Aakasamlo Oka Tara Movie Review: ఆకాశమే హద్దుగా ఓ అమ్మాయి కల.. దుల్కర్ సినిమా ఎలా ఉంది?

Aakasamlo Oka Tara Movie Review : దుల్కర్ సల్మాన్ హీరోగా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఆకాశంలో ఒక తార ఎలా ఉంది? . కథ, నటీనటుల ప్రదర్శన, సంగీతం, సినిమాకు ఉన్న ప్లస్‌లు, మైనస్‌లు ఎలా ఉన్నాయి?

Aakasamlo Oka Tara Movie Review

ఒక అమ్మాయి లైఫ్‌లో తనకు నచ్చిన టార్గెట్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్పే ప్రయత్నమే ఆకాశంలో ఒక తార సినిమా. బాగా చదువుకోవాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని ఆశపడే ఓ యువతి జర్నీని కుటుంబ బంధాలు, త్యాగాలు, ఎమోషన్స్ మధ్య డైరెక్టర్  పవన్ సాధినేని తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ (Aakasamlo Oka Tara Movie Review) ఎలా ఉంది? ఆడియన్స్‌కు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది? తెలుసుకుందాం.

కృష్ణ (దుల్కర్ సల్మాన్), కల్పన(సాత్విక వీరవల్లి)ని మ్యారేజ్ చేసుకుంటాడు. అయితే పెళ్లి తర్వాత ఆమె వయసు 16 ఏళ్లేనని తెలిసి ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా కల్పనకు చదువుపై ఆసక్తి మాత్రమే కాదు.. భవిష్యత్తులో వ్యోమగామి కావాలనే పెద్ద డ్రీమ్ కూడా ఉంటుంది. కానీ కుటుంబ నిర్ణయాలు ఆమె జీవితాన్ని మరో దిశలోకి తీసుకెళ్లడంతో.. ఈ పరిస్థితుల్లో కృష్ణ ఆమె లక్ష్యాన్ని అర్థం చేసుకుని అండగా నిలుస్తాడు. తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి, ఆమె చదువుకు అవసరమైన సహకారాన్ని అందిస్తాడు. టార్గెట్‌ను చేరుకోవడానికి కల్పన చేసే ప్రయత్నంతో పాటు వారి లైఫ్‌లో ఎదురయ్యే అపజయాలు, వాటిని అధిగమించే పోరాటమే సినిమా స్టోరీ.

కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ చాలా నేచురల్‌గా కనిపించాడు. మాటలకంటే తన ప్రవర్తనతో రోల్‌లోని మంచితనాన్ని చూపించాడు. కల్పనగా సాత్విక వీరవల్లి కూడా బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీ అయినా కూడా భావోద్వేగ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచింది. అలాగే శ్రుతి హాసన్, స్వాసిక, రుహానీ శర్మ తమ పాత్రల పరిధిలో అందరినీ మెప్పించారు. ముఖ్యంగా  ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా నటీనటుల సెలక్షన్ బాగా ఉపయోగపడింది.

జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, అంతరిక్షానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ తెరపై మంచి ఫీల్‌ను అందిస్తాయి. డైరెక్టర్ పవన్ సాధినేని క్లిష్టమైన సైన్స్ అంశాలను కూడా ఈజీగా అర్థమయ్యేలా చూపించారు.

ప్లస్‌లు.. దుల్కర్ యాక్షన్, తొలి పరిచయంలోనే సాత్విక నటన , భావోద్వేగాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , విజువల్స్.

మైనస్‌లు.. ముందుగానే అర్థమయ్యే స్టోరీ లైన్, కొన్ని సన్నివేశాల్లో బలహీనమైన రైటింగ్.

చివరిగా మహిళా సాధికారత, అమ్మాయిల విద్య వంటి అంశాలను ఫ్యామిలీ స్టోరీతో ముడిపెట్టిన మంచి ప్రయత్నం ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara Movie Review) అని చెప్పాలి. వేగవంతమైన కథనం, ట్విస్టులు ఆశించే వారికి ఈ మూవీ కొంత సాధారణంగా అనిపించినా.. ఎమోషనల్‌గా కనెక్ట్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది.

Opportunists : మీ చుట్టూ ఉన్న అవకాశవాదులను ఇట్టే గుర్తించడం ఎలా? ఈ సైకలాజికల్ ట్రిక్స్ తెలుసుకోండి

↑
Exit mobile version