Ramayana movie
భారతీయుల ఆరాధ్య ఇతిహాసం రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించడం అనేది ఎప్పుడూ ఒక పెద్ద సాహసమే. గతంలో వచ్చిన ఆదిపురుష్ వంటి సినిమా అనుభవాలతోనూ, భారీ అంచనాలతోనూ నితీశ్ తివారీ డైరెక్షన్లో తెరకెక్కిన రామాయణం మూవీ (Ramayana movie) ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ఈ మూవీ ఏమేరకు మెప్పించింది, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో చూద్దాం.
ఈ సినిమాకు మెయిన్ బలం విజువల్స్, నిర్మాణ విలువలే. అయోధ్య, మిథిల నగరాలతో పాటు అరణ్య ప్రాంతాలు లంక నగర వైభవాన్ని తెరపై చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆదిపురుష్‌లో ప్రేక్షకాభిమానులను నిరాశపరిచిన గ్రాఫిక్స్ లోపాలను ఈ రామాయణం మూవీ(Ramayana movie)లో చాలావరకు సరిదిద్దారు. ప్రొడక్షన్ డిజైన్, సెట్టింగ్స్ విషయంలో మేకర్స్ పడిన కష్టం ప్రతి సీన్లోనూ క్లియర్‌గా కనిపిస్తుంది.
ఇక యాక్టర్స్ విషయానికి వస్తే శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ తన నటనతో కట్టిపడేశాడు. రాముడికి ఉండాల్సిన ప్రశాంతత, గంభీరత, సంయమనాన్ని తన హావభావాల్లో ఎవరూ ఊహించనంత చక్కగా చూపించాడు. ముఖ్యంగా వనవాస ఘట్టాల్లో, దశరథుడితో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో రణబీర్ కనిపించడు సాక్షాత్తూ శ్రీరాముడే కనిపించాడా అన్నట్టుగా మెప్పించాడు.
ఇక రావణుడిగా యశ్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో థియేటర్లలో విజిల్స్ వేయించాడు. రావణుడిని గుర్తు చేసేలా రాజసం, గంభీరమైన చూపులు ఆ పాత్రకు కొత్త ఊపిరి పోశాయి.అలాగే సాయి పల్లవి సీత పాత్రలో కొన్ని చోట్ల మెరిసినా.. ఆ పాత్రలో ఉండాల్సిన ఆత్మవిశ్వాసం,ఎమోషనల్ తీవ్రతను ఇంకాస్త బలంగా చూపిస్తే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఇటు టెక్నికల్ విభాగంలో కథనం ప్రథమార్థంలో కొంత నెమ్మదిగా సాగడం, ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ కొన్ని కీలక ఘట్టాల్లో ఆశించిన స్థాయిలో లేకపోవడం ప్రతికూల అంశాలుగా మారాయన్నటాక్ నడుస్తోంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ కూడా నాసిరకంగా అనిపిస్తాయి.
అయినా కూడా ఆదిపురుష్‌తో పోలిస్తే నితీశ్ తివారీ ‘రామాయణం’ ఎన్నో రెట్లు మెరుగైన, ప్రామాణికమైన ప్రయత్నం అనే చెప్పొచ్చు. దేవుడి ఇతిహాసానికి కావలసిన కనీస గౌరవాన్ని ఇస్తూ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌ను నటీనటుల నటన, దృశ్య వైభవం కోసం నిరభ్యంతరంగా అంతా కలిసి చూడొచ్చు.
