GiriBabu
తెలుగు సినిమాల్లో కొన్ని ముఖాలు తెర మీద కనిపించగానే ఆడియన్స్‌కు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. హీరోగా కనిపించినా, విలన్‌గా భయపెట్టినా, కథను ముందుకు నడిపించే కీ రోల్‌లో మెరిసినా.. తనదైన ముద్ర వేసే యాక్టర్స్ కొందరే ఉంటారు. అలాంటి విలక్షణ నటుల్లో గిరిబాబు(Giribabu) ఒకరు.
దశాబ్దాల పాటు తెలుగు ఆడియన్స్‌ను తన యాక్షన్‌తో అలరించిన గిరిబాబు ఇక లేరనే వార్త సినీ అభిమానులను కలచివేస్తోంది. 80 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గిరిబాబు (Giribabu)మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
1946 జూన్ 8వ తేదీన ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు చిన్నప్పటి నుంచే మూవీలపై ఆసక్తి పెంచుకున్నారు. 1973లో రిలీజ్ అయిన ‘జగమే మాయ’ సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ మూవీతో విలన్‌గా తన సినీ జర్నీని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత వరుసగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు.
తొలిరోజుల్లో విలన్ పాత్రలతో అందరికీ దగ్గరైన గిరిబాబు.. మెల్లగా తన నటనలోని విభిన్న కోణాలను బయటపెట్టారు. కేవలం విలన్ రోల్స్‌కే పరిమితం కాకుండా స్టోరీకి అవసరమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ రాణించారు. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా అందరికీ పదికాలాలు గుర్తుండిపోయేలా చేయడం గిరిబాబు ప్రత్యేకతగా నిలిచింది. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించారు.
గిరిబాబు జర్నీ నటనతోనే ఆగిపోలేదు. సినిమా నిర్మాణం, డైరెక్షన్ విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ఒక యాక్టర్‌గా తెరపై కనిపిస్తూనే, చిత్ర నిర్మాణంలో ఇతర బాధ్యతలను కూడా చేపట్టారు. దీంతో తెలుగు సినీ రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గిరిబాబు గుర్తింపు పొందారు.
గిరిబాబు తన ఇద్దరు కొడుకులను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పెద్ద కొడుకు రఘుబాబు స్టార్ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తూ తాజాగా..నిన్నే దొంగ నా కొడుకు మూవీలో నటించారు. చిన్న కొడుకు బోసుబాబు ఇంద్రజిత్ వంటి సినిమాల్లో హీరోగా అలరించి ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నారు. భార్య శ్రీదేవి 2016లోనే మరణించారు.
ఎన్నో ఏళ్లు విభిన్న పాత్రలు పోషించిన గిరిబాబు మరణం.. సీనియర్ నటుల తరానికి తీరని లోటుగా మిగిలిపోతుందనేది నిజం. ఆయన నటించిన చిత్రాలు ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. దశాబ్దాల పాటు సాగిన గిరిబాబు(Giribabu) సినీ ప్రస్థానం కొత్త తరానికి కూడా స్ఫూర్తిదాయకంగా మిగలనుంది.
Doomsday : 66 ఏళ్ల క్రితం నాటి ప్రళయం అంచనా.. నిన్నటితో ముగిసిన డూమ్స్‌డే డేట్ ఎందుకు తప్పింది?
