Karthika Masam : కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం? ఈ మాసంలో పాటించాల్సిన పవిత్ర నియమాలేంటి?

Karthika Masam : 2026 లో కార్తీక మాసం నవంబర్ 10న ప్రారంభమై డిసెంబర్ 8న ముగుస్తుంది. కార్తీక సోమవారాల తేదీలు , విశిష్టతల సంపూర్ణ సమాచారం ఇక్కడ ఉంది.

Karthika Masam

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం, 2026 సంవత్సరంలో కార్తీక మాసం నవంబర్ 10, మంగళవారం రోజు ప్రారంభమై.. డిసెంబర్ 8, మంగళవారం కార్తీక అమావాస్యతో ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పాటించే ఆచారాల ప్రకారం, దీపావళి అమావాస్య ముగిసిన మరుసటి రోజు నుంచి ఈ పవిత్ర మాసం లెక్క మొదలవుతుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి ఒక్క రోజుకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది.

ఈ ఏడాది కార్తీక మాసం(Karthika Masam)లో నవంబర్ 16న మొదటి సోమవారం, నవంబర్ 23న రెండవ సోమవారం, నవంబర్ 30న మూడవ సోమవారం, డిసెంబర్ 7వ తేదీన నాలుగో సోమవారం రానున్నాయి. ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి.. నవంబర్ 24, మంగళవారం రోజు రానుంది. ఈ నెల రోజులు కూడా పరమశివుడికి అభిషేకాలు చేయడం, విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడం, ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను వెలిగించడం వల్ల అనంత పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

కార్తీక మాసం(Karthika Masam) అంటే కేవలం పూజలు, వ్రతాలే కాకుండా బాడీకి, మనస్సుకు ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణను అలవాటు చేసే కాలంగా భావిస్తారు. తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నదీ స్నానాలను ఆచరించడం, రోజంతా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినడం, నిత్యం దీపారాధన చేయడం, దానధర్మాలు చేయడం ద్వారా ఈ మాసంలో మనసు, శరీరం పవిత్రంగా ఉండటమే కాకుండా శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

Cat On The Wall Mentality : మీ సర్కిల్‌లో గోడ మీద పిల్లి ఉన్నారా? వారి బిహేవియర్ వెనుకున్న సైకాలజీ ఏంటి?

↑
Exit mobile version