Just LifestyleLatest News

Carb Cravings : రైస్ తింటేనే పొట్ట ఫుల్ అనే ఫీలింగ్ వస్తోందా? ఇది ఆకలా లేక క్రేవింగా?

Carb Cravings : బ్రెడ్, బిస్కెట్లు, కేకులు, అన్నం వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తిన్నాక.. కార్బ్ క్రేవింగ్స్ ఇంకా ఎక్కువ వస్తుంటాయి.

Carb Cravings

ప్లేట్ నిండా రకరకాల స్టార్టర్లు, వెరైటీ ఫుడ్స్, ఇష్టమయిన టిఫిన్స్ ఎన్ని లాగించినా.. కడుపులో వైట్ రైస్ తినకపోతే ఈ రోజు అస్సలు భోజనం చేసినట్టే లేదని, నీర్సం వచ్చేసిందని అనేవారు మన చుట్టూ చాలామందే ఉంటారు. సౌత్ ఇండియాలో పుట్టి పెరిగిన సుమారు ప్రతి ఒక్కరి ఇంట్లో రోజూ ఈ మాటలు వింటూనే ఉంటాం. అసలు రైస్ తింటేనే కడుపు నిండినట్టా..అప్పుడే మనసు ప్రశాంతంగా ఉన్నట్టు ఎందుకనిపిస్తుందనే విషయాలు చాలామందికి అర్థం కావు.

సౌత్ ఇండియన్స్‌కి అన్నం అనేది కేవలం ఫుడ్ కాదు, ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచీ కూడా ఇంట్లో ప్లేట్‌లో అన్నం పెట్టి తినిపించడం వల్ల అందరి బ్రెయిన్‌ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది. నిజానికి రైస్‌లో చాలా ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మన శరీరం అన్నంను డైజెస్ట్ చేసుకుని త్వరగా గ్లూకోజ్‌గా మార్చడం వల్ల బ్రెయిన్‌కి ఇనిస్టెంట్‌గా ఎనర్జీ వస్తుంది. దీనివల్లే మనిషిలో అన్నం తినాలన్న కోరిక బలంగా ఉంటుంది. దీనినే మెడికల్ భాషలో కార్బ్ క్రేవింగ్ అంటారు. అంటే రైస్ వంటి పిండి పదార్థాలున్న ఫుడ్‌ను మళ్లీ మళ్లీ తినాలనిపించే పవర్ ఫుల్ కోరిక అన్నమాట.

Carb Cravings
Carb Cravings

అయితే ఇక్కడ కడుపు నిండడం వేరు, మనసు నిండడం వేరు అనే విషయాన్ని అంతా గమనించాలి. ప్రొటీన్లు ఉన్న కూరగాయలు, పప్పులు ఎంత తిన్నా కూడా మనసుకు సంతృప్తి అనిపించకపోవడానికి చిన్నప్పటి నుంచి మనలో జీర్ణించుకుపోయిన సైకలాజికల్ ఫీలింగ్ మాత్రమే కారణం. అలా అని దీన్ని డ్రగ్స్ వంటి అడిక్షన్‌తో పోల్చకూడదు.

బ్రెడ్, బిస్కెట్లు, కేకులు, అన్నం వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తిన్నాక.. ఈ కార్బ్ క్రేవింగ్స్ ఇంకా ఎక్కువ వస్తుంటాయి. అయితే అన్ని కార్బోహైడ్రేట్లు చెడ్డవి కావు. పండ్లు, పప్పు ధాన్యాల్లో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా మంచివి. అందుకే బ్రెయిన్.. మైండ్ గేమ్ ఆడకుండా ఉండాలంటే ఏదైనా ఫుడ్ తినేటపుడు హడావుడిగా మింగేయకుండా నమిలి తినండి. దాంతో కడుపు నిండిందనే సిగ్నల్ బ్రెయిన్‌కి అంది వైట్ రైస్ కూడా తింటే బాగుణ్ణు అన్న ఫీలింగ్‌ను తగ్గిస్తుంది

First Selfie : స్మార్ట్‌ఫోన్ పుట్టకముందే ఫస్ట్ సెల్ఫీ ..ఫ్రంట్ కెమెరా లేకుండానే సెల్ఫీ ఎలా తీశారు?

Related Articles

Back to top button