GOAT of Common Sense : బిగ్ బాస్ హౌస్‌లో త్రిగుణ్ మాస్టర్ ప్లాన్.. శివ త్యాగంతో గోట్‌గా నిలిచిన హీరో

GOAT of Common Sense : బిగ్ బాస్ హౌస్‌లో గేమ్స్ రోజులు పెరిగేకొద్దీ రంజుగా మారుతున్నాయి . శుక్రవారం నాటి 48వ ఎపిసోడ్‌లో జరిగిన పరిణామాలు, త్రిగుణ్, శివల పోరాటం, ముకేష్ కిరికిరి వంటి ముఖ్యమైన హైలైట్స్ అన్నీ ఇక్కడ చూడండి..

GOAT of Common Sense

బిగ్ బాస్ హౌస్‌లో ఎంత మంది ఉన్నా త్రిగుణ్ స్టైలే వేరు. గెలవడానికి ఎంత వరకూ అయినా వెళ్లడమే కాదు కాళ్లు పట్టుకోవడానికైనా వెనుకాడడు. ఫైనల్‌గా తన టార్గెట్ గెలుపు మాత్రమేనని నిరూపించి.. శుక్రవారం రోజు 48వ ఎపిసోడ్‌లో అసలుసిసలు ‘గోట్’ అనిపించుకున్నాడు.

అయితే హౌస్‌లో కర్మ రిటర్న్స్ ఎంత త్వరగా చుట్టేస్తాయో ఈ ఎపిసోడ్ కళ్లకు కట్టినట్లు చూపించింది. గోట్ టాస్క్‌లో కొంతమంది గ్రూపులు కట్టి త్రిగుణ్, శివ్‌ను అడ్డుకోవాలని చూసినా.. ఆ ఇద్దరూ ఎవరి లెవెల్‌లో వాళ్లు గట్టిగా పోరాడి నిలబడ్డారు.

ఇక ఎల్లో లెవల్ మెంబర్స్ కోసం పెట్టిన గోట్ ఆఫ్ కామన్ సెన్స్(GOAT of Common Sense) టాస్క్‌లో ముకేష్ కాస్త కిరికిరి చేశాడు. ఎలాంటి కామన్ సెన్స్ లేకుండా గేమ్ ఆడి..రకరకాల ట్రిక్స్‌తో గెలిచి ఎల్లో నుంచి గ్రీన్ లెవల్‌లోకి వెళ్లిపోయి 2 వారాలు సేఫ్ అయ్యాడు.

అయితే ఈ టాస్క్‌లో ముకేష్ ఆడిన తీరు, శివ్‌కు దెబ్బ తగిలినా పట్టించుకోకుండా చేసిన హడావుడి అతనిపై ఆడియన్స్‌కు కాస్త చిరాకు తెప్పించింది. మరోవైపు దేబ్జానీ తన ఫొటోను గ్రీన్ జోన్లో చూసుకుని ఎమోషనల్ అయింది.

అసలైన హైలైట్ చివరిలో గోట్ ఆఫ్ స్పీడ్ టాస్క్‌లో నడిచింది. రామ్‌ప్రసాద్, నరేష్‌ దొంగలుగా, త్రిగుణ్, శివ్ గాడ్స్‌గా బరిలోకి దిగారు. సుధీర్ సంచాలక్‌గా ఉన్న ఈ గేమ్‌లో శివ్ కాలికి దెబ్బ తగిలినా కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా పోరాడాడు. చివరకు త్రిగుణ్, శివ్‌ గెలిచినా.. ఇద్దరిలో ఒకరికి మాత్రమే గ్రీన్ లెవల్‌కి వెళ్లే అవకాశం వచ్చింది. దీంతో త్రిగుణ్ డైరెక్టుగా వెళ్లి శివ్‌ని బ్రతిమాలాడు. నేను అడుక్కునే టైప్ కాదు అయినా కూడా నీ చేతులు చాపి అడుగుతున్నానంటూ శివ్‌ను కన్విన్స్ చేశాడు.

GOAT of Common Sense

అయితే త్రిగుణ్ తనను గతంలో మోసం చేసినా.. ఇప్పుడు వచ్చి అడగడంతో అతను పడ్డ కష్టాన్ని గుర్తించి శివ్ తన అవకాశాన్ని త్యాగం చేశాడు. నన్ను మోసం చేసినా సరే.. త్రిగుణ్ పడిన కష్టాన్ని చూసి ఇస్తున్నా, అతనే అసలైన గోట్” అని చెబుతూ శివ్ మాట్లాడిన మాటలు మిగిలిన కంటెస్టెంట్స్‌కు గట్టిగానే తగిలాయి.

మొత్తానికి ఈ విజయంతో త్రిగుణ్ ఈ వీక్‌తో పాటు వచ్చే వారం కూడా ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిపోయాడు. ముకేష్, రోహిత్‌కు ముఖం చెల్లని ఈ గోట్(GOAT of Common Sense) ఎపిసోడ్ సీన్ ..హౌస్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్‌గా నిలిచిందనే చెప్పొచ్చు.

Vehicles Over 15 Years Old : మీ బండికి 15 ఏళ్లు నిండాయా? ఆ పని చేయకపోతే ఫైన్ తప్పదు..

↑
Exit mobile version