Weekend Episode
వీకెండ్ ఎపిసోడ్ శాటర్డే, సండే రోజు వచ్చిందంటే చాలు, హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌కి షాకులు, వార్నింగ్‌లు, క్లాస్‌లు ఇవ్వడం కామన్. అయితే ఈసారి శనివారం ఎపిసోడ్(Weekend Episode) మాత్రం అంతకు మించి అన్నట్లుగా ఊహించని గొడవలు, రూల్స్ బ్రేకింగ్స్‌తో నెక్స్ట్ లెవెల్ హీటెక్కిపోయింది. ఎప్పటిలాగే డ్యాన్స్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఆడియన్స్‌తో కాసేపు మాట్లాడాక అసలు కథలోకి దిగారు.
హౌస్‌లో ముకేష్ తనని పట్టించుకోవడం లేదంటూ ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకోవడంతో ముకేష్ ఆమెను ఓదార్చాడు. దాని తర్వాత వాష్ రూమ్ దగ్గర క్లాత్స్ విషయంలో త్రిగుణ్, రోహిత్ మధ్య జరిగిన గొడవ హౌస్‌ను షేక్ చేసింది. రోహిత్ బట్టలు మడతపెట్టకుండా అక్కడే పడేయడంతో త్రిగుణ్ వాటిని కింద పడేశాడు. దీనికి ఊగిపోయిన రోహిత్.. త్రిగుణ్‌ను బూతులు తిడుతూ, కొడతానంటూ రెచ్చిపోయాడు.
ఇక కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రామ్ ప్రసాద్.. తనకు వచ్చిన రెండు గోల్డ్ కాయిన్స్‌ను నరేష్, దేబ్జానీకి పంచాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అర్ధరాత్రి పూట కూడా రోహిత్,షాలిని లవ్ ట్రాక్ నడిపిస్తూ గుసగుసలాడుకోవడం, ఇప్పటికే దీనిపై నాగ్ క్లాస్ పీకినా, చివరకు హౌస్‌లో కూడా బిగ్‌బాస్ మూడుసార్లు వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయకపోవడం పెద్ద హాట్ టాపిక్ అయింది.
హౌస్‌లోకి వచ్చే ముందు రోహిత్ వాళ్ల అమ్మ చెప్పిన విషయాలన్నిటినీ నీతూ.. రోహిత్‌కి లీక్ చేసింది. ఇదేంటని నిలదీసిన నాగార్జున.. నీతూని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి కాస్త గట్టిగానే క్లాస్ పీకారు. ఆట ఆడటానికి వచ్చావా? లేదంటే హౌస్‌లో వాళ్లకి కోచింగ్ ఇస్తున్నావా? అంటూ ఫైర్ అయ్యారు. బయటి విషయాలను ఇక్కడ చెప్పకూడదనే బిగ్‌బాస్ బిగ్ రూల్ బ్రేక్ చేసినందుకు నీతూ కంటతడి పెట్టుకోవడంతో.. మరోసారి రిపీట్ అయితే మాత్రం డైరెక్ట్ హౌస్ నుంచి బయటికి గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
లాస్ట్ వీక్ నాగ్ వార్నింగ్ ఇచ్చినా కూడా అది ఫాలో అవకుండా అమన్, షాలిని, రోహిత్ ముగ్గురూ కలిసి నామినేషన్స్ గురించి గ్రూప్‌గా ప్లాన్ చేసుకున్న కన్నింగ్ వీడియోను నాగ్ అందరి ముందు ప్లే చేశారు. షాలిని ఎంత కవర్ చేయడానికి ట్రై చేసినా నాగార్జున ఎక్కడా తగ్గలేదు. రూల్స్ ఉల్లంఘించారన్న రీజన్‌తో ఈ ముగ్గురికి వచ్చే వారం కెప్టెన్సీకి పోటీపడే అర్హత కూడా లేదని షాకింగ్ పనిష్మెంట్ ఇచ్చారు.
అంతేకాదు, త్రిగుణ్‌ను షాలిని బూతులు తిట్టిన వీడియో, నీతూని మెంటల్ అని గొడవపడిన క్లిప్స్‌ను కూడా బయటపెట్టి నాగ్ షాలినితో ఓ ఆట ఆడుకున్నారు. త్రిగుణ్‌కు షాలినితో సారీ చెప్పించడంతో పాటు షాలినికి డబుల్ డ్యూటీ వేయాలని రామ్ ప్రసాద్‌కు ఆర్డర్ వేశారు.
మధ్యలో రోహిత్ కల్పించుకోవడానికి ట్రై చేయడంతో..నీ గురించి చెప్పు, వేరే వాళ్ల గురించి నీకెందుకు అంటూ రోహిత్‌కి కూడా గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. అమన్‌ను రోహిత్ దొబ్బి తినడానికి వస్తున్నారు అనడంపై కూడా డిస్కషన్ జరిగి, ఫైనల్‌గా ఆ విషయంలోనూ రోహిత్ తప్పేనని నాగ్ తేల్చేశారు.
ఫుడ్ విషయంలో త్రిగుణ్.. రోహిత్ గ్యాంగ్‌ను రొట్ట గ్యాంగ్ అనడంపై డిస్కస్ చేసిన నాగార్జున.. రోహిత్ సరిగ్గా ఆడట్లేదని మొహం మీదనే చెప్పేశారు. చివరగా వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్‌లో అసలు ఫైరే లేదని, వారి సంగతి ఆదివారం చూద్దామని చెప్పి ఎపిసోడ్(Weekend Episode)ను క్లోజ్ చేశారు.టోటల్‌గా షాలిని అరుపులు, ఓవరాక్షన్స్కు నాగార్జున గట్టిగానే బ్రేక్ వేసి, కంటెస్టెంట్స్ ఫ్యూజులు ఎగిరేలా చేయడంతో ఆడియన్స్ కూడా కూల్ అయ్యారు. మరి సండే ఎలిమినేషన్లో ఎవరు బయటకు వెళతారో చూడాలి.
