Aadarsha Kutumbam Trailer
విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన కొత్త ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌పై ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ రిలీజ్ చేసిన అఫీషియల్ ట్రైలర్(Aadarsha Kutumbam Trailer) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై దుమ్ము లేపుతోంది. రిలీజైన కొద్ది గంటల్లోనే నెట్టింట వైరల్ అవుతూ యూట్యూబ్‌లో టాప్‌లో నిలిచింది.
వెంకటేశ్ 77వ మైలు స్టోన్‌గా ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్.. పక్కా ఫ్యామిలీ కథాంశంతో పాటు ఆకట్టుకునే ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ కావాల్సినంతగా ఉన్నాయి. ఫేమస్ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వెంకీ సరసన శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా అలరించనుండగా.. నారా రోహిత్ కీ రోల్లో కనిపించబోతున్నారు.
ఈ మూవీకి తమన్ అందించిన స్వరాలు, రవి కె. చంద్రన్ విజువల్స్ మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. ట్రైలర్ సాధిస్తున్న ఈ పెద్ద సక్సెస్‌తో మూవీ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అక్టోబర్ 30వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెడుతోంది. బాక్సాఫీస్ దగ్గర వెంకీ, త్రివిక్రమ్ మేజిక్ ఏ రేంజ్లో వర్కవుట్ అవుతుందో వెయిట్ చేయాల్సిందే.
Nara Lokesh : లోకేష్‌లోని ఈ యాంగిల్ చూశారా?జగపతి బాబు టాక్ షోలో రివీల్ చేసిన సీక్రెట్స్ ఏంటి?
