India, New Zealand Series
క్రికెట్ లవర్స్‌కు పండగ వాతావరణం తీసుకొస్తూ టీమిండియా మరో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు రెడీ అవుతోంది. న్యూజిలాండ్ గడ్డపై 5 మ్యాచ్‌ల ఊరమాస్ టీ20 సిరీస్ ఈరోజు నుంచి అఫీషియల్‌గా స్టార్ట్ అవుతుంది. క్రైస్ట్‌చర్చ్ మైదానంలో జరగబోయే ఫస్ట్ టీ20 పోరులో కివీస్‌తో శ్రేయాస్ సేన ఢీకొట్టడానికి రెడీ అయిపోయింది.
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్లేయర్లతో టీమిండియా మైదానంలోకి దిగుతుండగా, మరోవైపు మిచెల్ సాంట్నర్ లీడ్ చేస్తున్న న్యూజిలాండ్ కూడా ఇదే కసితో ఉంది. ఈ ఫస్ట్ మ్యాచ్‌లోనే జెండా పాతేసి సిరీస్‌లో బోణీ కొట్టాలని రెండు జట్లు స్కెచ్ వేయడంతో క్రైస్ట్‌చర్చ్‌లో ఈరోజు పరుగుల వరద పారడం గ్యారంటీ అనిపిస్తోంది.
అయితే ఈ టూర్‌లో క్రికెట్ లవర్స్ అంతా ఒకే ఒక్క సీనియర్ స్టార్ ప్లేయర్ పెర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సుమారు నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్‌పైనే అందరి ఫోకస్ ఉంది. కివీస్ గడ్డపై ఉన్న పేస్, స్వింగ్ పిచ్‌లను.. ఈ సిరీస్‌లో భువీ తన మ్యాజికల్ బౌలింగ్‌తో ఎలా వాడుకుంటాడో చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.
ఇక ఈ 5 మ్యాచ్‌ల సిరీస్ ఫుల్ షెడ్యూల్‌ను గమనిస్తే.. ఈరోజు అంటే అక్టోబర్ 22వ తేదీన క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఫస్ట్ టీ20, అక్టోబర్ 24వ తేదీన రెండో టీ20 కూడా అక్కడే జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 27వ తేదీన వెల్లింగ్టన్‌లో మూడో ఫైట్, అక్టోబర్ 30వ తేదీన ఆక్లాండ్‌లో నాలుగో పోరు, చివరగా నవంబర్ 1వ తేదీన హామిల్టన్‌లో ఐదో టీ20తో ఈ హోరాహోరీ మ్యాచ్ ముగుస్తుంది. భారత్ టైమింగ్స్ ప్రకారం ప్రతీ మ్యాచ్ మధ్యాహ్నం సరిగ్గా 12.30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ హై-వోల్టేజ్ సిరీస్(India, New Zealand Series) కోసం రంగంలోకి దిగుతున్న భారత జట్టు వివరాలను చూస్తే.. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే,అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లతో పవర్‌ఫుల్ స్క్వాడ్ రెడీగా ఉంది.
అలాగే న్యూజిలాండ్ టీమ్‌లో ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, మైఖేల్ బ్రేస్‌వెల్, లాకీ ఫెర్గూసన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, బెవాన్ జాకబ్స్, ఆడమ్ మిల్నే, బ్లెయిర్ టిక్నర్‌తో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
అయితే ఈ సిరీస్ మ్యాచ్‌లు(India, New Zealand Series) ఎప్పటిలాగే జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కావడం లేదు . ఈ భారత్-కివీస్ సిరీస్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ను ఈసారి సోనీ నెట్‌వర్క్ దక్కించుకుంది. అందుకే టీవీల్లో ఈ మ్యాచ్‌లు చూడాలనుకునేవాళ్లు సోనీ స్పోర్ట్స్ ఛానెల్స్ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్మార్ట్‌ఫోన్ , ల్యాప్‌టాప్‌లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే సోనీ లివ్ (SonyLIV) యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి లైవ్ మజాను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.
