No Elimination : బిగ్ బాస్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్..నాగ్ ముందు కంటెస్టెంట్ల బండారాలు బయటపెట్టిన సండే ఫండే

No Elimination : బిగ్‌బాస్ 9వ వారం సండే ఫండే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌లో నాగ్ ఊహించని న్యూస్ చెప్పారు. ముకేష్, వర్షిణి మధ్య ఫ్యామిలీ వీక్ త్యాగాలు చిచ్చు పెట్టాయి.

No Elimination

బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో నిన్న కాక మొన్ననే మొదలయిందా అన్నట్లుగా పరుగులుపెడుతున్న కాలంతో.. 9 వారాలు విజయవంతంగా ముగిసిపోయాయి. అయితే దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదని నాగార్జున ఎనౌన్స్ చేయడంతో కంటెస్టెంట్లంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఒకవేళ నిజంగానే ఎలిమినేషన్ కనుక ఉండి ఉంటే మాత్రం సుధీర్ కానీ నీతూ కానీ హౌస్ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండేది. ఇక ఈ వారం ఆటలో అసలు టర్న్ తిప్పింది పదవ వారం ఫ్యామిలీ వీక్ కాన్సెప్ట్. హౌస్‌లో ఉన్న వర్షిణి, నరేష్, ఆర్కేకు మాత్రం ఫస్ట్ ఫ్యామిలీ వీక్ మిస్ అయింది. అయితే మిగతా సభ్యుల త్యాగాలు, సపోర్ట్ వల్ల ఆ ముగ్గురిలో నరేష్‌కి మాత్రమే ఫ్యామిలీని కలుసుకునే అరుదైన ఛాన్స్ దక్కింది. ఆ సమయంలో ముకేష్‌ తన కోసం సరిగ్గా వస్తువులు దానం చేయలేదంటూ.. వర్షిణి అతనిపై అలిగి గొడవ పెట్టుకోవడం బిగ్ బాస్ హౌస్‌లో కొత్త వేడిని పుట్టించింది.

సండే ఫండే ఎపిసోడ్ స్టార్టింగ్‌కు ముందే ఆడియన్స్‌తో నాగార్జున ముచ్చటించారు. ఈ వీక్ ముకేష్ ఆట నచ్చిందని కొందరు చెప్పగా, మరికొందరు దేబ్జానీ పేరును ప్రస్తావించారు. ఇక కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన దేబ్జానీ, ముకేష్ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని నాగ్ డిసైడ్ అయ్యారు.

శివ్ తన చుట్టూ తిరుగుతున్నాడని దేబ్జానీ అనడం తనకసలు నచ్చలేదని ముకేష్ వాదించగా, నల్ల కోతి అంటూ కలర్‌ను ఉద్దేశించి దేబ్జానీ మాట్లాడటం రాంగ్ అని నాగ్ తప్పుపట్టారు. ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకోవాలని చెప్పి మొత్తానికి నాగ్ ఈ గొడవకు తెరదించారు. ఆ తర్వాత ముకేష్ సేఫ్ అని తేలడంతో పాటు, నో పాజ్ ఓన్లీ ఆన్సర్ టాస్క్‌లో ముకేష్ టీమ్ గెలిచింది. దేబ్జానీ, అమన్, సుధీర్ వంటి వాళ్లు ఈ టాస్క్‌లో ఫెయిల్ అయినా, చివరికి ముకేష్ టీమ్ పైచేయి సాధించింది. ఆ వెంటనే నరేష్, రామ్‌ప్రసాద్ కూడా సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

ఇక హౌస్‌మేట్స్‌ ఒరిజినల్ రూపాలను బయటపెట్టేలా బీబీ సినిమా.. అనే మరో ఆసక్తికరమైన టాస్క్‌ను కింగ్ నాగార్జున హౌస్‌లో రన్ చేశారు. ఈ టాస్క్‌లో వర్షిణి ..దేబ్జానీ తీరును ఎత్తిచూపగా, అందరితో బయటకు మంచిగా ఉంటూ లోపల ప్లానింగ్స్ వేస్తాడంటూ త్రిగుణ్ గురించి శివ్ ఓపెన్ అయ్యాడు.

మాటలు పెద్దవే కానీ గేమ్ మాత్రం జీరో అంటూ ఆర్కేపై నరేష్ సెటైర్లు వేశారు. నీతూ గురించి వంశీ మాట్లాడుతూ ఫస్ట్ వీక్ ఫైర్, నెక్ట్స్ వీక్ ఎక్స్‌పైర్ అని చెప్పగా, ఆర్కే కూడా నీతూ గురించి చెబుతూ బిల్డప్ కొండంత, పర్ఫెక్ట్ జీరో అంటూ విమర్శించారు.

సుధీర్ గురించి వర్షిణి మాట్లాడుతూ .. అతని ప్రెజెన్స్, పర్పస్ ఏంటో అర్థం కావడం లేదంది. త్రిగుణ్‌ని ‘తేనె పూసిన కత్తిగా.. నీతూ చెప్పగా, శివ్ కెమెరా కోసం మాత్రమే ఆడుతున్నాడని శ్వేత పాయింట్ అవుట్ చేసింది. ఆర్కేని సినిమా లేని పోస్టర్ అంటూ రామ్‌ప్రసాద్, అమన్‌ ఎగతాళి చేశారు. ఈ టాస్క్ ముగిసిన వెంటనే వర్షిణి కూడా సేఫ్ అయినట్లు నాగార్జున గుడ్ నూస్ రివీల్ చేశారు.

తర్వాత ఇట్లు అర్జున సినిమా ప్రమోషన్స్ కోసం అనీష్, అనస్వర హౌస్‌లోకి వచ్చి హౌస్ మేట్స్ ముందు సందడి చేశారు. ఆ తర్వాత అసలు హైలైట్ అయిన ఫ్యామిలీ వీక్ త్యాగాల టాస్క్ స్టార్ట్ అయింది. ఆర్కే, వర్షిణి, నరేష్‌ కోసం కంటెస్టెంట్స్ ముందుకు వచ్చి తమ వస్తువులను వెయింగ్ మెషీన్‌లో వేయాలని చెప్పిన నాగ్..అలా వేసిన వస్తువులు మళ్లీ వెనక్కి రావని కూడా చెప్పారు.

నరేష్ కోసం అందరూ పెద్ద ఎత్తున ముందుకు రాగా, వర్షిణి కోసం మాత్రం ముకేష్ వీలైనన్ని వస్తువులు వేశాడు. కానీ ముకేష్ సరిగ్గా త్యాగం చేయలేదంటూ.. తనే అయితే తన బట్టలన్నీ వేసేదాన్ని అని, వేరే వాళ్ల బట్టలతో అడ్జస్ట్ అయ్యేదాన్నంటూ వర్షిణి ఫీలయింది. తన దగ్గర ఉన్నది ఒకే ఒక్క షూ అని ముకేష్ సర్ధిచెప్పే ప్రయత్నంలో.. అతను ఝాన్సీ పేరు తీయడంతో వర్షిణికి మరింత కోపం కట్టలు తెంచుకుంది.

ఇక ఆర్కే కోసం అమన్ ఒకడే తన వస్తువులను త్యాగం చేశాడు. టోటల్‌గా అందరి సపోర్ట్‌తో నరేష్ ఫ్యామిలీ వీక్‌ని సొంతం చేసుకున్నాడు. కానీ తన కోసం ముకేష్ తన కోసం అన్ని వస్తువులు వేయలేదనే రీజన్‌తో వర్షిణి కన్నీళ్లు పెట్టుకోవడం, గొడవ పడటం ఇంట్లో పెద్ద డ్రామానే నడిపించింది.

No Elimination

చివరగా మిగిలిన నీతూ, శివ్, సుధీర్‌ ఫ్యూచర్‌పై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ముందుగా శివ్ సేఫ్ అని చెప్పి ఆ తర్వాత నీతూ, లాస్ట్‌లో సుధీర్ కూడా సేఫ్ అయినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ వీక్ ఎవరినీ ఎలిమినేట్ చేయడం(No Elimination) లేదని చెబుతూనే ఇదే అందరికీ లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించారు. ఇక నుంచి గేమ్‌ను మరింత జాగ్రత్తగా ఆడాలని సూచించారు. పదో వారం పూర్తిగా ఫ్యామిలీ టైమ్ థీమ్‌తో ఎమోషనల్‌గా సాగుతుందని ప్రకటించడంతో ఈ వీక్ ఎపిసోడ్ ముగిసింది.

Glowing Skin : ముఖం మిలమిలా మెరిసిపోవాలా? కొరియన్లు వాడే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి..

↑
Exit mobile version