Nagarjuna : నాగార్జున బర్త్‌డే గిఫ్ట్‌గా అదిరిపోయే ప్రోమో..బిగ్ బాస్ సీజన్ 10 డేట్ లాక్..

Nagarjuna : ఆగస్ట్ 29 వ తేదీన నాగార్జున బర్త్‌ డే కానుకగా బిగ్ బాస్ మేకర్స్ సీజన్ 10 గ్రాండ్ లాంచ్ డేట్‌ని అనౌన్స్ చేస్తూ.. ఒక క్రేజీ ప్రోమోను సోషల్ మీడియాలో వదిలారు.

Nagarjuna

సిల్వర్ స్క్రీన్‌పై ఏ కాంబినేషన్లతో సంబంధం లేకుండా ..కోట్ల మందిని టీవీల ముందుకు కట్టేసే బాప్ ఆఫ్ ఆల్ షూస్ అని పిలవబడే బిగ్ బాస్ షో మళ్లీ కొద్ది రోజుల్లోనే వచ్చేస్తోంది. ఇప్పటికే 9 సీజన్లతో ఆడియన్స్‌కి ఓ రేంజ్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన ఈ రియాలిటీ షో, ఇప్పుడు ల్యాండ్‌మార్క్ పదో సీజన్‌తో రచ్చ చేయడానికి రెడీ అయిపోయింది.

ఇక ఎప్పటిలాగే తన పవర్‌ఫుల్ అండ్ వింటేజ్ చార్మ్‌ లుక్‌తో హోస్టింగ్ బాధ్యతలకు ఈసారి కూడా కింగ్ నాగార్జున ఓకే చేశారు. ఆగస్ట్ 29 వ తేదీన నాగార్జున బర్త్‌ డే కానుకగా బిగ్ బాస్ మేకర్స్ సీజన్ 10 గ్రాండ్ లాంచ్ డేట్‌ని అనౌన్స్ చేస్తూ.. ఒక క్రేజీ ప్రోమోను సోషల్ మీడియాలో వదిలారు. ఈసారి మీరు ఏదేదో ఊహించుకుంటారు.. కానీ దాన్ని మించి ఉంటుంది రా బాబూ అంటూ క్రేజీ లుక్స్‌తో నాగ్ చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

ఇప్పటివరకు చూసిన బిగ్ బాస్ సీజన్లు ఒక ఎత్తయితే, ఈ 10వ సీజన్ నయా హిస్టరీని క్రియేట్ చేయబోతోందనే టాక్ నడుస్తోంది. 9 సీజన్ల వరకూ ఫిజికల్, మెంటల్ టాస్కులతో హౌస్‌మేట్స్‌ని ఆటాడుకోగా.. ఈ సారి రూల్స్ అన్నీ తిరగరాస్తూ దశావతారం అనే పవర్ ప్యాక్డ్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

దీనికి తగ్గట్టే డ్రామా, మైండ్ గేమ్‌లు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు అన్నీ కూడా డబుల్ ధమాకాలో ఉంటాయని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈసారి ఆటలో సవాలు కాదు.. ఆటే పెద్ద సవాల్ అంటూ నాగార్జున చెప్పిన పంచ్ డైలాగ్స్ షోపై ఉన్న అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి.

ఇక గ్రాండ్ లాంచ్ విషయానికొస్తే.. సెప్టెంబర్ 6వ తేదీ సండే సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా స్టార్ట్ కాబోతోందని స్టార్ మా అండ్ జియో హాట్‌స్టార్ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశాయి. మరోవైపు కామనర్స్‌కు గోల్డెన్ ఛాన్స్ ఇస్తూ నిర్వహించిన అగ్నిపరీక్ష సీజన్ 2 ఆల్మోస్ట్ క్లైమాక్స్‌కి చేరింది.

Nagarjuna

టాప్ 15 కంటెస్టెంట్స్ మధ్య ఇప్పుడు గట్టి కాంపిటీషన్ నడుస్తోంది. కొందరు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌తో ఓట్లు అడుగుతుండగా.. మరికొంతమంది ఎల్లో కార్డ్స్ తెచ్చుకుని ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అతి త్వరలోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని, అందులో పక్కాగా పెర్ఫార్మ్ చేసిన బెస్ట్ కామనర్స్ డైరెక్టుగా బిగ్ బాస్ 10 హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు.

ఇక అసలు సిసలైన క్యూరియాసిటీ అంతా ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలు ఎవరు అనే దానిపైనే ఉంది. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ,నటుడు అదిత్ ఈశ్వరన్, టెంపర్ ఫేమ్ వంశీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణుడు, బుల్లితెర నటి దేబ్జానీ, జబర్ధస్త్ ఆటో రాంప్రసాద్, నరేష్, వర్షిణి సౌందరాజన్, ఎక్స్‌ప్రెస్ హరి, సౌందర్య రెడ్డి, సుహాసిని, పల్లవి గౌడ, తేజస్విని, రాకింగ్ రాకేష్ వంటి పాపులర్ ఫేస్‌ల పేర్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లిస్ట్‌లో ఎంతమంది సెలబ్రెటీలు సెప్టెంబర్ 6న కింగ్ నాగార్జునతో కలిసి స్టేజ్ ఎక్కుతారో చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Vaibhav Sooryavanshi : చిన్న వయసులోనే పెద్ద మనసు..వండర్ కిడ్ వైభవ్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు

Exit mobile version