OTT Movies
దీపావళి పండుగ హడావుడితో పాటు మూవీ లవర్స్‌ను అలరించేందుకు ప్రముఖ ఓటీటీ(OTT Movies) వేదికలు సరికొత్త సినిమాలతో సిద్ధమయ్యాయి. థియేటర్లలో సరికొత్త మూవీలు సందడి చేస్తుంటే, నవంబర్ 2 నుంచి 8వ తేదీ మధ్య నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, సన్‌నెక్స్ట్, ఈటీవీ విన్ వంటి ఓటీటీల్లోకి లోకల్ అండ్ డబ్బింగ్ మూవీలు చాలానే విడుదలయ్యాయి.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఐయామ్ గేమ్.. ఈరోజు అంటే నవంబర్ 6వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చి విశేష ఆదరణ పొందుతోంది. లగడపాటి విక్రమ్ నటించిన తెలుగు మూవీ ‘అనకాపల్లి’ నవంబర్ 3 వ తేదీ నుంచి సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, ప్రియమణి నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్ గేమ్’ జీ5 లో కూడా ఇప్పటికే అందరినీ అలరిస్తోంది.
దీపావళి బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన హిందీ మూవీ ‘దిల్వాలీ దివాలీ’ నవంబర్ 5 వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
అలాగే, అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘హైవాన్’, అలాగే తమిళ హిట్ మూవీ ‘మీశయ మురుక్కు 2’ సోనీలివ్ ద్వారా ఓటీటీ ఆడియన్స్ పలకరించాయి.
అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ‘బాలు అండ్ గీత’ మూవీ ఈటీవీ విన్‌లో సందడి చేస్తోంది. పిల్లల కోసం ‘మినియన్స్ అండ్ మాన్‌స్టర్స్’ జియో హాట్‌స్టార్‌లో, హాలీవుడ్ ఫ్యామిలీ మూవీ ‘యే డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్’ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని నిర్మించిన డాక్యుమెంటరీ ‘టేకెన్: నటాలీ హాలోవే’ నెట్‌ఫ్లిక్స్‌లో, యూత్‌ఫుల్ వెబ్‌సిరీస్ ‘క్యాంపస్ డ్రైవర్స్’ అమెజాన్ ప్రైమ్‌లో అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.
SmartPhone Prices : మొబైల్స్‌పై ఏఐ ఎఫెక్ట్.. 30 శాతం వరకు పెరగనున్న ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు
