Gold Prices Fall Down : కంటిన్యూయస్‌గా దిగివస్తున్న బంగారం..రికార్డు గరిష్టాల నుంచి తగ్గుముఖం

Gold Prices Fall Down : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మెయిన్ నగరాలలో బంగారం, వెండి ధరలు ఈరోజు మరింత తగ్గాయి. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ,వెండి ఈరోజు రేట్ల వివరాలు ఇక్కడ చూడండి.

Gold Prices Fall Down

కొద్ది రోజులుగా పెరుగుదలకు బ్రేకులు పడుతూ వరుసగా దిగివస్తున్న గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఈరోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇటీవలి కాలంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరి సామాన్యులను వణికించిన పుత్తడి రేట్లు ఇప్పుడు మెల్లగా దిగివస్తుండటంతో గోల్డ్ లవర్స్ ఎంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

ముఖ్యంగా ఇప్పుడు వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో కొత్తగా బంగారం కొనాలని భావిస్తున్న వారికి ఈ ధరల తగ్గుదల(Gold Prices Fall Down) ఒక రకమైన శుభవార్త అనే చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ఎఫెక్ట్ వల్లే దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఈరోజు మార్కెట్ వివరాల్లోకి వెళ్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 10 తగ్గడంతో దాని ధర రూ. 1లక్ష30వేల680కి చేరింది. అదేవిధంగా ఆర్నమెంట్ బంగారమైన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై కూడా రూ. 10 తగ్గి, రూ. 1లక్ష19వేల790 వద్ద స్థిరపడింది.

కేవలం పుత్తడే కాకుండా వెండి ధర కూడా ఇదే బాటలో పయనించి కూల్ కబురు వినిపించింది. కేజీ సిల్వర్‌పై రూ. 100 తగ్గడంతో దాని ధర రూ. 1లక్ష79వేల900గా నమోదైంది. ఇలా 15 రోజులుగా వరుసగా ధరలు పడిపోతుండటం మార్కెట్‌లో కొనుగోలుదారుల ఆసక్తిని మరింతగా పెంచుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీలైన హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 1లక్ష30వేల680గా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష19వేల790గా కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో కేజీ సిల్వర్ ధర రూ. 1లక్ష79వేల900 వద్ద ఉంది.

అయితే ఢిల్లీలో మాత్రం బంగారం ధర స్వల్పంగా భిన్నంగా ఉంది. అక్కడ 24 క్యారెట్ల ధర రూ. 1లక్ష30వేల830 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష19వేల940 వద్ద నమోదైంది. లోకల్ ట్యాక్సులు, ప్రాంతీయ డిమాండ్, రవాణా ఛార్జీలను బేస్ చేసుకుని సిటీల మధ్య ఈ చిన్నపాటి వ్యత్యాసాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Aakasamlo Oka Tara Movie Review: ఆకాశమే హద్దుగా ఓ అమ్మాయి కల.. దుల్కర్ సినిమా ఎలా ఉంది?

↑
Exit mobile version