Rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ ముందు అడుగు పెడితే ఏ రేంజ్లో విధ్వంసం జరుగుతుందో ‘జైలర్ 2’ మరోసారి ప్రూవ్ చేసింది. తన 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎప్పుడూ లేని విధంగా తలైవా ఒక అరుదైన పనిచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మాసివ్ హిట్ మూవీని చెన్నై వేలచ్చేరిలోని ఫీనిక్స్ మాల్ పీవీఆర్ థియేటర్లో రజనీకాంత్(Rajinikanth) సీక్రెట్‌గా ఆడియన్స్ మధ్య కూర్చుని వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కలిసి థియేటర్లోకి వచ్చిన రజనీ.. ఫ్యాన్స్ వేసే విజిల్స్, గోల మధ్య మూవీని ఆస్వాదిస్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేయడంతో నెట్టింట అది వైరల్‌గా మారింది.
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే జైలర్ 2 రిలీజైన కొద్ది రోజుల్లోనే.. వరల్డ్ వైడ్‌గా రూ. 500 కోట్ల క్లబ్లో చేరి రికార్డులను తిరగరాస్తోంది. కేవలం అభిమానులను కాకుండా సెలబ్రెటీలు కూడా తలైవా యాక్షన్‌కు, నెల్సన్ టేకింగ్‌కు ఫిదా అయిపోతున్నారు.
లోకనాయకుడు కమల్ హాసన్ ఈ మూవీపై స్పెషల్‌గా ట్వీట్ చేస్తూ.. నా ప్రియ మిత్రుడు రజనీకాంత్(Rajinikanth)తో పాటు డైరెక్షన్ నెల్సన్, అనిరుధ్, సన్ పిక్చర్స్ టీమ్‌కి హృదయపూర్వక అభినందనలని శుభాకాంక్షలు తెలిపారు. దానికి నెల్సన్ రియాక్ట్ అవుతూ కమల్ సర్ నుంచి ప్రశంసలు రావడం మర్చిపోలేని అనుభూతి అంటూ అన్నారు.
బాలీవుడ్ యాక్టర్ రితేశ్ దేశ్‌ముఖ్ అయితే థియేటర్లోనే ఇంటర్వెల్ టైమ్‌లోనే పోస్ట్ పెడుతూ.. సూపర్స్టార్డమ్కు మరో పేరు రజనీ సర్.. థియేటర్లో ప్రతి సీన్‌కి అరిచి విజిల్స్ వేశానని, ఇది పక్కా సంబరమంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.
ఇక ధనుష్ ఫస్ట్ రోజే మూవీ చూసి ప్రతీ తలైవా అభిమానులు తప్పక చూడాల్సిన పండుగ వంటి సినిమా అని కొనియాడారు. ఐకానిక్ మూవీ ‘బాషా’ తర్వాత రజనీకాంత్ అసలైన ఆరా, మాస్‌ను పర్ఫెక్ట్గా వాడుకున్న మూవీ ఇదేనని లింగుస్వామితో పాటు కార్తీక్ సుబ్బరాజ్, వెంకట్ ప్రభు కితాబిచ్చారు. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ల కలయిక ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
Decision : లైఫ్‌లో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? కన్ఫ్యూజన్కు ఇలా చెక్ పెట్టండి..
