Liver : లివర్ డ్యామేజ్ అయ్యే ముందు బాడీ ఇచ్చే సైలెంట్ వార్నింగ్స్ .. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

Liver : కాలేయం (Liver)దెబ్బతింటున్నప్పుడు శరీరం ఇచ్చే ఇనీషియల్ వార్నింగ్ సింప్టమ్స్ ఏమిటి? ఫ్యాటీ లివర్ నుంచి లివర్ ఫెయిల్యూర్ వరకు మన బాడీని ఎలా కాపాడుకోవాలో ఒకసారి చూద్దాం.

Liver

మన బాడీలో ఎంతో సైలెంట్‌గా పనిచేసుకుంటూ.. మన అన్ని తప్పులను భరించే ఏకైక శరీర భాగం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా మన కాలేయం (Liver) అనే చెప్పాలి. రాత్రిపూట కుమ్మేసే బిర్యానీలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, గంటల కొద్దీ కూర్చుని చేసే పనులు.. ఇలా దేనినీ లెక్కచేయకుండా అన్నీ మూగగా భరిస్తూ లివర్ మనల్ని కాపాడుతూ ఉంటుంది.

అందుకే కాలేయాన్ని ఒక నిశ్శబ్ద తల్లితో పోలుస్తుంటారు డాక్టర్లు. తాను లోలోపల ఎంత నొచ్చుకున్నా పైకి ఏ మాత్రం చెప్పకుండా మన శరీరానికి కాపలా కాస్తుంది. కానీ ఆ భరించే శక్తి బోర్డర్లు దాటి, లివర్ అలసిపోయి గివ్ అప్ ఇచ్చే టైమ్‌కి బాడీ కొన్ని సైలెంట్ వార్నింగ్స్ ఇస్తుంది. అందుకే వాటిని ముందే గుర్తించకపోతే అదెంత ప్రమాదకరంగా మారుతుందో ముందే అంతా అవగాహన పెంచుకోవాలి.

సాధారణంగా లివర్‌లో నర్వ్ ఎండింగ్స్ ఉండవు. అందుకే అది దెబ్బతింటున్నప్పుడు లేదంటే లివర్‌కు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మొదట్లో ఎలాంటి నొప్పులు రావు. అందుకే ఇది దీనిని సైలెంట్ కిల్లర్ వంటిదని అంటుంటారు. అయితే లివర్ చుట్టూ గ్లిసన్స్ క్యాప్సూల్ అనే ప్రొటెక్ట్ చేసే పొర ఉంటుంది.

మనం తినే జంక్ ఫుడ్, ఆల్కహాల్ లేదా ఇతర కారణాల వల్ల కాలేయంలో కొవ్వు చేరి (Fatty Liver) అది కొంచెం పెద్దదైనప్పుడు (Hepatomegaly), ఆ క్యాప్సూల్ సాగడం మొదలవుతుంది. అప్పుడే మన బాడీలో కుడి వైపు పక్కటెముకల కింద (Right Hypochondriac Region) చిన్నగా అసౌకర్యం కలుగుతుంది.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. భరించలేని నొప్పి కానీ అస్సలు ఉండదు. కేవలం పొట్ట కుడి భాగంలో ఎప్పుడో ఓసారి ఏదో బరువుగా.. కొంచెం అబ్‌నార్మల్‌గా ఆన్ అండ్ ఆఫ్ సెన్సేషన్ మాత్రమే వస్తుంది. చాలా మంది దీనిని సాధారణ గ్యాస్ ట్రబుల్ లేదా అజీర్తి అని తేలికగా తీసిపారేస్తుంటారు. కానీ లోపల లివర్ కణాలపై ఒత్తిడి పెరుగుతోందనడానికి ఇదొక తొలి హెచ్చరిక కావొచ్చు.

ఈ ఇనిషియల్ స్టేజ్‌లోనే బాడీ ఇచ్చే సంకేతాలను గమనించకపోతే మెల్లగా పరిస్థితి చేయి జారిపోతుంది. లివర్ ఫెయిల్యూర్ అంచుకు వెళ్లే ముందు విపరీతమైన అలసటతో పాటు జీర్ణ సమస్యలు, చర్మంలో లేదా కళ్లలో వచ్చే రంగు మార్పులు వంటి లక్షణాలు బయటపడతాయి.

అయితే ఒక మంచి విషయం ఏంటంటే.. ఫ్యాటీ లివర్ లేదా ఇనీషియల్ స్టేజ్ డ్యామేజ్ అనేది పూర్తిగా రివర్స్ చేసుకోదగినది (Reversible) అని డాక్టర్లు చెబుతారు. అంటే ఎర్లీ స్టేజ్‌లోనే మనం తీసుకునే ఫుడ్‌లో మార్పులు చేసుకుని, వ్యాయామం అలవాటు చేసుకుంటూ.. లివర్‌కు భారం వేసే అలవాట్లన్నిటినీ పక్కన పెడితే అది మళ్లీ హెల్దీగా మారుతుంది.

ఎప్పుడైతే మీ బాడీ ఇస్తున్న ఈ సైలెంట్ వార్నింగ్స్‌ను మీరు ముందే గ్రహిస్తారో.. అప్పుడే మీ కాలేయాన్ని మీరే పెద్ద ప్రమాదం నుంచి కాపాడుకోగలుగుతారు. కాబట్టి కుడి వైపు పొట్టలో వచ్చే చిన్న అసౌకర్యాన్ని కూడా ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా, మీ లైఫ్‌ స్టైల్‌ను మార్చుకోవడం ద్వారా లివర్ ఆయుష్షును పెంచుకోండి.

Overly Emotional : ప్రతీ దానికి నొచ్చుకునే మనస్తత్వం..అతిగా ఫీలయ్యేవారి మైండ్ సెట్ వెనుకున్న సైకాలజీ ..

↑
Exit mobile version