Bigg Boss 10 Telugu Day 19 : బిగ్ బాస్ హౌస్‌లో హిస్టారికల్ సీన్..ఒకేసారి ఇద్దరికి ఊహించని జాక్‌పాట్..

Bigg Boss 10 Telugu Day 19 : హౌస్‌లోకి అడుగుపెట్టడానికి మిథిలేష్, రామకృష్ణ మధ్య కూడా టై రాగా.. బిగ్ బాస్ పెట్టిన టైర్ల టాస్కులో గెలిచి మిథిలేష్ ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss 10 Telugu Day 19

బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని మలుపులు, లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే మైండ్ గేమ్స్ ఆడియన్స్‌కు కావాల్నినంత కిక్‌ను ఇస్తున్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్ షో హిస్టరీలోనే ఎప్పుడూ చూడని, వినని ఒక విచిత్రమైన సీన్ అందరినీ ఆకట్టుకుంది. ఒకే ఒక్క టాస్క్‌లో గెలిచిన ఇద్దరి కంటెస్టెంట్స్‌కు కూడా రికార్డ్ స్థాయిలో బిగ్ బాస్ బంపర్ ఆఫర్లు ప్రకటించేశాడు. ఇక హౌస్ లోపలికి వస్తూనే గొడవలు, ఈగో ఫైట్స్‌తో వాతావరణాన్ని హీటెక్కించిన అపూర్వ, మిథిలేష్‌ కెప్టెన్సీ గేమ్‌ను ఎలా తిప్పి కొట్టారో, ఇంటి సభ్యులకు ఎలా చుక్కలు చూపించారో చూద్దాం.

హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్లను ఇరిటేట్ చేయడానికి , అందరూ వద్దని తక్కువ ఓట్లు వేసినా కూడా అపూర్వను బిగ్ బాస్ లోపలికి పంపించాడు. ఆమె రాగానే ముఖేష్ ఎంకరేజ్మెంట్‌తో రోహిత్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. కానీ ఇది షాలినీకి అస్సలు నచ్చలేదు. హౌస్‌లోని కెమెరాల ముందుకు వెళ్లి అపూర్వ వద్దని చెప్పి, ఇప్పుడు ముఖేష్ ఇంత నాటకం ఆడుతున్నాడని మండిపడింది. మరోవైపు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇదే టైమ్‌లో నిద్రపోయిన నరేష్‌కి కెప్టెన్ ఝాన్సీ గుంజీల పనిష్మెంట్ ఇచ్చింది.

ఇక హౌస్‌లోకి అడుగుపెట్టడానికి మిథిలేష్, రామకృష్ణ మధ్య కూడా టై రాగా.. బిగ్ బాస్ పెట్టిన టైర్ల టాస్కులో గెలిచి మిథిలేష్ ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఇంటి పనుల విషయంలో అమన్, త్రిగుణ్‌ మధ్య పెద్ద యుద్దమే నడిచింది. ‘కెప్టెన్ చెప్తే వింటానని, నీ మాట ఎందుకు వినాలని అమన్ అనడంతో త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. కాసేపటికి రోహిత్, షాలినీ కలగజేసుకుని వాతావరణాన్ని కూల్ చేశారు. ఇంకోవైపు ఎగ్స్ ఇచ్చే విషయంలో అపూర్వ, రోహిత్ మధ్య కూడా చిన్న పాటి యుద్ధం జరిగింది.

అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది అపూర్వ, మిథిలేష్‌ బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్‌తో ..కెప్టెన్సీ రేసు నుంచి సృష్టి, ఝాన్సీని తొలగించారు. సుధీర్‌పై చెత్త వేసి కొట్టిన సృష్టికి అసలు సహనమే లేదని, కేవలం స్క్రీన్ స్పేస్ కోసమే అమన్ ఫైర్ అవుతున్నాడని ఫైర్ అయ్యారు. వేస్ట్ సంచాలక్ అని అపూర్వను అమన్ అనగా, నీ స్థాయి ఏంటో అగ్నిపరీక్షలోనే చూశాం లే అంటూ ఆమె రివర్స్ కౌంటర్ ఇచ్చింది.

Bigg Boss 10 Telugu Day 19

చివరికి జరిగిన కెప్టెన్సీ టాస్కులో అపూర్వ, ముఖేష్ జంట, ఝాన్సీ, మిథిలేష్ జంటపై ఘన విజయం సాధించింది. ఇక్కడే బిగ్ బాస్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. గెలిచిన ముఖేష్‌కి బిగ్ బాస్ కెప్టెన్సీ పీఠాన్ని కట్టబెట్టడమే కాకుండా, పార్ట్‌నర్‌గా ఉన్న అపూర్వకి కూడా డైరెక్టుగా ఇమ్యూనిటీ ఇచ్చేశాడు. ఇలా ఒకే ఒక్క టాస్కు ద్వారా ఇద్దరికీ కూడా కెప్టెన్సీ, ఇమ్యూనిటీ రావడం బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. గెలిచాక స్టార్, స్టార్‌డమ్ ఊరికే రావు బాస్ అని ముఖేష్ కొట్టిన మాస్ డైలాగ్‌తో వర్షిణి గ్యాంగ్ పండగ చేసుకోవడంతో.. ఎపిసోడ్ ఫుల్ జోష్‌తో ముగిసింది.

AP Pensions : పింఛన్ దారులకు అలర్ట్..అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీ ఆలస్యం..

↑
Exit mobile version