Bigg Boss Weekend : వీకెండ్‌లో నాగ్ క్లాస్..అడ్డంగా బుక్కైన కంటెస్టెంట్స్..

Bigg Boss Weekend : దొంగతనం టాపిక్ తీసిన నాగార్జున.. దేబ్జానీ కాఫీ కొట్టేసిన త్రిగుణ్, రామ్ ప్రసాద్‌ను తమ పర్సనల్ సీక్రెట్స్ చెప్పమన్నారు.

Bigg Boss Weekend

బిగ్ బాస్ హౌస్‌లో అన్ని రోజులు ఒక ఎత్తయితే.. వీకెండ్స్(Bigg Boss Weekend) మరో ఎత్తుగా సాగుతుంది. శనివారం, ఆదివారం వస్తే చాలు హౌస్‌లో సీన్ మొత్తం మారిపోతుంది. వీక్ మొత్తం గొడవలు పడుతూ, స్ట్రాటజీలు ప్లే చేసిన ఇంటి సభ్యులకు .. నాగార్జున వచ్చి క్లాస్ పీకే టైమ్ ఈ రెండు రోజులే కాబట్టి హౌస్‌లో ఎంతగా నవ్వులు పూస్తాయో అదే రేంజ్‌లో సీరియస్ వాతావరణం కూడా కనిపిస్తుంది.

ఈ శనివారం మాస్ ఎంట్రీతో(Bigg Boss Weekend) స్టేజ్ మీదకు వచ్చిన నాగ్.. మొదట ఆడియన్స్‌తో సరదాగా మాట్లాడి, ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌ను స్క్రీన్ మీద చూపించారు. వంశీ, త్రిగుణ్ ప్రశాంతంగా కాఫీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకోవడంతో తాజా ఎపిసోడ్ స్టార్ట్ అయింది. కాకపోతే త్రిగుణ్ దేబ్జానీ కాఫీని తీసుకువచ్చేసి రామ్‌ ప్రసాద్‌కి కూడా ఇచ్చాడు. దీంతో రామ్ ఆ విషయాన్ని దేబ్జానికి చెప్పేయడంతో, త్రిగుణ్ వచ్చి కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

ఇక హౌస్‌లో వారికి ఇంట్రస్టింగ్ గోల్డ్ కాయిన్స్ టాస్క్ ఇచ్చారు. కెప్టెన్ ఝాన్సీకి మాత్రం రెండు గోల్డ్ కాయిన్స్ ఇచ్చి, హౌస్‌లోని ఇద్దరికి ఇవ్వమని చెప్పాడు. ఈ సీజన్ పూర్తయ్యేలోపు ఎవరి దగ్గరైతే ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వారికి ఒక మంచి సర్ ప్రైజ్ ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో ఆ గోల్డ్ కాయిన్స్‌ను ముకేశ్, రామ్ ప్రసాద్‌కు అందించింది ఝాన్సీ.

ఆ తర్వాత వర్టికల్ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్.. ట్రూత్ ఆర్ స్పైస్ గేమ్ ఆడించారు. దీనిలో వంశీ సంచాలక్‌గా వ్యవహరించగా, హౌస్‌మేట్స్ జోడీలుగా ఆడారు. సుధీర్,అమన్ ఆడినప్పుడు సుధీర్‌కి ట్రూత్ రాగా, హౌస్‌లో అసలైన మైండ్ గేమ్ ఆడే మ్యానిప్యులేటర్ త్రిగుణ్ అని ఓపెన్‌గా చెప్పడంతో.. అమన్ మాత్రం స్పైసీ ఫుడ్ తిన్నాడు.

ఝాన్సీ,షాలిని గేమ్‌లో ఝాన్సీ ఫ్రెండ్ అనుకుని మోసపోయిన పర్సన్ త్రిగుణ్ పేరే చెప్పగా, షాలిని స్పైసీ ఫుడ్ తింది. ముకేశ్,త్రిగున్ ఆడినప్పుడు హౌస్‌లో అలా రెండు ఫేస్‌లతో ఉంటుంది త్రిగుణ్, షాలిని అని ముకేశ్ కుండబద్దలు కొట్టాడు.

నరేష్,చరణ్ గేమ్‌లో నరేష్ షాలినితోనే అనవసరంగా గొడవ పడతానని ఒప్పుకోగా.. వర్షిణి,సృష్టి గేమ్‌లో హౌస్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ త్రిగుణ్ అని వర్షిణి కూడా తేల్చేసింది.

మరోవైపు రోహిత్, షాలిని తమ పర్సనల్ గ్రూప్ కబుర్లు చెప్పుకున్న సమయంలో.. రోహిత్ అంటే తనకు చాలా ఇష్టమని షాలిని ఓపెన్‌గా చెప్పేసింది.

అంతలోనే స్క్రీన్ మీదకి వచ్చిన నాగ్ ..హౌస్‌మేట్స్‌కి షాకులు ఇవ్వడం షురూ చేశారు. ఈ వారం అసలు గేమ్‌లో లేని కృష్ణుడు, సృష్టి వీడియోలను చూపించి.. మీరిద్దరూ అసలు యాక్టివ్‌గానే లేరని వారిని స్టోర్ రూమ్‌లో కూర్చోబెట్టారు. ఈ వీకెండ్ అంతా మీరు హౌస్‌మేట్స్ కాదని, అక్కడి నుంచే మిగిలిన వారిని చూడాలని పనిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ అయినందుకు ఝాన్సీని అభినందించారు.

ఇక దొంగతనం టాపిక్ తీసిన నాగార్జున.. దేబ్జానీ కాఫీ కొట్టేసిన త్రిగుణ్, రామ్ ప్రసాద్‌ను తమ పర్సనల్ సీక్రెట్స్ చెప్పమన్నారు. త్రిగుణ్ గతంలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌ని ఒకరికొకరు తెలీకుండా మరొకరిన మెయింటైన్ చేశానని ఒప్పుకున్నాడు. ఇక రామ్ ప్రసాద్ నాలుగేళ్ల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోకుండా తన కారు వేరే వాళ్లకు ఇచ్చి బయటపడ్డానని చెప్పాడు. ఈ కాఫీ చోరీలో పార్టనర్ అయిన వంశీ కూడా సిక్స్త్ క్లాస్ లవ్ స్టోరీ, పాత క్రష్ గురించి ఇంట్రస్టింగ్ సీక్రెట్ షేర్ చేసుకున్నాడు.

ఆ తర్వాత మ్యానిప్యులేటర్ ఎవరు – వారి చేతిలో పప్పెట్ ఎవరనే టాస్క్ ఆడించడంతో హౌస్‌లో అసలైన లొల్లి మొదలైంది. చరణ్ మ్యానిప్యులేటర్ వర్షిణి అని,తను చెప్పినట్లు వినే పప్పెట్ సుధీర్ అని చెప్పాడు. గార్డ్స్ గేమ్‌లో సుధీర్ ఆమె మాట విని ఆలోచన మార్చుకున్నాడని అనడంతో నాగార్జున చరణ్‌కి బాగానే క్లాస్ పీకారు.

రామ్ ప్రసాద్ మ్యానిప్యులేటర్ త్రిగుణ్ అని, అతని మాట వినే పప్పెట్ వంశీ అని చెప్పాడు. ఇదే సమయంలో హౌస్‌లో ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతున్న వారందరి వీడియోలు చూపించిన నాగార్జున.. కుక్కలు అరిచే సౌండ్ ప్లే చేసి, రాత్రి వేళల్లో తప్ప పగలు బెడ్ వాడకూడదని హౌస్‌మేట్స్ అందరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Bigg Boss Weekend

వర్షిణిపై సంచాలక్‌గా సరిగ్గా చేయలేదని నాగార్జున సీరియస్ అయి.. వర్షిణికి సంచాలక్ పోస్ట్ ఇవ్వకుండా బ్యాన్ చేశారు. ఇక అనవసరంగా గొడవ పడే షాలినిపైన కూడా నాగ్ ఫైర్ అయ్యారు. నీ కోపం ఏమీ తగ్గలేదు, ఊరికే అరవడం ఒక్కటే గేమ్ అనుకుంటున్నావా అంటూ క్లాస్ పీకి, ఝాన్సీ సజెషన్‌తో ఆమెకు ఒకరోజు డిష్ వాషింగ్ పనిష్మెంట్ ఇచ్చారు. అలాగే రోహిత్‌ని కూడా కెప్టెన్సీ గేమ్‌లో ఫిజికల్ అయినందుకు వార్నింగ్ ఇచ్చారు. ఫుడ్ విషయంలో అరిచే వంశీ, త్రిగుణ్‌కు నోటికి ప్లాస్టర్ వేసుకుని మాట్లాడకుండా వన్ డే వంట చేయాలని ఆర్డర్ వేశారు.

ఇక నామినేషన్స్‌లోమముకేశ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, షాలిని సేవ్ అవ్వగా.. సృష్టి, త్రిగుణ్, సుధీర్, వర్షిణి, రోహిత్, కృష్ణుడు ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు.

Listening Songs : సాంగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయా? దీని వెనుక అసలైన సైన్స్ ఇదే..

Exit mobile version