IND VS NZ : రెండో టీ20లో న్యూజిలాండ్‌కు టీమిండియా షాక్..భారత్‌ను గెలిపించిన తిలక్, నితీశ్..

IND VS NZ : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మ్యాచ్ హైలైట్స్ , సిరీస్ వివరాలు ఇక్కడ చూడండి.

IND VS NZ

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన వల్ల భారత్ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఒక స్టేజిలో ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌ను మనోళ్లు ఊహించని మలుపు తిప్పారు . క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ మైదానంలో న్యూజిలాండ్‌(IND VS NZ)తో జరిగిన అత్యంత ఉత్కంఠభరిత జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత ఘనవిజయాన్ని నమోదు చేసింది. కివీస్ విసిరిన భారీ టార్గెట్‌ను ఛేదించే సమయంలో వరుస వికెట్లు కోల్పోయి తడబడినా కూడా.. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పోరాటంతో టీమిండియా జయకేతనాన్ని ఎగరవేసింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నిర్ణయానికి తగ్గట్లే స్టార్టింగ్‌లో బౌలర్లు రాణించారు. సీఫెర్ట్, మిచెల్, ఫిన్ అలెన్‌ను త్వరగానే పంపేశారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. అయితే గ్లెన్ ఫిలిప్స్ (70), బెవన్ జాకబ్స్ (58) అర్థసెంచరీలతో విరుచుకుపడి నాలుగో వికెట్‌కు ఏకంగా 116 రన్స్ జోడించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 రన్స్‌తో భారీ స్కోరును భారత్‌ ముందు ఉంచింది.

181 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు స్టార్టింగ్‌లోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (14), వైభవ్ సూర్యవంశీ (4) డిజప్పాయింట్ చేశారని ఫీలవుతుండగానే.. అభిషేక్ శర్మ (27), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (7) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దీంతో మ్యాచ్ పూర్తిగా న్యూజిలాండ్ జట్టు చేతుల్లోకి వెళ్లిపోయిందని అంతా ఫిక్స్ అయిపోయారు.

అలాంటి టైమ్‌లో తెలుగు కుర్రాళ్లు క్రీజులో అడుగుపెట్టి ఆతిథ్య జట్టు ఏ మాత్రం ఊహించని విధంగా రచ్చ లేపారు. ఒత్తిడిని ఏమాత్రం లెక్క చేయకుండా తిలక్ వర్మ (51: 1 ఫోర్, 6 సిక్సర్లు) క్లాసిక్ షాట్లు కొట్టి.. స్కోరు బోర్డును పరుగులు తీయించగా, నితీశ్ కుమార్ రెడ్డి (26) అతనికి ధనాధన్ ఇన్నింగ్స్‌తో మంచి కోఆపరేషన్ అందించాడు. చివరి 2 ఓవర్లలో టెన్షన్ నెలకొన్నా.. పక్కా ప్లాన్‌తో బౌండరీలు బాదుతూ మొత్తంగా లక్ష్యాన్ని ముద్దాడారు. ఈ క్రేజీ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో(IND VS NZ) భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలబడింది.

Upasana Konidela : యాంకర్ సుమపై ఉపాసన ప్రశంసలు.. ఆ మహిళలకు ఉపాసన వార్నింగ్..

↑
Exit mobile version