Yamaha Aerox
ఆటోమొబైల్ దిగ్గజం యమహా.. ఇండియన్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటీ సెగ్మెంట్‌లోనూ అడుగుపెట్టింది. యూత్‌లో భారీ క్రేజ్ ఉన్న తన పాపులర్ పెట్రోల్ మోడల్ ఏరోక్స్ 155 స్పోర్టీ డిజైన్‌ను అలాగే కంటిన్యూ చేస్తూ, దేశీయ మార్కెట్లోకి ఫుల్లీ అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన కొత్త యమహా ఏరోక్స్(Yamaha Aerox)-ఈ మోడల్‌ను అఫీషియల్‌గా లాంచ్ చేసింది.
ఓల్డ్ పెట్రోల్ వెర్షన్ లుక్‌తోనే వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ స్టార్టింగ్ ధరను కంపెనీ రూ. 2.82 లక్షలుగా ఫిక్స్ చేసింది. ప్రస్తుతానికి ఈ స్కూటీ కేవలం ఒకే ఒక ప్రీమియం కలర్ ఆప్షన్‌లో మార్కెట్‌లో అవైలబుల్ ఉంది. ఇది బ్లాక్ యాక్సెంట్లు, లైట్ బ్లూ గ్రాఫిక్స్‌తో కూడిన గ్లోసీ వైట్ షేడ్ ఫినిషింగ్‌తో అందరినీ ఆకట్టుకోవడానికి రెడీ అయిపోయింది.
ఈ స్కూటర్‌లో రైడర్ల కంఫర్ట్‌నెస్ కోసం డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో మొత్తం 3.0kWh కెపాసిటీ గల రెండు 1.5kWh రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. వీటిని స్కూటీ నుంచి చాలా ఈజీగా బయటకు తీసి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనికోసం యమహా స్పెషల్‌గా ఒక ఎక్స్‌టర్నల్ ఛార్జింగ్ డాక్‌ను కూడా సేల్ చేస్తోంది. అయితే దీనిని కస్టమర్లు విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది.
ఛార్జింగ్ టైమ్ విషయానికి వస్తే, ఒక బ్యాటరీ ప్యాక్‌ను జీరో నుంచి 100 శాతం ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 గంటల 10 నిమిషాలు పడుతుంది. అదే రెండు ప్యాక్‌లను కలిపి ఒకసారే ఛార్జ్ చేయాలంటే 6 గంటల 20 నిమిషాల పడుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌లను పవర్‌ఫుల్ మిడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కనెక్ట్ చేశారు. ఇది 12.6bhp పవర్, 48Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ స్కూటీ ఫుల్ ఛార్జ్‌పై 117 కి.మీటర్ల ఐడీసీ సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుందని యమహా చెబుతోంది. అలాగే ఇది పవర్ ప్లస్ బూస్ట్ మోడ్‌లో గరిష్ఠంగా గంటకు 95.5 కి.మీటర్ల టాప్ స్పీడ్‌ను ఈజీగా అందుకోగలదు. రైడర్ల మూడ్ , అవసరాల కోసం దీనిలో ఎకానమీ, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను ఇచ్చారు.
వీటి ద్వారా ఎక్కువ మైలేజ్ కోసం కానీ ఎక్కువ స్పీడ్ కోసం కానీ రైడర్లు తమకు నచ్చిన మోడ్స్‌లోకి ఈజీగా స్విచ్ అవ్వొచ్చు. దీంతో పాటు ఈ స్కూటీలో స్పెషల్‌గా ఒక బూస్ట్ మోడ్ ఫీచర్‌ను కూడా యాడ్ చేశారు. ఎడమవైపు హ్యాండిల్‌బార్‌పై ఉన్న స్విచ్‌ను ప్రెస్ చేయడం ద్వారా స్కూటీకి 10 సెకన్ల పాటు ఎక్స్‌ట్రా పవర్ కూడా యాడ్ అవుతుంది. రోడ్లపై వెళ్లేటప్పుడు వేరే వెహికల్స్‌ను ఓవర్‌టేక్ చేయడానికి, ఎత్తుగా ఉండే ఫ్లైఓవర్లు, ఘాట్ రోడ్లు ఎక్కడానికి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది.
టెక్నాలజీ ,సేఫ్టీ విషయాలకు వస్తే.. యమహా ఏరోక్స్(Yamaha Aerox)-ఈ హై ఎండ్ ఫీచర్స్‌తో లోడ్ అయి వచ్చింది. ఇది ఫుల్-కలర్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. ఇది టర్న్-బై -టర్న్ నావిగేషన్‌తో పాటు కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్‌ను డిస్‌ప్లే స్క్రీన్ పైనే చూపిస్తుంది. మీ రైడింగ్ డేటాను ట్రాక్ చేయడానికి యమహా వై-కనెక్ట్ మొబైల్ యాప్‌తో దీనిని లింక్ చేసుకోవచ్చు.
అలాగే ఆల్-ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, రివర్స్ మోడ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. సేఫ్టీ కోసం సింగిల్-ఛానల్ ఏబీఎస్ ,ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటీకి ఫ్రంట్ సైడ్ 110-సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140-సెక్షన్ టైర్‌తో కూడిన 14-ఇంచుల పెద్ద వీల్స్ అమర్చడంతో పాటు.. 2 వైపులా డిస్క్ బ్రేక్స్ ఉండటంతో బ్రేకింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మొత్తం 139 కిలోల బరువుండే ఈ స్కూటీ, ఇండియన్ ప్రీమియం ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడం గ్యారంటీ అని బైక్ లవర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
Chocolate : 600లకు పైగా సువాసనలు, 5000 కిలోల బరువు.. చాక్లెట్ ప్రపంచంలోని వింతలు ఇవే..
