Bird Watching : బిజీ లైఫ్‌లో బెస్ట్ స్ట్రెస్ రిలీఫర్..నేచర్‌లో బర్డ్ వాచింగ్ క్రేజ్ ..
Bird Watching : బర్డ్ వాచింగ్ అంటే ఏంటి? వాటిని సహజ ఆవాసాల్లో ఈజీగా గుర్తించే శాస్త్రీయ సూత్రాలతో పాటు ఫాలో అవ్వాల్సిన పద్ధతులు గురించి ఇప్పుడు చూద్దాం.
Bird Watching
డైలీ ఉరుకుల పరుగుల జీవితంలో, డిజిటల్ స్క్రీన్ల హోరుతో అలిసిపోతున్న మనసుకు కాస్త ప్రశాంతతను పంచే అద్భుతమైన మార్గాల్లో పక్షుల వీక్షణం ఒకటి అంటున్నారు సిటీ జనులు. జూ పార్కుల్లో ఎన్‌క్లోజర్ల వెనుక ఉన్న బర్డ్స్‌ను చూడటం వేరు, అడవుల్లో వాటి సహజ ఆవాసాల్లో స్వేచ్ఛగా విహరించే పక్షులను అబ్జర్వ్ చేయడంలో ఉండే ఆనందం వేరు.
డైనోసార్ల యుగంలో ఆర్కియోప్టెరిక్స్ జీవి నుంచి పరిణామం చెందిన పక్షులు.. మెల్లమెల్లగా అడవి పక్షులుగా, నీటి పక్షులుగా రూపాంతరం చెందాయి. అయితే ఈ అద్భుతమైన పక్షుల ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ముందు వాటిని ఎలా గుర్తించాలో కొన్ని శాస్త్రీయ సూత్రాలున్నాయంటారు బర్డ్ లవర్స్.
వేల పక్షుల్లో ఏ పక్షి ఏదో గుర్తించడానికి కొన్ని టెక్నిక్స్‌ను వాడతారు. సూర్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు పక్షి నీడను బట్టి గుర్తించే ‘సిల్హౌట్ టెక్నిక్’ ఉదాహరణకు గుడ్లగూబ తల, డేగ రెక్కలు అలాగే పక్షుల కనుబొమ్మల వద్ద గీతలు, కంటి చుట్టూ వలయాలు, రెక్కల మీద పట్టీల వంటి శరీరంపై ఉండే గుర్తులు చాలా ముఖ్యం.
అలాగే ఆ బర్డ్ ఆహారపు అలవాట్లను బట్టి దాని ముక్కు నిర్మాణం ఉదాహరణకు మాంసాన్ని చీల్చే గద్దల ముక్కు, తేనె పీల్చే తేనె పిట్ట ముక్కు గమనించి వాటి ఆధారంగా జాతిని అంచనా వేయొచ్చు. పక్షి ఈకలు, మెడ కింది రంగుల కలయిక, దాని పరిమాణం , ప్రవర్తన కూడా ఇంపార్టెంట్ . ప్రతి పక్షీ ఒక మిమిక్రీ ఆర్టిస్టే కాబట్టి, వాటి అరుపులను బట్టి కూడా ఆ పక్షులను గుర్తించొచ్చు.
బర్డ్స్‌ను చూడటానికి(Bird Watching) ది బెస్ట్ టైమ్ ఉదయం 5.30 – 8 గంటల వరకు (డాన్ కోరస్). ఈ టైమ్‌లో పక్షులన్నీ ఆహార అన్వేషణలో చాలా చురుగ్గా ఉంటాయి. అలాగే సాయంత్రం సమయంలో అయితే 4-6 గంటల మధ్య ఉండే గోల్డెన్ అవర్లోనూ ఇవి యాక్టివ్‌గా ఉంటాయి.

పక్షులను చూడటానికి అడవికి వెళ్లేటప్పుడు ప్రకృతిలో కలిసిపోయేలా ఆకుపచ్చ, గోధుమ, ఖాకీ, బూడిద రంగు బట్టలను ధరించాలి. రెడ్, ఎల్లో, వైట్ వంటి కళ్లు చెదిరే కలర్స్‌కు దూరంగా ఉండాలి. గాఢమైన పెర్ఫ్యూమ్‌లు వాడకూడదు.
పక్షులను ఎప్పుడూ కూడా డైరెక్టుగా ముట్టుకోకూడదు. వీటి ద్వారా వైరస్‌లు సోకే అవకాశం ఉంటుంది. బర్డ్ వాచింగ్‌కు బైనాక్యులర్స్ చాలా ఇంపార్టెంట్. స్మార్ట్‌ఫోన్లలో లభించే మెర్లిన్, ఈ-బర్డ్ వంటి యాప్స్ హెల్ప్‌తో పక్షుల అరుపులను రికార్డ్ చేసి పూర్తి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.
నల్లమల, శేషాచలం, పులికాట్, కొల్లేరు, లంకమల అభయారణ్యం, ఉప్పలపాడు, నేలపట్టు, కోరింగ, రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ వంటి ప్లేస్‌లు బర్డ్ వాచింగ్(Bird Watching)కు చక్కటి గమ్యస్థానాలుగా చెబుతారు.





