Bigg Boss Mid Week Elimination
బుల్లితెర చరిత్రలో బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులోని గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి వారంలోనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మొన్న చరణ్ ఎలిమినేషన్‌తో హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అవ్వగా, లేటెస్ట్ ఎపిసోడ్‌తో ఆ హీటు మరింత పెరిగింది.
అసలు ప్రతీరోజూ హౌస్‌లో గొడవలు, స్ట్రాటజీలు మామూలే కదా అనుకుంటే, ఈ సీజన్‌లో మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ హౌస్ మేట్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా బిగ్ బాస్ పిచ్చెక్కించేస్తున్నారు. రాం ప్రసాద్ సేవ్ అవ్వడంతో హమ్మయ్య అని రిలాక్సయ్యేలోపే , త్రిగుణ్ తన పాత పురాణాన్ని మళ్లీ స్టార్ట్ చేశాడు.
సెప్టెంబర్ 11న ఎపిసోడ్ మొదలవ్వగానే అమన్ మసూద్‌ను త్రిగుణ్ టార్గెట్‌గా ఎంచుకున్నాడు. అగ్నిపరీక్ష టాస్క్‌లో రోహిత్‌తో జరిగిన ఆర్గ్యుమెంట్‌ను గుర్తు చేశాడు. రోహిత్ అనవసరంగా అరిచి పబ్లిసిటీ పొందాడంటూ, అమన్ కంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరూ లేరంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఇకపై ఏ టీమ్‌లు ఉండవని..ఎవరి ఆట వాళ్లే ఆడాలని చెబుతూ అందరికీ బిగ్ బాస్ షాక్ ఇచ్చారు. అంతేకాదు హౌస్‌మేట్స్‌గా మారడానికి సభ్యులందరికీ ఈజీ అండ్ హార్డ్ టాస్క్ ఆప్షన్ ఇచ్చారు. దీనిలో భాగంగానే హౌస్‌లో డిస్కషన్ నడుస్తున్నప్పుడు దేబ్జానీ .. కెమెరా ముందు ఏడవడం స్టార్ట్ చేసింది. ఎప్పటిలాగే రోహిత్, షాలిని, నరేష్, రాం ప్రసాద్ వచ్చి దేబ్జానీని ఓదార్చారు.
తర్వాత ముఖేష్ గౌడ వచ్చి త్రిగుణ్ అసలు రంగును సుధీర్, ఝాన్సీల దగ్గర బయటపెట్టాడు. త్రిగుణ్ ఒక స్టాండ్ అంటూ తీసుకోకుండా మాటలు మారుస్తున్నాడని, ఫ్లిప్ చేసి గేమ్‌లు ఆడటంలో అతనే నెంబర్ వన్ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక కిచెన్ ఏరియాలో గిన్నెలు కడిగే విషయంలో రోహిత్‌తో త్రిగుణ్ మాటలు మాత్రం అందరికీ చిరాకు తెప్పించాయి.
తర్వాత బిగ్ బాస్ రన్ రాజా రన్ అనే ఈజీ టాస్క్ పెట్టి త్రిగుణ్‌ను దానికి సంచాలక్‌గా నియమించారు. గేమ్ మొదలవ్వక ముందే బిల్డప్ ఇచ్చిన త్రిగుణ్.. సృష్టి సరిగ్గా ఆడుతున్నా కూడా అవుట్ అని చెప్పేశాడు. దీంతో బిగ్ బాస్ ఇంటర్‌ఫియర్ అయి సృష్టికి మరో ఛాన్స్ ఇచ్చారు. చివరకు ఈ టాస్క్‌లో జబర్దస్త్ నరేష్‌పై రాం ప్రసాద్ గెలిచి నో రిస్క్ బ్యాడ్జ్‌తో, అమన్‌ను హై రిస్క్ జోన్‌లోకి నెట్టేశాడు.
ఇక హార్డ్ టాస్క్ ఆడటానికి వచ్చిన వర్షిణి, సుధీర్‌కు కేక్ తిన్నట్లు నమ్మించాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. దీంతో వాళ్లిద్దరూ ప్లాన్ ప్రకారం కేక్‌ను పాడు చేసి, తమ టాస్క్ కంప్లీట్ అయిపోయిందని హౌస్‌మేట్స్‌ని నమ్మించడానికి డ్రామాలాడగా.. రాం ప్రసాద్, వంశీ మాత్రం సుధీర్, వర్షిణి యాక్షన్‌ను కనిపెట్టేశారు. ముఖేష్ కూడా వీళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారని గాలి తీసేయడంతో ప్లాన్ ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో సుధీర్, వర్షిణికి షాకిస్తూ ఇద్దరినీ బిగ్ బాస్ హై రిస్క్ జోన్‌లోకి పంపేశారు.
ఇక ఆల్రెడీ హై రిస్క్‌లోను ఉన్న అమన్, చైత్రా రాయ్‌తో కలిపి నలుగురిలో ఎలిమినేషన్ స్టార్ట్ చేశారు. ఓటింగ్ ప్రాసెస్‌లో వర్షిణి, అమన్, సుధీర్ ముగ్గురు కూడా చైత్ర పేరే చెప్పడంతో తనే ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ కూడా అనౌన్స్(Bigg Boss Mid Week Elimination) చేశారు. తనకు ఆడే ఛాన్స్ రాలేదని చైత్ర వాపోయినా ఫలితం దక్కలేదు. చైత్ర ఎలిమినేట్ అవడంతో వర్షిణి మళ్లీ ఏడుపు స్టార్ట్ చేసింది.
ఇలా మొదటి వారంలోనే చరణ్, చైత్ర వికెట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆడియన్స్‌తో పాటు హౌస్ మేట్స్ కూడా ఏమాత్రం ఊహించలేదు. మొత్తంగా ఇలా ఫస్ట్ వీక్‌లోనే రెండు వికెట్లు పడిపోవడం బిగ్ బాస్ హిస్టరీలోనే షాకింగ్ ట్విస్ట్‌గా నిలిచిపోబోతుందనేది మాత్రం పక్కా.
