Krishnashtami At Konidela House
మెగా ఫ్యామిలీలో ఏ పండుగ అయినా మెగా సంబురంగానే జరుగుతుంది. తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వీరి నివాసంలో కన్నయ్య వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరిగాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ వేడుకకు మరింత అందాన్ని తీసుకువచ్చారు.
కొణిదెల వారి ఇల్లంతా పండుగ వాతావరణం ఉట్టిపడుతూ, కళ్లు చెదిరే రేంజ్‌లో లైటింగ్, పూల అలంకరణలతో మెరిసిపోయింది. ఈ పర్వదినాన చెర్రీ, ఉపాసన తమ ముద్దుల కుమార్తె క్లీంకార అలాగే రీసెంట్‌గా ఈ కుటుంబంలోకి అడుగుపెట్టిన కవల పిల్లలు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
బుల్లి కృష్ణుడు, రాధగా ముస్తాబయిన ఇంట్లోని చిన్నారులు సందడి చేయడంతో సెలబ్రేషన్స్ పీక్స్‌కు వెళ్లాయి. క్లీంకారాతో పాటు శివ్ రామ్, అన్వీరలు వేసిన క్యూట్ క్యూట్ రాధాకృష్ణుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కొణిదెల వారి ఇల్లు ఆ ముద్దులొలికే చిన్నారుల సందడితో డివైన్ వైబ్స్‌తో, ఆనందంతో నిండిపోయింది. కుటుంబసభ్యులంతా ఆధ్యాత్మిక చింతనతో ఈ పూజలో పాల్గొని కృష్ణాష్టమి వేడుకను ఎంతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ కలర్‌ఫుల్ పిక్స్‌ను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయాయి. చిన్నారుల క్యూట్ లుక్స్‌కి మెగాభిమానులు, నెటిజన్లు ఫిదా అయి లవ్ సింబల్స్‌తో కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.
అంతటి బిజీ షెడ్యూల్స్ ఉన్నా సరే, తెలుగింటి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ కుటుంబ సమేతంగా పండుగలు జరుపుకొనే చరణ్ ఉపాసన జోడీపై ప్రశంసలు కురుస్తున్నాయి.మొత్తంగా ఆధ్యాత్మిక వాతావరణంలో, బంధాలను మరింత పెంచేలా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి సంబురాలు మెగా ఇంట్లో కొత్త వెలుగులను నింపాయి.
Carb Cravings : రైస్ తింటేనే పొట్ట ఫుల్ అనే ఫీలింగ్ వస్తోందా? ఇది ఆకలా లేక క్రేవింగా?
