Menopause : మెనోపాజ్ టైమ్‌లో మహిళలలో జరిగే మానసిక, శారీరక సవాళ్లేంటి? ఇంట్లో వాళ్లు కోపరేట్ చేయాల్సిన సమయమిది..

Menopause : పీరియడ్స్ ఆగిపోయాక మహిళల శరీరంలో అసలేం జరుగుతుంది? నలభై ఏళ్లు దాటాక మహిళల్లో వచ్చే ఆ హార్మోన్ మార్పుల గురించి ప్రతీ మగవారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివే..

Menopause

మహిళల లైఫ్‌లో 42 -52 ఏళ్ల మధ్య వయస్సులో పీరియడ్స్ పర్మినెంట్‌గా ఆగిపోవడాన్ని మెడికల్ భాషలో మెనోపాజ్(Menopause) అంటారు. అయితే ఇది కేవలం పీరియడ్స్ ఆగిపోవడంతో మాత్రమే కంప్లీట్ అయ్యే విషయం కాదు. అంతకంటే ముందు నుంచే మహిళల బాడీలో ఒక పెద్ద హార్మోన్ల ఛేంజెస్ స్టార్ట్ అవుతుంది.

ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు అన్నీ ఒక్కసారిగా పడిపోవడం వల్ల వారి బాడీలోనూ, మనస్సులోనూ అనేక చిత్ర విచిత్రమైన మార్పులు వస్తాయి. చాలామంది మహిళలు ఇటు తమకి ఏం జరుగుతుందో చెప్పలేక,అటు కుటుంబ సభ్యులకి అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ప్రతీ ఒక్కరి ఇంట్లో అమ్మ, భార్య , సోదరి పడే ఈ ఇబ్బందులను ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

హార్మోన్ల స్థాయిలు పడిపోవడం వల్ల మహిళల్లో ఫస్ట్‌ కనిపించే లక్షణం హాట్ ఫ్లాషెస్..దీనిలో ఉన్నట్టుండి హఠాత్తుగా ఒళ్లంతా వేడి పుట్టి చెమటలు పట్టేస్తుంటాయి. ఒక్కోసారి నిద్రలో కూడా ఇలా జరిగి నిద్రలేమి, తీవ్ర అలసట ఆవరిస్తాయి. ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల స్కిన్ దృఢత్వాన్ని ఇచ్చే కొల్లాజెన్ తగ్గిపోయి చర్మం సాగడం, బ్రెస్ట్ షేప్ మారడం, జుట్టు పలచబడటం , నడుము, పొట్ట చుట్టూ కొవ్వు చేరి వెయిట్ పెరగడం జరుగుతుంది.

వీటికి తోడు ఎముకల డెన్సిటీ తగ్గి కీళ్ల నొప్పులు రావడం, గుండె స్పీడ్‌గా కొట్టుకోవడం వంటి శారీరక మార్పులు కూడా ఆ సమయంలో మహిళలను ఇబ్బంది పెడతాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. హార్మోన్ల ఎఫెక్ట్ వల్ల మైండ్ ప్రశాంతంగా ఉండకపోవడంతో ఎప్పుడు చూసినా చిరాకు, కోపం, ఆందోళన, కారణం లేకుండా ఏడుపు రావడం, చిన్న విషయాలకే బాగా టెన్షన్‌కు గురికావడం వంటి మానసిక వ్యథలను ఫేస్ చేస్తారు.

అయితే ఇది ప్రతీ స్త్రీకి తప్పని పరిస్థితి కాబట్టి..దీనిని ధైర్యంగా, ఆరోగ్యకరంగా ఎదుర్కోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముందుగా డైట్‌లో ఈస్ట్రోజన్‌ను నేచురల్‌గా అందించే సోయా, మునగాకు, నువ్వులు, గింజ ధాన్యాలు, పీచు పదార్థాలతో పాటు క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి.

డైలీ రెగ్యులర్‌గా వాకింగ్, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు కనీసం అరగంట పాటు అయినా చేయడం వల్ల వెయిట్ కంట్రోల్‌లో ఉండటమే కాకుండా ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. అలాగే కాఫీలు తగ్గించి మెడిటేషన్ చేయడం వల్ల నిద్ర బాగా పట్టి ప్రెజర్ తగ్గుతుంది. ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటే భయపడకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

అన్నింటికంటే మహిళంతా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే.. మెనోపాజ్(Menopause) అనేది వ్యాధి కాదని, అది మహిళల జీవితంలో ఒక నేచురల్ స్టేజ్ మాత్రమే అని తెలుసుకోవాలి. ఈ టైమ్‌లో కుటుంబ సభ్యుల మద్దతు ఆమెకి కొండంత బలాన్నిస్తుంది. ఆ టైమ్‌లో ఆమె చూపించే చిరాకు, కోపం వెనుక హార్మోన్ల ఎఫెక్ట్ ఉందని అర్థం చేసుకుని, ఆమెకి ప్రేమను, ఓదార్పును ఇవ్వాలి. నీకు మేమున్నామనే భరోసా ఇంట్లో దొరికితే.. ఎలాంటి క్లిష్టమైన మెనోపాజ్ స్టేజ్‌నైనా మహిళలు నవ్వుతూ, ఆరోగ్యంగా దాటేయగలరు.

EPFO : ఉమాంగ్ యాప్,పోర్టల్ తిప్పలకు చెక్.. వాట్సాప్‌లోనే ఈపీఎఫ్ఓ ఆల్ ఇన్ వన్ సర్వీసులు ..

↑
Exit mobile version