Reward VS Revange
బిగ్ బాస్ తాజా సీజన్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా 9వ వారం స్టార్టింగ్ నుంచే ఇంట్లో వాతావరణం వేడెక్కింది. ఈ వీక్ థీమ్ అంతా రివార్డ్ అండ్ రివెంజ్(Reward VS Revange) చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఒక కంటెస్టెంట్ హ్యాపీగా రివార్డ్ పొందితే, దాని వల్ల మరో కంటెస్టెంట్ కచ్చితంగా రివెంజ్ అనుభవించాల్సి రావడం ఈ గేమ్ ప్రత్యేకత.
నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన టాస్కులలో శ్వేత , వంశీ విజయం సాధించి రివార్డులు గెలుచుకున్నారు. అయితే, బిగ్ బాస్ నియమం ప్రకారం వారు ఇద్దరు కంటెస్టెంట్లకు రివెంజ్ ఇవ్వాలి. శ్వేత, వంశీ, ఆర్కే, వర్షిణి పేర్లను రివెంజ్ కార్డులపై రాశారు. దీంతో ఆ ఇద్దరికీ శిక్ష ఫిక్స్ అయిపోయింది.
వర్షిణి పేరును మెజారిటీ హౌస్‌మేట్స్ రివెంజ్ కోసం రాశారు. కానీ, అప్పటికే శ్వేత, వంశీ ద్వారా వర్షిణికి రివెంజ్ దక్కడంతో, బిగ్ బాస్ మిగిలిన వారికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడంతో.. వర్షిణి పేరు రాసిన వారంతా తమ డెసిసన్ మార్చుకుని, వేరే వారి పేర్లు రాసుకునే ఛాన్స్‌ను కల్పించాడు. దీంతో చాలా మంది సేఫ్ గేమ్ ఆడుతూ పేర్లు మార్చేశారు.
అయితే అమన్ తన రివెంజ్ కార్డులో త్రిగుణ్ పేరు రాసిన విషయం తెలుసుకున్న త్రిగుణ్ బాగా ఫీలయ్యాడు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల త్రిగుణ్ ఇది అస్సలు ఊహించలేదు. త్రిగుణ్ తన బాధను శివ్‌తో పంచుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
ఇంట్లోకి నా పాప వస్తే తానే మొదటగా ఎత్తుకుంటానని అమన్ అన్నాడని.. అంత మాట అన్నవాడు, ఇప్పుడు తన పేరు రివెంజ్‌లో ఎలా రాశాడని త్రిగుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే శివ్ కూడా త్రిగుణ్ పేరునే రివెంజ్ కోసం రాశాడు. మరి త్రిగుణ్‌కు తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అమన్ తన పేరు రాశాడనే కోపంతో, త్రిగుణ్ కూడా అమన్‌ను రివెంజ్‌లోకి లాగాడు.
కాగా లేటెస్ట్ ఎపిసోడ్‌లో జరిగిన టాస్కులో త్రిగుణ్ విజయం సాధించినట్టు తెలుస్తోంది. కంటెండర్ షిప్ రేసులో గెలిచిన త్రిగుణ్, తనకు లభించిన పవర్‌తో అమన్‌కు రివెంజ్ షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన హై డ్రామా హైలైట్‌గా నిలవనుంది.
అమన్‌తో మాట్లాడిన త్రిగుణ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ రోజు పొద్దున వరకు అమన్ పేరు రాస్తావా అని తనను అడిగి ఉంటే రెండు వందల శాతం రాయను అని చెప్పేవాడ్ని.. నా పాప వస్తే నువ్వే ఎత్తుకుంటా అన్న నోటితోనే నా పేరు రాశావ్ అని.. అది నేను తట్టుకోలేకపోతున్నా నంటూ ఫీలయ్యాడు. మీ నాన్న గుర్తొస్తే నా ఒళ్లో వచ్చి పడుకున్నావ్.. ఇద్దరం కొట్టుకున్నాం.. కానీ ఎట్లా రా అట్లా చేస్తావంటూ త్రిగుణ్ బోరున ఏడ్చేశాడు. త్రిగుణ్ మాటలకు అమన్ కూడా ఎమోషనల్ అయ్యాడు
ఒకపక్క అమన్‌తో ఎమోషనల్‌గా మాట్లాడుతూ, కన్నీళ్లు పెట్టుకుంటూనే.. మరోపక్క రివెంజ్లో భాగంగా అమన్ ఫోటోను చిత్తు చిత్తుగా చింపేశాడు. ఏడుస్తూనే ఆటను ఆడేసిన త్రిగుణ్ .. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు . మరి ఈ వీక్ ఇంకా ఎవరెవరు అవార్డులు పొందుతారు, ఎవరికి రివెంజ్(Reward VS Revange) దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
