Gold Lovers
పెళ్లిళ్ల సీజన్ సందడి నడుస్తున్న సమయంలో పసిడి ప్రియులకు(Gold Lovers) బులియన్ మార్కెట్లో మరోసారి గుడ్‌న్యూస్ వినిపించింది. వారం ప్రారంభంలో సోమ, మంగళవారాల్లో కాస్త పెరిగి ఆందోళన కలిగించిన బంగారం ధరలు, బుధవారం ఒక్కసారిగా భారీగా దిగివచ్చాయి. రేట్లు కుప్పకూలడంతో ఆభరణాలు కొనాలనుకునే వారికి పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో షోరూమ్‌లలో మళ్లీ కొనుగోలుదారుల సందడి మొదలైంది.
మంగళవారం ముగింపు రేట్లతో పోల్చుకుంటే బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడిపై ఏకంగా రూ. 3,220 తగ్గింది. ఇదే బాటలో 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 2,950, 18 క్యారెట్లపై రూ. 2,410 వరకూ రేట్లు తగ్గాయి. ఈ తగ్గుదల తర్వాత దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1లక్ష21వేల860 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం రూ. 1లక్ష12వేల622 వద్ద నిలిచింది.
పుత్తడితో పాటు సిల్వర్ ధర కూడా తగ్గుముఖం పట్టింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ తోడు పారిశ్రామికంగా డిమాండ్ బలంగా ఉన్నా కూడా నవంబర్ 25వ తేదీ బుధవారం వెండి రేటు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 1లక్ష44వేల870 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశంలోని మెయిన్ సిటీలలో కూడా ఈ ధరల తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ. 1లక్ష22వేల460గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష12వేల255గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్లు రూ. 1లక్ష22వేల270, 22 క్యారెట్లు రూ. 1లక్ష12వేల81 వద్ద ఉన్నాయి.
అటు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1లక్ష22వేల560, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష12వేల347గా నిలవగా.. బెంగళూరులో 24 క్యారెట్లు రూ. 1లక్ష22వేల360, 22 క్యారెట్లు రూ. 1లక్ష12వేల163 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రేట్లు ఒక్కసారిగా తగ్గడంతో నగలు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
