Nominations Rejection : పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్‌లు.. ట్రెండింగ్‌లో నామినేషన్లు రద్దు అంశం..

Nominations Rejection : ఏపీ లోకల్ బాడీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. నిబంధనల ఉల్లంఘనలతో కొంతమంది కీలక నేతల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

Nominations Rejection

పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రాసెస్‌లో అనూహ్య పరిణామాలు వెలుగు చూశాయి. రూల్స్ ప్రకారం సరైన అర్హతలు లేకపోవడం, గ్రామీణ ప్రాంతంలో ఓటు హక్కు ఎంటర్ కాకపోవడం, ఏజ్ లిమిట్ సరిపోకపోవడం వంటి టెక్నికల్ రీజన్స్‌తో కొంతమంది ప్రధాన పార్టీల కేండిడేట్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని జిల్లాల్లో కీలక నాయకుల వారసులు, మెయిన్ లీడర్స్ నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాలనుకునే కేండిడేట్‌కి 2026 జనవరి 1 వ తేదీ నాటికి సంబంధిత గ్రామీణ ప్రాంతంలో ఓటు ఉండాలనేది మెయిన్ రూల్. ఈ నిబంధన పాటించలేదన్న రీజన్స్‌తో ఏపీ వ్యాప్తంగా సుమారు 10 మంది జడ్పీటీసీ కేండిడేట్స్ నామినేషన్లు చెల్లకుండా(Nominations Rejection) పోయాయి. వీరిలో జనసేన పార్టీకి చెందిన ఆరుగురు , టీడీపీకి చెందిన ఇద్దరితో పాటు వైసీపీకి చెందిన ఇద్దరు లీడర్స్ ఉన్నారు. వీటితో పాటు 21ఇయర్స్ ఏజ్ లేకపోవడం, రేషన్ షాప్ డీలర్‌గా కొనసాగుతుండటంతో వైసీపీకి చెందిన మరో ఇద్దరి అభ్యర్థిత్వాలను కూడా అధికారులు రద్దు చేశారు.

ఈ తిరస్కరణల హీట్ ప్రధాన నేతల ఇళ్లకూ తాకింది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోదరుడి తనయుడు చైతన్య అలాగే మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కుమారుడు కేఈ రుద్రఫణి నామినేషన్లు చెల్లకుండా పోవడం హాట్ టాపిక్ అయింది. అయితే, కొన్ని స్థానాల్లో మాత్రం మెయిన్ కేండిడేట్స్ నామినేషన్లు పోయినా, డమ్మీగా వేసిన ఇతర కేండిడేట్స్ బరిలో ఉండటంతో ఆ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

రాజధాని విలీన గ్రామాల పరిధిలో ఓట్లు ఉన్న కూటమి కేండిడేట్స్‌కు కూడా ఇదే ఓటు హక్కు రూల్ అడ్డుగానే మారింది. చినపలకలూరు, జొన్నలగడ్డ, పేరేచర్ల వంటి గ్రామాల్లో ఓట్లున్న గుంటూరు, పొన్నూరు, పెదనందిపాడు కేండిడేట్స్ డేగల లక్ష్మీనారాయణ,సుధ సునీత, గుండబొమ్మ యుగంధర్, రావెల నాగసౌజన్య నామినేషన్లను అధికారులు పక్కనబెట్టారు.

వివిధ జిల్లాల్లో నమోదైన ఇతర తిరస్కరణలను గమనిస్తే.. విశాఖ జిల్లా భీమిలిలో జనసేన కేండిడేట్ నక్కా జ్యోతి ఓటు బదిలీ కండీషన్లు గడువు దాటడంతో ఆమె నామినేషన్ క్యాన్సిల్ అయింది. చిత్తూరు జిల్లా యాదమరిలో జనసేన కేండిడేట్ పుష్పావతికి, ఏలూరు జిల్లా చింతలపూడిలో వైసీపీ కేండిడేట్ భూక్యానాయక్‌కు స్థానిక ఓటు లేక నామినేషన్లు పోయాయి. తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ స్థానాన్ని ఆశించిన జనసేన పార్టీ నేత గంటా స్వరూపాదేవి 2 చోట్ల వేసిన నామినేషన్లు కూడా ఇదే కారణంతో రిజెక్ట్ అయ్యాయి.

అలాగే రామకుప్పం ఎంపీటీసీ పరిధిలో వైసీపీ కేండిడేట్ రాజేంద్రనాయక్‌కు 21 ఏళ్లు నిండడానికి మరో 6 నెలల సమయం తక్కువగా ఉండటంతో పోటీకి అనర్హుడయ్యాడు. పుత్తూరు మండలంలో వైసీపీ కేండిడేట్ కుమారి తన భర్త ప్రభుత్వ అసైన్డ్ భూమికి ప్రైవేటుగా విలువ కట్టి అఫిడవిట్‌లో పెట్టడంతో నామినేషన్ రద్దయి(Nominations Rejection), టీడీపీ కేండిడేట్ సునీత ఏకగ్రీవమయ్యారు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రంలో టీడీపీ అభ్యర్థి కృష్ణయ్య సింగిల్ విండో అధ్యక్ష పదవిలో ఉంటూ నామినేషన్ వేయడంతో అతని నామినేషన్ రిజెక్ట్ అయింది.

మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో మాత్రం పొలిటికల్ సీన్ మారింది. అక్కడ టీడీపీ రెబల్ కేండిడేట్‌గా పోటీకి దిగిన నిమ్మది శ్యామల.. కూటమి అధిష్ఠానం సాలూరు స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడంతో వారి నిర్ణయానికి గౌరవమిస్తూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి హుందాగా ప్రవర్తించారు.

Dust Cleaning : రోజూ తుడిచినా ఇంట్లో దుమ్ము పేరుకుపోతోందా?ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి..

↑
Exit mobile version