Just Andhra PradeshLatest News

AP Pensions : పింఛన్ దారులకు అలర్ట్..అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీ ఆలస్యం..

AP Pensions : బ్యాంకు ఉద్యోగుల వరుస సమ్మెల వల్ల ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు, పెన్షన్లకు సంబంధించిన నిధుల సర్దుబాటుకు ఆటంకం ఏర్పడింది.

AP Pensions

ఏపీ వ్యాప్తంగా అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది . ప్రతి నెలా ఫస్ట్ తారీఖున సూర్యోదయంతోనే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది.. లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి వారి చేతిలో డబ్బులు పెట్టడంతో అక్కడ పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.

అయితే రాబోయే అక్టోబర్ 1వ తారీఖున మాత్రం ఉదయం పూట పెన్షన్ల(AP Pensions) పంపిణీ జరగదు. ఆరోజు మధ్యాహ్నం నుంచి మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు .. లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి నగదు అందజేస్తారని అధికారులు అధికారికంగా స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 28వ తేదీ, 29వ తేదీ, 30 వ తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ డిమాండ్ల సాధనకోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ వరుస సమ్మెల వల్ల ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు, పెన్షన్లకు సంబంధించిన నిధుల సర్దుబాటుకు ఆటంకం ఏర్పడింది.

క్యాష్ విత్‌డ్రాయల్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా, పింఛన్ దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్లాన్‌ను సిద్ధం చేసింది.

AP Pensions
AP Pensions

తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1వ తేదీ ఉదయం.. బ్యాంకులు తెరిచిన వెంటనే సచివాలయ ఉద్యోగులు వెళ్లి పింఛన్లకు సంబంధించిన క్యాష్‌ను విత్‌డ్రా చేస్తారు.

ఆ బ్యాంకింగ్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం నుంచి డైరెక్టుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్(AP Pensions) పంపిణీ ప్రాసెస్‌ను చేపడతారు. కాబట్టి లబ్ధిదారులంతా టైమ్‌ మార్పులను గమనించి, టెన్షన్ పడకుండా సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Perfect Tea : పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..

Related Articles

Back to top button