Bigg Boss Voting : బిగ్ బాస్ తెలుగు 10 లో బిగ్ ట్విస్ట్..ఊహించని ఓటింగ్ ట్రెండ్స్

Bigg Boss Voting : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఏడో వారం నామినేషన్లలో ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు నిలవడం హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్, త్రిగుణ్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా, లీస్ట్ పొజిషన్‌లో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఫ్యూచర్‌ కూడా ఎలా ఉందో చూద్దాం.

Bigg Boss Voting

బుల్లితెరపై ఆసక్తిగా సాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పుడు ఏడో వారంలోనూ అదే జోష్‌తో దూసుకుపోతోంది. హౌస్‌లో రోజురోజుకూ మారుతున్న స్ట్రాటజీలు, కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాలు ఆడియన్స్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం నామినేషన్స్ ప్రాసెస్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

ఎందుకంటే ఈసారి నలుగురో, ఐదుగురో కాదు.. ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వచ్చి నిలవడం షో చరిత్రలో సెన్సేషన్‌గా మారింది. గత వారాలతో పోలిస్తే ఈసారి నామినేట్ అయిన వారి జాబితా ఇంత భారీగా ఉండటంతో, ఈ వీకెండ్ హౌస్‌లో పక్కాగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందనే అంచనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటివరకు ఓటింగ్(Bigg Boss Voting) ట్రెండ్స్‌లో టాప్‌లో దూసుకుపోయిన రోహిత్ గ్రాఫ్ ఈ వీక్ ఒక్కసారిగా ఊహించని విధంగా పడిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొన్నటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న కంటెస్టెంట్‌కి, రోహిత్‌కి మధ్య ఓట్ల తేడా భారీగానే ఉండేది. కానీ ఈ వీక్ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అనూహ్యంగా త్రిగుణ్ పుంజుకుని రోహిత్‌ను టచ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఓటింగ్‌లో(Bigg Boss Voting) రోహిత్ 25 శాతంతో ఫస్ట్ ప్లేసులో కొనసాగుతుండగా, త్రిగుణ్ కేవలం ఒక్క శాతం వెనుకంజలో 24 శాతంతో సెకండ్ ప్లేస్‌లో హోరాహోరీగా పోటీ పడుతున్నాడు. షాలిని ఎలిమినేషన్ విషయంలో జరిగిన హైడ్రామా వంటి పరిణామాలపై రోహిత్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నెగెటివిటీనే ఇప్పుడు రోహిత్ ఓటింగ్ గ్రాఫ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది..

ప్రస్తుతం హౌస్‌లో ఇంకా 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. గ్రాండ్ ఫినాలేకి కరెక్ట్‌గా టాప్ 5 మెంబర్స్‌ను మాత్రమే ఉంచాలంటే, మున్ముందు వచ్చే మిగిలిన 7 వారాల్లో కనీసం 2 లేదా 3సార్లు డబుల్ ఎలిమినేషన్లు జరగాల్సిందే. అందుకే ఈసారి 12 మందిని నామినేట్ చేయడం ద్వారా పక్కా ప్లాన్‌తోనే డబుల్ ఎలిమినేషన్‌కు తెరలేపారనే గట్టిగా వినిపిస్తోంది.

ఇక ఈ వీక్ నామినేట్ అయిన వారిలో రామకృష్ణ మూడో స్థానంలో సేఫ్‌గా కనిపిస్తుండగా, వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నీతూ మాస్టర్ , దక్షి గుత్తికొండ ఇద్దరూ కూడా కేవలం 2 శాతం ఓట్లతో లీస్ట్ పొజిషన్‌లో ఉండి డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఒకవేళ ఊహించినట్లే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కనుక జరిగితే, ఈ ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వెళతారనే టాక్ నడుస్తోంది. మరి ఈ వీకెండ్ నాగ్ ఎవరిని సేవ్ చేస్తారు, ఎవరికి రెడ్ కార్డ్ ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Bird Watching : బిజీ లైఫ్‌లో బెస్ట్ స్ట్రెస్ రిలీఫర్..నేచర్‌లో బర్డ్ వాచింగ్ క్రేజ్ ..

↑
Exit mobile version