Weekend Marriages : ట్రెండ్‌గా మారుతున్న వీకెండ్ మ్యారేజెస్..సరికొత్త కాన్సెప్ట్‌తో లైఫ్‌స్టైల్ ఛేంజ్
Weekend Marriages : ప్రతి నాణేనికి కూడా రెండు వైపులా ఉన్నట్లే.. ఈ వీకెండ్ మ్యారేజ్ ట్రెండ్ వల్ల కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి.
Weekend Marriages
సాధారణంగా పెళ్లయ్యాక భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. కానీ ఇప్పుడు ఇద్దరూ జాబ్‌ల వల్ల వేర్వేరు సిటీలలో ఉంటున్నారు. ఒకవేళ ఒకే నగరంలో ఉంటున్నా ఆఫీసులకు దగ్గరగా వేరు వేరు ఇంటిలో ఉంటున్నారు. మండే నుంచి ఫ్రైడే వరకు ఎవరి జాబ్స్ వారివే, ఎవరి లైఫ్ వారిదే. మళ్లీ సాటర్డే, సండే రాగానే ఇద్దరూ ఒకచోట కలుసుకుని వీకెండ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు.
ఇలా వీక్ డేస్‌లో దూరంగా, వారాంతంలో భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండటాన్నే వీకెండ్ మ్యారెజెస్(Weekend Marriages) అంటున్నారు. ఇద్దరూ బాగా చదువుకుని, మంచి పొజిషన్లలో ఉండటం వల్ల.. ఒకరి కోసం వేరొకరు కెరీర్ పాడు చేసుకోకూడదని, అలాగే ఇద్దరూ జాబ్‌లు చేస్తే ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ఈ డెసిషన్ ఎక్కువగా తీసుకుంటున్నారు.
ఈ ట్రెండ్ వల్ల జరుగుతున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే..ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్య అస్సలు గొడవలు రావు. రోజూ కలిసి ఉంటే వచ్చే చిన్న చిన్న గొడవలు, ఇరిటేషన్స్ వీళ్ల దగ్గర కనిపించవు. పైగా ఐదు రోజులు ఒకరినొకరు మిస్ అవ్వడం వల్ల, వీకెండ్ ఎప్పుడొస్తుందా అని ఇద్దరూ వెయిట్ చేస్తుంటారు.
కలిసిన ఆ రెండు రోజులు కూడా ఒకరినొకరు చాలా స్పెషల్‌గా, కేరింగ్‌గా చూసుకుంటారు. కెరీర్ పరంగా ఎవరి గ్రోత్ వారికుంటుంది కాబట్టి ఫైనాన్షియల్‌గా ఇద్దరూ స్ట్రాంగ్‌గానే ఉంటారు. అంతేకాకుండా ఒకరి స్పేస్‌ని ఇంకొకరు గౌరవించడం ఈ బంధంలో హైలైట్ అని చెప్పొచ్చు.
అయితే ప్రతి నాణేనికి కూడా రెండు వైపులా ఉన్నట్లే.. ఈ వీకెండ్ మ్యారేజ్(Weekend Marriages) ట్రెండ్ వల్ల కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. కేవలం వీకెండ్స్ మాత్రమే వీరు కలవడం వల్ల లాంగ్ రన్లో ఇద్దరి మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ అంతగా కనిపించదు.

అలాగే మిగతా ఐదు రోజులు ఎవరికి వారే ఉండటం వల్ల కొంచెం లోన్లీగా కొందరు ఫీలయితే మరికొందరు మాత్రం పార్ట్నర్ను కలిసినప్పుడు తన ఫ్రీడమ్‌ను కోల్పోయినట్లు ఫీలవుతుంటారు. అంతేకాదు వీరిద్దరూ ఒకవేళ పొరపాటున వీకెండ్స్‌లో కూడా వేరే ఇతర పనుల వల్ల కలవలేకపోతే.. ఆ గ్యాప్ మరింతగా పెరిగిపోతుంది. ఫ్యూచర్లో పిల్లలు పుట్టాక కూడా ఇదే లైఫ్‌స్టైల్ కంటిన్యూ చేయడమంటే చాలా కష్టంగా మారుతుంది.
మొత్తంగా ఈ వీకెండ్ మ్యారేజ్ అనేది అందరికీ సెట్ అవ్వకపోవచ్చనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని, ఈగోలు పక్కన పెట్టి ఈట్రెండ్ను ఫాలో అయితే మాత్రం.. కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేయడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఏది ఏమైనా ప్రెజెంట్ జనరేషన్ ఆలోచనలకు, మారుతున్న సొసైటీకి ఈ ట్రెండ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది.
Trump : ట్రంప్ ఫ్యామిలీ శవపేటికలతో బ్యానర్..బ్లడ్ ఫర్ బ్లడ్ అంటూ ఇరాన్ మరోసారి వార్నింగ్





