Saturday Episode : శనివారం నాగార్జున ఫైర్ ఎపిసోడ్ ..హౌస్‌లో ఊహించని ట్విస్ట్‌లు..

Saturday Episode : బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున హౌస్‌మేట్స్‌ గేమ్‌ను ఏకిపారేశారు. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన నరేష్, నీతూ మాస్టర్ క్లాస్, అమన్ సేఫ్ కావడంతో పాటు శనివారం జరిగిన హైలైట్స్ ఇక్కడ చదవండి.

Saturday Episode

బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం,ఆదివారం వస్తున్నాయంటేనే కంటెస్టెంట్లకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఈసారి కూడా వీకెండ్ కూడా అలాగే అల్లకల్లోలంగా స్టార్ట్ అయింది. ముందు ఎపిసోడ్‌(Saturday Episode)లో కొత్త కెప్టెన్‌గా వంశీ పగ్గాలు అందుకోవడంతో..మరోసారి బిగ్ బాస్ ఇంట్లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఇక శాటర్డే ఎపిసోడ్‌(Saturday Episode)లో ఎంట్రీ ఇస్తూనే హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌ ఎవరెవరు ఎలాంటి వేషాలు వేస్తున్నారో ఒక్కొక్కరి బండారం బయటపెట్టడం మొదలుపెట్టారు. అసలు ఈ ఎపిసోడ్‌కు ముందు జరిగిన పరిణామాలు చూస్తే హౌస్‌లో రాజకీయాలు ఎక్కడికి వెళ్లాయో ఈజీగా అర్థమవుతుంది. దేబ్జానీ తన కాఫీని ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా దాచుకుందంటూ ముకేష్, వర్షిణి రచ్చ చేయడమే కాకుండా రామ్ ప్రసాద్ దగ్గర దాని గురించి చెబుతారు.

దేబ్జానీ అందరికీ దూరం అవుతోందంటూ రామ్ ప్రసాద్, నరేష్, వంశీ, వర్షిణి గ్రూప్‌ కట్టి మరీ డిస్కషన్లు పెట్టడం, మరోవైపు దేబ్జానీ ఒంటరిగా కూర్చుని ఎమోషనల్ కావడం ఆడియన్స్‌ను కూడా ఆలోచనలో పడేసింది. కొత్త కెప్టెన్ వంశీకి వచ్చిన గోల్డ్ కాయిన్లను అతను రామ్ ప్రసాద్‌కు, త్రిగున్‌కు పంచి పెట్టాడు.

మరోవైపు నీతూ మాస్టర్ ఇక్కడ అందరూ మనల్ని వాడేసుకుని వదిలేస్తారంటూ శివ్ దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం, ముకేష్ సరదాగా రామ్ ప్రసాద్ ఎగ్స్ దొంగతనం చేయడంతో హౌస్‌లో కాసేపు నవ్వులు పూయించినా, ఆ వెంటనే నాగార్జున ఎంట్రీతో వాతావరణం పూర్తిగా హీటెక్కింది. కెప్టెన్ అయిన వంశీని అభినందించిన కింగ్ నాగార్జున.. నామినేషన్స్‌లో వంశీ వాడిన కులుకుతారనే పదంపై వర్షిణి, సుధీర్‌ను నిలదీశారు. ముకేష్ మాత్రం వర్షిణి గ్రూప్ నుంచి బయటకు వచ్చేసానని చెప్పగా, ఇంకాస్త తెగింపుతో ఆడాలని నాగ్ చెప్పారు.

ఇక అసలు ఇష్యూ దేబ్జానీ ఇష్యూతో మొదలైంది. ముకేశ్ గురించి దేబ్జానీ మగాడు కాదు, సాలా అని తిట్టిన వీడియోను, అలాగే టాస్క్‌లో ముకేష్‌ను కొట్టిన క్లిప్పింగ్స్‌ను నాగ్ లైవ్‌లో చూపించి నిలదీశారు. దేబ్జానీ పర్సనల్ కాఫీని టార్గెట్ చేసిన ముకేష్‌కు గట్టిగానే తగిలింది. వర్షిణి ఫుడ్ వేస్ట్ చేసే విధానాన్ని షాలినితో పోల్చి గట్టిగా క్లాస్ పీకారు. ఇక నీతూ మాస్టర్ వ్యవహారమైతే పరాకాష్టకు చేరింది. త్రిగున్ ఏమీ అనకపోయినా గొడవ పెట్టుకున్న నీతూ మాస్టర్‌కు సంబంధించిన వీడియోను కూడా నాగ్ వేసి మరీ క్లారిటీ ఇచ్చారు. దీంతో హౌస్‌లో అందరూ నీతూకి వ్యతిరేకంగానే మాట్లాడారు. మధ్యలో త్రిగుణ్ ఏదో చెప్పబోతే, నాగార్జున ముందే నీతూ మాస్టర్ త్రిగుణ్‌తో గొడవకు దిగడం చిరాకు తెప్పించింది.

ఇక నరేష్ సంచాలక్‌గా వ్యవహరించిన టాస్క్‌లో చేసిన తప్పును నాగార్జున ఎత్తి చూపడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. టాస్క్‌లో నరేష్ చేసింది తప్పని తేలడంతో, అలా అయితే తన ఫ్యామిలీ బదులు ఓడిపోయిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీ వస్తుందని నరేష్ ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఛాలెంజ్ చేశాడు. వెంటనే నాగ్ ఆ వీడియోను ప్రూఫ్‌గా చూపించి, నరేష్ ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్‌లో అస్సలు రానే రాదని తేల్చిపారేశారు. దీంతో ఓడిపోయిన రామకృష్ణ, అమన్‌లో ఎవరి ఫ్యామిలీ రావాలని నాగ్ అడగగా.. నరేష్ అమన్ పేరు చెప్పారు. తన తప్పు వల్ల తన ఫ్యామిలీ హౌస్‌లోకి రాదని తెలియడంతో నరేష్ బోరున ఏడ్చేశాడు. శ్వేత, రామకృష్ణ పేలవమైన గేమ్‌ను ఎత్తిచూపించిన నాగ్, అమన్‌ను మరింత బాగా ఆడాలని చెప్పారు.

Saturday Episode

త్రిగుణ్ అందరి మీద సాంగ్స్ పాడటంపై నాగ్ ఫైర్ అయ్యారు. మెయిన్‌గా నామినేషన్స్‌లో వర్షిణిని చీప్ క్యారెక్టర్ అని త్రిగుణ్ అన్న మాటను వీడియోలో చూపించి వార్నింగ్ ఇచ్చారు.. త్రిగుణ్ కెప్టెన్‌గా బాగా చేశాడని వంశీ ఒక్కడే సపోర్ట్ చేయగా, మిగతా వాళ్లు ఎందుకు చేతులెత్తలేదో నాగ్ వివరించారు. త్రిగుణ్‌ మంచివాడే అయినా, తన హార్ష్ మాటల వల్లే అందరూ అతన్ని దూరంగా పెడుతున్నారని, కూల్‌గా పనులు చేయించుకోవాలని చెప్పారు.

శివ్ గట్టిగా అరవడంపై మందలించిన నాగార్జున, రామ్ ప్రసాద్ గేమ్ ఏమాత్రం బాగోలేదని తేల్చిచెప్పారు. చివరగా నామినేషన్స్‌లో ఉన్నవారికి పెట్టిన స్పెషల్ టాస్క్‌లో అమన్ సేఫ్ అయ్యాడు. మొత్తానికి ఈ శాటర్డే ఎపిసోడ్(Saturday Episode) కంటెస్టెంట్లకు చెమటలు పట్టించగా, దీపావళి స్పెషల్ ఎపిసోడ్ హౌస్‌లో టపాసులు పేలుస్తుందో లేక దీపావళి కానుకగా ఎలిమినేషన్‌ను వాయిదా వేస్తారో చూడాలి.

Karthika Masam : కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం? ఈ మాసంలో పాటించాల్సిన పవిత్ర నియమాలేంటి?

↑
Exit mobile version