Listening Songs : సాంగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయా? దీని వెనుక అసలైన సైన్స్ ఇదే..

Listening Songs : 50 శాతం మందికి మ్యూజిక్ వినేటప్పుడు తమకు తెలీకుండానే ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకోవడంతో పాటు గొంతు గద్గదమవడం, ఒక్కసారిగా చలిగా అనిపించడం వంటి అనుభవాలు కలుగుతాయట.

Listening Songs

మనకు నచ్చిన సాంగ్ చెవిలో పడగానే.. ఆ మెలోడీ మైండ్‌లోకి ఎక్కగానే ఒక్కసారిగా ఒళ్లు తేలిపోయినట్లు అవుతుంది. ఒక్కసారిగా చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ క్షణం ఏదో తెలీని అద్భుతం జరిగినట్లు, ఒక వింత అనుభూతి మనసునంతా ముంచెత్తుతుంది.

అటువంటపుడే కేవలం ఒక సౌండ్ , గొంతు ఇలా మన బాడీని భౌతికంగా ఇంతలా ఎలా కదిలిస్తుందనే ఆలోచన వస్తుంది. దీనికి సమాధానం సైన్స్ పరంగా చూస్తే.. మ్యూజిక్ అనేది మన ఎమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుని వెళుతుంది కాబట్టే ఇలా జరుగుతుందని తేలింది.

ఈ అద్భుతమైన ఫీల్‌కి సైన్స్ వరల్డ్‌లో ఫ్రిసన్(Frisson) అనే అఫీషియల్ పేరు కూడా ఉంది. ఒక రీసెర్చ్ ప్రకారం వరల్డ్‌లో సుమారు సగం మందికి అంటే 50 శాతం మందికి మ్యూజిక్ వినేటప్పుడు(Listening Songs) తమకు తెలీకుండానే ఒంటిపై రోమాలు  నిక్కబొడుచుకోవడంతో పాటు గొంతు గద్గదమవడం, ఒక్కసారిగా చలిగా అనిపించడం వంటి అనుభవాలు కలుగుతాయట. దీనిలో విశేషం ఏంటంటే, ఒకే సాంగ్ అందరినీ ఒకేలా ప్రభావితం చేయదు. ఎవరి ఫీల్ వారిదేనట.

అయితే మనకు బాగా నచ్చిన సాంగ్ కానీ లేదంటే ఎవరో గుర్తువచ్చే మెలోడీ కానీ అయితే ఆ గూస్‌బంప్స్ రావడం కామన్ అనుకోవచ్చు. కానీ ఎప్పుడూ వినని కొత్త సాంగ్‌ను ఫస్ట్ టైమ్ వింటున్నప్పుడు(Listening Songs) కూడా కొంతమందికి ఈ గగుర్పాటు కలుగుతుందని పరిశోధకులు తేల్చారు.

దీని వెనక మన మెదడు చేసే ఒక పెద్ద మ్యాజిక్ దాగి ఉందని.. రాడ్బౌండ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఈ సీక్రెట్‌ను రివీల్ చేశారు. మనం సాంగ్ వింటున్నప్పుడు మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు నెక్స్ట్ లైన్ లేదా ట్యూన్ ఎలా ఉండబోతోంది అనే ఒక అంచనాకు వస్తూ ఉంటుంది.

అయితే అనుకోకుండా ఆ సాంగ్‌లో మన బ్రెయిన్ ఊహించని ఒక హై నోట్, ఊహించని వాయిస్ ఛేంజ్, లేదా ఫెంటాస్టిక్ మ్యూజికల్ క్రిసెండో రాగానే.. బ్రెయిన్ ఒక్క క్షణం పాటు కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ సడన్ సర్ప్రైజ్‌ని మైండ్ ఏదో ప్రమాదంగా పొరబడుతుంది. దాంతో మన నెర్వస్ సిస్టమ్ అలర్ట్ అయిపోయి ఫైట్-ఆర్-ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్లిపోవడంతోనే ఆ క్షణం ఒళ్లంతా గూస్‌బంప్స్ వస్తాయని తేల్చారు.

Listening Songs

కానీ ఆ వెంటనే అక్కడ ఎలాంటి డేంజర్ లేదని, ఇదొక కేవలం మ్యూజిక్ మ్యాజిక్ అని బ్రెయిన్‌కి అర్థమవుతుంది. దీంతో ఆ టెన్షన్ అంతా ఒక్కసారిగా తొలగిపోయి ఊరట కలగగానే, మైండ్‌లోని రివార్డ్ సిస్టమ్ ఆన్ అయిపోయి హ్యాపీ హార్మోన్ అయిన డోపమైన్ నిల్వలు రిలీజవుతాయి.

అంటే భయం, ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలిసి ఆ మ్యూజికల్ చిల్స్‌ను క్రియేట్ చేస్తాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫేవరెట్ సాంగ్ పెట్టుకుని ఆ మ్యాజిక్‌ని మరోసారి ఫీలవ్వండి మరి.

Constructive Mind Game : బంధం విడిపోవడానికి బ్రేకప్.. మరి కన్‌స్ట్రక్టివ్ మైండ్ గేమ్ గురించి తెలుసా?

Exit mobile version