Janhvi Kapoor : పెద్ది నుంచి అచ్చియమ్మ అరాచకం.. జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్ అదిరింది..

Janhvi Kapoor : జాన్వీ తన గ్లామర్‌తోనే కాకుండా, ఈ సినిమాలో తన యాక్షన్‌తోనూ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైపోయింది.

Janhvi Kapoor

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉప్పెన డెరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా రిలీజైన ఒక చిన్న వీడియో సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది.

పెద్దిలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మార్చి 6న మూవీ యూనిట్ ఒక ప్రత్యేకమైన వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తూ జాన్వీకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ వీడియోలో జాన్వీ కపూర్ కనిపిస్తున్న విధానం చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమనిపిస్తోంది.

Janhvi Kapoor

ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor).. అచ్చియమ్మ అనే పక్కా మాస్ పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించగా, ఇప్పుడు వచ్చిన వీడియోలో ఆమె విజువల్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. బుచ్చిబాబు తనదైన శైలిలో అచ్చియమ్మ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. జాన్వీ తన గ్లామర్‌తోనే కాకుండా, ఈ సినిమాలో తన యాక్షన్‌తోనూ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైపోయింది. రామ్ చరణ్ సరసన ఆమె కెమిస్ట్రీ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

పాన్ ఇండియా లెవల్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్ ఊర మాస్ లుక్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బుచ్చిబాబు మేకింగ్ వెరసి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అచ్చియమ్మ స్పెషల్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతూ మూవీపై అంచనాలను పీక్స్‌కు తీసుకుని వెళ్లిపోయింది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version