Diwali
ఈ ఏడాది నవంబర్లో రానున్న నరక చతుర్దశి, దీపావళి పండుగలను ఏ రోజు జరుపుకోవాలనే దానిపై చాలామందిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి నవంబర్ 8 ఆదివారం రోజే నరక చతుర్దశి, దీపావళి(Diwali) పర్వదినాలు రెండూ ఒకే రోజు కలిసి రావడం ప్రత్యేకతగా మారింది.
అయితే తిథుల కాలాన్ని గమనిస్తే దీనిలో ఎలాంటి గందరగోళానికి తావు లేదని పండితులు చెబుతున్నారు. నరక చతుర్దశి.. నవంబర్ 7 వ తేదీ శనివారం రోజా నవంబర్ 8వ తేదీ ఆదివారమా అనే ప్రశ్నలకు పంచాంగం కచ్చితమైన సమాధానం ఇస్తోంది. పంచాంగం ప్రకారం చతుర్దశి తిథి శనివారం రోజే మొదలైనా కూడా, ఆదివారం ఉదయం 11:28 గంటల వరకు కొనసాగుతుంది.
మన హిందూ ధర్మశాస్త్ర నియమాల ప్రకారం సూర్యోదయ సమయానికి.. చతుర్దశి తిథి ఉన్న ఆదివారం వేకువజామునే తైలాభ్యంగన స్నానం చేయాలి. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే సమయాన నువ్వుల నూనెలో శ్రీమహాలక్ష్మి, నీటిలో గంగాదేవి ఉంటారని, ఇది దారిద్ర్య బాధలను నశింపజేస్తుందని పెద్దలు నమ్ముతారు. అందుకే తెల్లవారుజాము తిథి ఉన్న ఆదివారం నవంబర్ 8వ తేదీన చతుర్దశి ఉంటుంది.
అలాగే ఆ తర్వాత ఆదివారం ఉదయం 11:28 గంటలకు అమావాస్య తిథి ప్రారంభం అయి.. సాయంత్రం ప్రదోష కాలాన్ని పూర్తిగా ఆవహిస్తుంది. దీపావళి(Diwali) నోములు, మహాలక్ష్మీ పూజలు సాయంత్రం ప్రదోష వేళలోనే చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే నవంబర్ 8వ తేదీ ఆదివారం సాయంత్రం 6:00 గంటల నుంచి 8:00 గంటల మధ్య ఉండే స్థిర లగ్న సమయంలో దీపావళిరోజు లక్ష్మీ పూజను నిర్వహించడం సర్వశుభకరం అని పండితులు చెబుతారు.
Secrets : నమ్మి సీక్రెట్ చెబితే ఊరంతా ఊదేస్తున్నారా? ఈ బిహేవియర్ వెనుక సైకాలజీ ఏంటి..
