Ranabaali
టాలీవుడ్‌లో తనదైన స్టైల్ యాక్షన్, యాటిట్యూడ్‌తో సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. కెరీర్‌లో మరో భారీ రికార్డ్ నమోదు కాబోతోంది. ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో ..రణబాలి(Ranabaali) అనే పీరియాడిక్ పాన్ ఇండియా మూవీలో రౌడీ హీరో నటిస్తున్నారు.
ప్రస్తుతం రణబాలి(Ranabaali) మూవీ షూటింగ్ పనులు చాలా స్పీడ్‌గా సాగుతున్నాయి. అయితే ఈ మూవీ ద్వారా విజయ్ దేవరకొండ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని.. ఒక అరుదైన ఇంటర్నేషనల్ రికార్డును తన అకౌంట్‌లో వేసుకోబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఒక వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ ఎంట్రీ ఇవ్వడమే దీనికి మెయిన్ రీజన్ అవుతోంది.
ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ది మమ్మీ సిరీస్‌లో ..ఇమ్‌హోటెప్ అనే ఐకానిక్ విలన్ రోల్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ మూవీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆర్నాల్డ్ వోస్లూ బర్త్‌డేని పురస్కరించుకుని రణబాలి మూవీ యూనిట్ ఈ విషయాన్ని రివీల్ చేస్తూ.. ఆర్నాల్డ్ క్యారెక్టర్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ మూవీలో సర్ థియోడర్ హెక్టర్ అనే అత్యంత క్రూరమైన విలన్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారానే ఆర్నాల్డ్ భారతీయ చలనచిత్ర రంగంలోకి అడుగుపెడుతుండటం మరో విశేషంగా నిలుస్తుంది.
ఈ హాలీవుడ్ నటుడి ఎంట్రీతో విజయ్ దేవరకొండ పేరు ఇప్పుడు సెన్సేషన్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. తన కెరీర్‌లో 2 వేర్వేరు సినిమాల్లో అంతర్జాతీయ స్థాయి లెజెండ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా విజయ్ రికార్డ్ క్రియేట్ చేశారు.
గ్లోబల్ లెవెల్ సెలబ్రిటీలతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి పనిచేయడం రెండోసారి అవుతుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన లైగర్ మూవీలో వరల్డ్ ఫేమస్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో కలిసి విజయ్ దేవరకొండ స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరోసారి ది మమ్మీ విలన్ ఆర్నాల్డ్ వోస్లూతో రౌడీ హీరో తలపడనుండటం.. టాలీవుడ్‌లోనే కాకుండా నేషనల్ లెవెల్‌లో పెద్ద టాపిక్‌గా మారిపోయింది. ఈ అరుదైన ఘనత విజయ్ దేవరకొండతో పాటు ఆయన ఫ్యాన్స్‌కు సరికొత్త జోష్ నింపుతోంది.
Shiv Sena : మహారాష్ట్రలో మళ్లీ మహా ఆపరేషన్.. షిండే గూటికి ఆ 6మంది మంత్రులు ..
