్రమైన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్‌కు దారి తీస్తుంది. ప్రైవసీ , బౌండరీస్ దాటి ప్రాక్టీస్ చేసే ఇలాంటి వికృత ట్రెండ్స్ వల్ల పార్ట్‌నర్స్ మధ్య రెస్పెక్ట్, లోయల్టీ పూర్తిగా పోతాయి. షార్ట్ టర్మ్ సంతోషం, థ్రిల్ కోసం తీసుకునే ఇలాంటి నిర్ణయాలు లాంగ్ టర్మ్‌లో డిప్రెషన్, ఇన్‌సెక్యూరిటీస్, వివాహ బంధాలు విచ్ఛిన్నమవ్వడానికి దారి తీస్తాయి.

సామాజిక కోణంలో చూస్తే, ఈ లైఫ్‌స్టైల్ వల్ల సామాజిక నిర్మాణం దెబ్బతింటుంది. ఫ్యామిలీ సిస్టమ్‌లోని బ్యాలెన్స్ మిస్ అవ్వడమే కాకుండా, చిల్డ్రన్ అప్ బ్రింగింగ్‌పై దారుణమైన సైకలాజికల్ ఇంపాక్ట్ పడుతుంది. ఇంకా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లైంగిక సంక్రమణ వ్యాధుల రిస్క్స్ పెరగడంతో పాటు, బ్లాక్‌మెయిలింగ్ , క్రైమ్స్ పెరిగే ఆస్కారం ఉంది.

ఇక 15 ఏళ్ల క్రితమే ఈ కల్చర్ ఉందా అనే పాయింట్‌కు వస్తే.. దాదాపు దశాబ్దంన్నర క్రితమే నగరంలోని కొన్ని హై ప్రొఫైల్ సర్కిల్స్, ప్రైవేట్ క్లబ్స్ లేదా ఎక్స్‌క్లూజివ్ ఎలైట్ గ్రూప్స్‌లో ఇటువంటి యాక్టివిటీస్ సీక్రెట్‌గా నడిచేవి. కానీ అప్పట్లో డిజిటల్ మీడియా విస్తృతి, స్మార్ట్‌ఫోన్ యాక్సెస్ , సోషల్ ప్రెజెన్స్ లేకపోవడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రైవేట్ స్పేస్‌కే పరిమితమై ఉండేది.

మరి గతంలో వినిపించని ఈ విషయాలు.. ఇప్పుడు ఎందుకింతగా పబ్లిసిటీ పొందుతున్నాయంటే.. ప్రైమరీగా డిజిటలైజేషన్ అండ్ నెట్‌వర్కింగ్. ఈ రోజుల్లో డేటింగ్ యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ వల్ల ఇటువంటి ఆలోచనలున్నవారు ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు.

Wife Exchange

దీనికి తోడు సైబర్ క్రైమ్ టీమ్స్ అండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చేసే రైడ్స్, లీగల్ కేసెస్ రిపోర్ట్ అవ్వడం, న్యూస్ ఛానెల్స్ , యూట్యూబ్ మీడియాలో పబ్లిక్ డిబేట్స్ జరగడం వల్ల ఈ ఇష్యూ వైడ్ స్ప్రెడ్ అయింది. గతంలో మూసి ఉన్న తలుపుల వెనుక సాగిన ఈ యాక్టివిటీస్, ఇప్పుడు డిజిటల్ స్పేస్ ద్వారా మిడిల్ క్లాస్ వర్గాలకు కూడా రీచ్ అవ్వడంతో సొసైటీ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ దీనిపై సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నాయి.

ఏది ఏమైనా, వైఫ్ ఎక్స్ఛేంజ్(Wife Exchange) లేదా కపుల్ స్వింగింగ్ అనేది మోడర్నిటీ పేరుతో వస్తున్న ఒక డార్క్ సైకలాజికల్ ప్రాబ్లమ్ అంటున్నారు నిపుణులు. పర్సనల్ ఫ్రీడమ్ అండ్ లైఫ్‌స్టైల్ అప్‌గ్రేడేషన్ పేరుతో ఇటువంటి వాటిని జస్టిఫై చేయడం సొసైటీకి ఏమాత్రం మంచిది కాదు. రిలేషన్‌షిప్ వాల్యూస్ ప్రొటెక్ట్ చేసుకోవడం, ఎథికల్ బౌండరీస్ మెయింటెన్ చేయడంతో పాటు డిజిటల్ స్పేస్‌లో లీగల్ మానిటరింగ్‌ను పెంచడం ద్వారా మాత్రమే ఇటువంటి ట్రెండ్స్‌ను అరికట్టడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.

Rashi Phalalu : ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం..ఆ రాశి వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ..

Exit mobile version