OYO
ఇండియన్ స్టార్టప్ అండ్ హోటల్ బిజినెస్ వరల్డ్‌లో ఒక బ్లాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మనందరికీ తెలిసిన ఫేమస్ హోటల్ బుకింగ్ యాప్ ఓయో( OYO) వెనుక ఉన్న మెయిన్ కంపెనీ ప్రిజం.. మార్కెట్లోకి ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) తీసుకురావడానికి సెబీ నుంచి అఫీషియల్ పర్మిషన్ తెచ్చుకుంది.
ఈ ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి ఏకంగా రూ.6,650 కోట్ల భారీ ఫండ్‌ను వసూలు చేయడానికి ఈ కంపెనీ రెడీ అవుతోంది. ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అప్పటి నుంచి ఇన్వెస్టర్లు, బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ మధ్య ఓయో(OYO) గురించి చర్చలు జోరందుకున్నాయి. ఈమధ్య కాలంలో మన దేశ స్టార్టప్ హిస్టరీలోనే రాబోతున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పబ్లిక్ ఆఫరింగ్ ఇది కాబోతోంది.
తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం.. ప్రిజం కంపెనీ తన ఐపీఓ ప్లాన్ పేపర్లను (DRHP) డిసెంబర్ 2025లోనే ఎవరికీ తెలీకుండా చాలా సీక్రెట్‌గా సెబీకి సబ్మిట్ చేసింది. అయితే దానికిప్పుడు గవర్నమెంట్ బోర్డు నుంచి అప్రూవల్ వచ్చేయడంతో కంపెనీ నెక్స్ట్ స్టెప్ వేయబోతోంది. మార్కెట్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, కంపెనీ తన లేటెస్ట్ ఐపీఓ పేపర్లను (UDRHP) జూలై 2026 స్టార్టింగ్‌లో పబ్లిక్‌గా రిలీజ్ చేసి, ఇన్వెస్టర్ల అభిప్రాయాలను తెలుసుకోనుంది.
ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు రూ.6,650 కోట్ల వాల్యూ ఉన్న సరికొత్త షేర్లను మార్కెట్లోకి రిలీజ్ చేయబోతోంది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యే టైమ్‌కి.. ఈ కంపెనీ టోటల్ వాల్యూ దాదాపు రూ.58,000 కోట్ల నుంచి రూ.66,000 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం, ట్రేడింగ్ మార్కెట్లో అత్యంత క్రేజీ అండ్ సక్సెస్‌ఫుల్ లిస్టింగ్స్‌లో ఒకటిగా ఇది నిలుస్తుంది.
ఇంత పెద్ద పబ్లిక్ ఇష్యూను సక్సెస్ చేయడం కోసం.. ప్రిజం కంపెనీ దేశవిదేశాల్లోని టాప్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ను రంగంలోకి దించింది. వీటిలో యాక్సిస్ క్యాపిటల్, సిటీబ్యాంక్, గోల్డ్‌మన్ సాక్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి.
ఈ కంపెనీలన్నీ లీడ్ మేనేజర్లుగా ఉంటూ ఐపీఓ వ్యవహారాలన్నింటిని కూడా దగ్గరుండి చూసుకోనున్నాయి. ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది, ఇన్వెస్టర్లు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ప్రిజం బాస్‌లు క్లియర్ గా గమనిస్తున్నారు. షేర్ మార్కెట్ కనుక స్టడీగా ఉంటే, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద మ్యాటరేం కాదని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
మరోవైపు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేందుకు ఓయో మేనేజ్‌మెంట్ కొన్ని క్రేజీ నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగానే సెబీ మాజీ ఛైర్మన్ అయిన అజయ్ త్యాగిని తమ బోర్డులో ఒక మెయిన్ డైరెక్టర్‌గా కూడా చేర్చుకుంది. దీనివల్ల పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకు కంపెనీపై మరింత నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ నుంచి కూడా ఓయోకు ఒక గుడ్ న్యూస్ అందింది. ప్రిజం కంపెనీకి ఉన్న బిజినెస్ రేటింగ్‌ను స్టేబుల్‌గా ఉంచుతూ మూడీస్ మంచి సపోర్ట్ ఇచ్చింది.
కొన్నేళ్లుగా ఓయో కేవలం బ్రాంచ్‌లను పెంచడంతో పాటు ప్రాఫిట్స్ బాట పట్టడంపై గట్టిగా ఫోకస్ పెట్టింది. విదేశీ బ్రాండ్ జి6 హాస్పిటాలిటీని కొనడం, ప్రీమియం హోటల్స్ నెట్‌వర్క్‌ను పెంచడమే కాదు అలాగే అనవసర ఖర్చులను తగ్గించుకునే స్మార్ట్ ప్లాన్స్ వల్ల 2026 ఫైనాన్షియల్ ఇయర్‌లో కంపెనీ లాభాలు డబుల్ కంటే ఎక్కువగా పెరిగి సుమారు రూ.2,500 కోట్లకు రీచ్ అవ్వొచ్చని మూడీస్ అంచనా వేసింది.
మొత్తానికి బిజినెస్ స్టైల్ మార్చుకుని..ప్రాఫిట్స్ వైపు దూసుకెళ్తున్న ఓయోకు, ఈ సెబీ అప్రూవల్ ఒక పెద్ద బూస్ట్ వంటిదనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక బిగ్గెస్ట్ మనీ మేకింగ్ ఆపర్చునిటీగా మారే ఛాన్స్ అవుతుంది.
