Family Week
బిగ్ బాస్ హౌస్ అంటేనే డ్రామాలు, గొడవలు, ఎత్తులకు పైఎత్తులు అన్న విషయం తెలిసిందే. అలా ఈ వీక్‌లో ఈసారి నామినేషన్ల ఘట్టం పూర్తి కాగానే హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కెప్టెన్ వంశీ తప్ప మిగిలిన కంటెస్టెంట్లు అంతమంది కూడా ఈ వీక్ ఎలిమినేషన్ జోన్‌లో నిలవడంతో హౌస్‌లో టెన్షన్ తారాస్థాయికి చేరింది.
ఇలాంటి టైమ్‌లోనే వారందరికీ బిగ్ బాస్ బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇంటి సభ్యుల ముఖాలలో నవ్వులు నింపడానికి, కళ్లల్లో ఆనందం కురిపించడానికి మోస్ట్ వెయిటెడ్ ఫ్యామిలీ వీక్(Family Week).. గేట్లను బద్ధలు కొట్టుకుని వచ్చి వాలేలా చేశాడు. ఈ ఎమోషనల్ రైడ్‌కి ముందు కంటెస్టెంట్లకు ఫుల్ కిక్కిచ్చే స్కూల్ టాస్క్ ఇచ్చి అసలు గేమ్ మొదలుపెట్టాడు బిగ్ బాస్ .
ఈ సరదా స్కూల్ టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్ అంతా స్కూల్ యూనిఫారమ్‌లు వేసుకుని స్టూడెంట్స్‌లా మారిపోయారు. ఇక నరేష్ ప్రిన్సిపాల్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్‌గా రచ్చ రచ్చ చేయగా, శ్వేతా ఆర్ట్ అండ్ పీటీ టీచర్‌గా, నీతూ డ్యాన్స్ టీచర్‌గా, దేబ్జానీ తెలుగు టీచర్‌గా, వర్షిణి కెమిస్ట్రీ టీచర్‌గా గెటప్పులు వేసి అలరించారు. నరేష్ తన ఇంగ్లీష్ క్లాస్‌లో పంచ్‌లు విసురుతూ కామెడీ చేయగా, వర్షిణి కూడా కెమిస్ట్రీ క్లాస్‌తో ఎంటర్టైన్‌మెంట్‌ను పంచింది. ఈ నవ్వుల హంగామా కంటిన్యూ అవుతుండగానే బిగ్ బాస్ అసలైన ఎమోషనల్ బాంబ్ పేల్చాడు.
ఫ్యామిలీ వీక్‌లో ఫస్ట్ బిగ్ హౌస్‌లోకి ఫస్ట్ గెస్ట్‌గా నరేష్ సోదరుడు సురేష్ ఎంట్రీ ఇవ్వడంతో అతను ఇంట్లోకి రాగానే నరేష్ భావోద్వేగానికి గురయ్యాడు. సురేష్, నరేష్, రామ్ ప్రసాద్ ముగ్గురూ కూర్చుని హౌస్ గేమ్‌పై చర్చించారు. ఆ తర్వాత దేబ్జానీతో పర్సనల్‌గా మాట్లాడిన సురేష్, అన్నతో కలిసి ఫుడ్ తిన్నాడు. ఇక వచ్చిన గెస్ట్ ఊరికే వెళ్లకుండా హౌస్ మేట్స్ కోసం ప్రత్యేకం ఫుడ్ ఐటమ్స్‌పై రింగ్స్ వేసే టాస్క్‌ను సురేష్ కంప్లీట్ చేసి నరేష్‌కు కావాల్సినవి అందించాడు.
సురేష్ వెళ్లిన తర్వాత హౌస్‌లో సీన్ మరింత ఎమోషనల్‌గా మారింది. శ్వేతా వాళ్ల అక్క, నాన్న ఊహించని విధంగా హౌస్‌లోకి అడుగుపెట్టారు. నాన్నను చూడగానే శ్వేతా కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయింది. హౌస్‌లో శ్వేతాకి అండగా నిలుస్తున్న త్రిగుణ్ సపోర్ట్ గురించి శ్వేతా చెప్పడంతో, ఆమె తండ్రి త్రిగుణ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత అంతా కలిసి మాస్ డ్యాన్స్‌తో సందడి చేశారు. బిగ్ బాస్ శ్వేతా ఫాదర్‌కి కూడా ఫుడ్ రింగ్ గేమ్‌ను అందించగా ఆయన కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
చివర్లో కెప్టెన్ వంశీ చిన్న ముద్దుల కూతురు హౌస్‌లోకి అడుగుపెట్టడంతో.. వంశీ కంటతడి పెట్టుకుని పాపను హగ్ చేసుకున్నాడు. కూతురి కోసం స్వయంగా వంట చేయడమే కాకుండా కెప్టెన్ రూమ్‌కు తీసుకెళ్లి తినిపించాడు. కాసేపటికి వంశీ భార్య కూడా హౌస్‌లోకి రావడంతో వంశీ ఇంకా ఎమోషనల్ అయ్యాడు. హౌస్‌లో వంశీకి తోడుగా ఉంటున్న త్రిగుణ్‌ను ఉద్దేశించి నీలాంటి ట్రూ ఫ్రెండ్ ఉండాలి బ్రో అంటూ కృతజ్ఞతలు తెలిపింది.
వంశీ మైండ్‌సెట్, గేమ్ ప్లాన్‌పై వంశీ భార్య ఇచ్చిన బూస్టప్ హౌస్‌మేట్స్‌లో కొత్త ఆలోచనలను రేపింది. త్రిగుణ్ ఆ వంశీ కూతురితో ఆడుకుంటూ సందడి చేశాడు. వంశీ భార్య, కూతురికి కూడా బిగ్ బాస్ ఫుడ్ రింగ్ టాస్క్ ఇచ్చాడు. ఇలా ఫ్యామిలీ వీక్ మొదటి రోజు స్కూల్ టాస్క్ కామెడీ, ఫ్యామిలీ మెంబర్స్ కన్నీళ్లు, నవ్వుల కాంబినేషన్‌తో బిగ్ బాస్ హౌస్ కలర్‌ఫుల్‌గా మారిపోయింది. రాబోయే ఎపిసోడ్లలో ఈ ఫ్యామిలీ డ్రామా మరిన్ని మలుపులు తిరగడం గ్యారంటీగా కనిపిస్తోంది.
Mogging : ఏంటీ మాగింగ్..సెలబ్రిటీల నుంచి యూత్ వరకూ ఎందుకింత ఫేమస్ అయింది?
