Telangana Cabinet
ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పాలనా సంస్కరణలు అలాగే న్యాయ వ్యవస్థ బలోపేతంపైన కూడా విస్తృతంగా చర్చించిన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) కొన్ని సంచలన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక ధీమాను కల్పించడానికి రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంను నవంబర్ 19వ తేదీన సిద్దిపేటలో జరిగే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సభలో ప్రారంభించనున్నారు.
ఈ పథకం ఎంట్రీ కోసం నవంబర్ 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ప్రత్యక్షంగా అప్లికేషన్లను సేకరించి తహశీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులకు అందజేస్తాయి. దీంతో పాటు, నిర్మాణ పూర్తయిన 2లక్షల25వేల ఇందిరమ్మ నివాసాల్లో లబ్ధిదారులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
సామాజిక న్యాయం టార్గెట్‌గా 2003 నాటి తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చట్టంను క్యాన్సిల్ చేస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వేర్వేరుగా 2 స్పెషల్ కమిషన్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. చైర్మన్‌తో పాటు ఐదుమంది సభ్యులతో కూడే ఈ కమిషన్లు ఆయా వర్గాల ఫిర్యాదులు స్పీడ్‌గా పరిష్కరించడానికి ఇవి తోడ్పడతాయి. న్యాయ పరిపాలనను విస్తరింపజేసేటపుడు కాటారం, ఎల్కతుర్తి కొత్త కోర్టులకు 56 పోస్టులను, అలాగే సిద్దిపేట, చౌటుప్పల్, మహబూబాబాద్, వేములవాడ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు మరొక 80 పోస్టులు కేటాయిస్తూ మొత్తం 136 కొత్త ఉద్యోగాల భర్తీకి అనుమతిని ఇచ్చారు.
ప్రజా సేఫ్టీ పరిరక్షణకు తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999 సవరణ ఆర్డినెన్స్ జారీకి కేబినెట్(Telangana Cabinet) అంగీకరించగా, నివాస సముదాయాలు , వ్యాపార కేంద్రాల యజమానులు పాటించాల్సిన భద్రతా నియమాలు దీనిలో క్లియర్‌గా వివరించారు. భూ సర్వే వివాదాలను వేగంగా పరిష్కరించడానికి సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ సెక్షన్ 12(ఏ) ను సవరిస్తూ అప్పీల్ కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు.
తెలంగాణ గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడానికి డిసెంబర్ 7, 8, 9 తేదీలలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించడమే కాకుండా, వివిధ ప్రభుత్వ శాఖల డెవలప్మెంట్ నీడ్స్ కోసం ఏడు వేర్వేరు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూముల కేటాయింపునకు కూడా ఆమోదం తెలిపారు.కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కొడంగల్ పర్యటనలో భాగంగా.. 9వ తేదీన అక్కడ భారీ రైతు సభలో పాల్గొంటారు.
