Glowing Skin
బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగకుండా, మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పనిలేకుండా మీ ఫేస్‌ను కొరియన్ మోడల్స్ లాగా మెరిపించే సీక్రెట్ మీ చేతిలోనే ఉందని అంటున్నారు నిపుణులు. సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన కోల్డ్ థెరపీ లేదా ఐస్ క్యూబ్ మసాజ్ విధానంతో స్కిన్ షైనింగ్‌ను రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు. కొరియన్ల స్కిన్ ఎప్పుడూ నిగనిగలాడుతూ(Glowing Skin) ఉండటానికి.. రెగ్యులర్‌గా వాడే ఈజీ అండ్ నాచురల్ బ్యూటీ హ్యాక్ ఏంటో ఓసారి చూద్దాం.
మన బాడీ ఎప్పుడూ కూడా తన టెంపరేచర్‌ను 35-36 డిగ్రీల వద్ద ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. మనం మన బాడీలో ఏదైనా పార్ట్‌ను లేదంటే ఫేస్‌ను ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేసినప్పుడు అక్కడ చల్లబడుతుంది. దీంతో వెంటనే మన శరీరం అలర్ట్ అయి, ఆ ప్లేస్‌ను వెచ్చగా ఉంచడానికి హాట్ బ్లడ్‌ను విపరీతమైన వేగంతో అక్కడికి పంపిస్తుంది.
ఈ ప్రాసెస్‌లో బ్లడ్ వెసెల్స్ వెడల్పై, స్కిన్‌కి కావాల్సిన ఆక్సిజన్, పోషకాలు, ఎనర్జీ విపరీతంగా అందుతాయి. అంతేకాదు, కణాల్లోని మలినాలన్నీ బ్లడ్తో పాటు బయటకు కొట్టుకుపోతాయి. ఈ డీటాక్సిఫికేషన్ వల్ల ఫేస్ క్షణాల్లో రిఫ్రెష్ అయి, గ్లో వచ్చేస్తుంది.
అయితే ఈ ప్రాసెస్ కోసం మామూలు ఐస్ క్యూబ్స్ కంటే కొన్ని నేచురల్ ఇంగ్రీడియెంట్స్ కలిపి తయారుచేసే యాంటీ-టాన్ ఐస్ క్యూబ్స్ అయితే ఇంకా బాగా వర్కవుట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
కలబంద గుజ్జును నీళ్లు లేదంటే కొద్దిగా కొబ్బరినూనెతో గ్రైండ్ చేసి ఐస్ క్యూబ్స్‌గా తయారు చేసి పెట్టుకుని వాటితో మసాజ్ చేస్తే స్కిన్ మృదువుగా మారుతుంది.
కీరా దోసకాయ రసం కానీ రోజ్ వాటర్‌ను కానీ ఐస్ ట్రేలో పోసి గడ్డకట్టించి వాటితో ఫేస్ మసాజ్ చేస్తే స్కిన్ వెంటనే కొత్త షైనింగ్‌తో మెరిసిపోతుంది(Glowing Skin).
తేనె, నిమ్మరసం కాంబినేషన్ అయితే మరో లెవల్లో ఉంటుంది. రెండు చెంచాల తేనె, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు కలిపి ఐస్ క్యూబ్స్ చేసి ఫేస్ మసాజ్ కోసం వాడితే, నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ డెడ్ స్కిన్‌ను పోగొడుతుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పింపుల్స్‌ను, నల్లటి మచ్చలను మెల్లగా మాయం చేస్తాయి.
అయితే ఐస్ క్యూబ్‌ను ఎప్పుడూ కూడా ఫేస్‌పై డైరెక్టుగా రుద్దకుండా ఉంటేనే మంచిది. ఆ అతి చల్లదనానికి స్కిన్ కాలినట్లు అయి ఇరిటేషన్ రావొచ్చు. అందుకే ఎప్పుడూ ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ లేదా కర్చీఫ్లో ఐస్ క్యూబ్‌ను ఉంచి ఫేస్‌పై మెల్లగా మసాజ్ చేసుకోవాలి.
