Double Elimination : డబుల్ ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లకు షాక్.. ఐ లవ్యూ చెప్పి మరీ బయటకు వెళ్లిన షాలినీ..

Double Elimination : బిగ్ బాస్ 50వ ఎపిసోడ్‌లో ఏకంగా దక్షి, షాలినీ డబుల్ ఎలిమినేట్ అయ్యారు. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఎపిసోడ్ హైలైట్స్, రోహిత్-షాలినీ లవ్ ట్రాక్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

Double Elimination

ఎంటర్‌టైన్‌మెంట్, కన్నింగ్ మైండ్ సెట్‌, గొడవలతో సాగుతున్న బిగ్ బాస్ షోలో.. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్(Double Elimination) ఉంటుందని హోస్ట్ నాగ్ ముందుగానే సంకేతాలు ఇచ్చారు. ఆ మాటను నిజం చేస్తూ ఈ సండే ఎపిసోడ్‌లో ఒకేసారి ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆడియెన్స్ నుంచి వచ్చిన ఓట్ల ఆధారంగా ముందు దక్షి ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత హౌస్‌మేట్స్ వేసిన ఓట్ల ద్వారా షాలినీ కూడా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

ఈ వీక్ గేమ్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెడ్, ఎల్లో జోన్లుగా విభజించారు. కెప్టెన్సీ టాస్కులు లేదా పర్ఫార్మెన్స్ ఆధారంగా సేఫ్ అయినవాళ్లు గ్రీన్ జోన్‌లోకి దూసుకెళ్లిపోగా.. సరిగా ఆడలేకపోయినవాళ్లంతా రెడ్ జోన్‌లోనే మిగిలిపోయారు. ఆడియెన్స్ నుంచి పడిన ఓట్ల వల్ల రెడ్ జోన్‌లో ఉన్న దక్షి ఎలిమినేషన్ అయి బయటకు రావాల్సి వచ్చింది.

తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత మిగిలిన కంటెస్టెంట్లకు కొన్ని సూచనలు చేసిన దక్షి.. నీతూ ఎక్కువ వినాలని అలాగే అమన్ ప్రతీది సరిగ్గా అబ్జర్వ్ చేయాలని చెప్పింది. త్రిగుణ్ తన నోటిని కంట్రోల్ చేసుకోవాలని, శ్వేత ఇలాగే ఉంటే త్వరలోనే బయటకు వచ్చేస్తాదంటూ సలహాలు, కామెంట్లతో తన జర్నీని ముగించుకుంది.

ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ సేఫ్ చేసే ప్రాసెస్‌లో ఎల్లో , గ్రీన్ జోన్ సభ్యులు కీ రోల్ పోషించారు. నామినేషన్లలో ఉన్నా కూడా వర్షిణి, శివ్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్, సరదా టాస్కులతో హౌస్‌లో సందడి నెలకొంది. స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన డాన్యుబ్ ప్రాపర్టీస్ ఓనర్ ముందు.. డిఫరెంట్ బొమ్మలతో సినిమా పేర్లు గెస్ చేసే ఫిక్షనరీ టూ డిక్షనరీ టాస్క్ నిర్వహించారు. ఈ సరదా గేమ్‌లో సుధీర్ టీమ్ అదరగొట్టి విన్ అవగా, ఆర్కే టీమ్ మాత్రం పూర్తిగా డౌన్ అయిపోయారు. త్రిగుణ్, రామ్‌ప్రసాద్, ముకేష్, ఝాన్సీ వంటి వాళ్లు ఈ గేమ్‌లో పాయింట్లు సాధించలేక ముందే చతికిలపడ్డారు.

ఇంటి నుంచి బయటకు వచ్చే లాస్ట్‌ మినిట్‌లో కూడా రోహిత్, షాలినీ మధ్య రొమాంటిక్ సీన్‌ క్రియేట్ చేశారు. గేట్ వరకు వచ్చిన షాలినీని రోహిత్ వెనక్కి పిలిచి మరీ కౌగిలించుకోవడం, ఆ వెంటనే షాలినీ అతడి చెవిలో ..ఐ లవ్యూ అని గుసగుసలాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్ మీదకు వచ్చాక రోహిత్..బిగ్ బాస్ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నానని షాలినీ చెప్పింది. మొత్తానికి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్‌(Double Elimination)తో హౌస్‌లో కాస్త ప్రశాంతత లభించిందని.. అలాగా వస్తున్న ఎపిసోడ్‌లో అల్టిమేట్ గోట్ థీమ్‌తో బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుందో చూడాలని నాగ్ చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది.

Diwali : ఈ ఏడాది నరక చతుర్దశి, దీపావళి ఒకే రోజా? తిథుల గందరగోళం ఎందుకు వచ్చింది?

↑
Exit mobile version